ఈ సినిమా నాకు మరో అతడు
12-01-202112-01-2021 14:28:54 IST
Updated On 12-01-2021 15:15:40 ISTUpdated On 12-01-20212021-01-12T08:58:54.701Z12-01-2021 2021-01-12T08:58:48.604Z - 2021-01-12T09:45:40.441Z - 12-01-2021

త్రివిక్రమ్ సినిమాలు అంటే చాలు ఎన్ని సార్లు చూసినా కూడా బోర్ కొట్టవు..! ఆయన పెన్ నుండి జాలువారిన ఎన్నో సినిమాలు ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తూనే ఉన్నాయి. ఇక త్రివిక్రమ్-అల్లు అర్జున్ కాంబినేషన్ లో వచ్చిన అల వైకుంఠపురంలో సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. పాటలతో పాటూ.. సీన్స్ కూడా అద్భుతంగా కుదరడం పెద్ద ప్లస్ పాయింట్ గా చెప్పుకోవచ్చు. ఈ సినిమా విడుదలై ఏడాది పూర్తీ అయిన సందర్భంగా చిత్ర యూనిట్ చిన్న ఫంక్షన్ ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో త్రివిక్రమ్ ఈ సినిమాకు సంబంధించిన జర్నీ గురించి చెప్పుకొచ్చారు. కొన్ని సంవత్సరాల క్రితం అల్లు అర్జున్ నేను బాల్కనీలో కూర్చుంటూ బ్లాక్ కాఫీ తాగుతూ ఏదో ఒక సినిమా చేయాలి.. మంచి సినిమా చేయాలని అనుకున్నాం.. కానీ ఏం చేయాలో అప్పటికీ ఏది తెలియదు.. అలా ఈ సినిమా గురించి చర్చలు మొదలయ్యాయి. ఓ స్టోరీ లైన్ రాసుకోవడం దాన్ని డెవలప్ చేస్తూ అలా అలా ముందుక తీసుకెళ్లడం జరిగిందని త్రివిక్రమ్ తెలిపారు. ఈ సినిమా మమ్మల్ని ఎంతో పని చేయించిందని.. కొన్ని సీన్లను రీషూట్స్ కూడా చేయించామని.. ఆ నిర్ణయం సరైనదేనని ఒప్పుకున్నారు త్రివిక్రమ్. అల వైకుంఠపురములో సినిమాలో బన్నీకి తెలియకుండా ఏది జరగలేదు. ప్రతీ సీన్ ప్రతీ డైలాగ్ స్క్రిప్ట్, సెట్ ఇలా ప్రతీ ఒక్కటీ బన్నీకి తెలుసు. బన్నీకి తెలియకుండా సినిమాకు సంబంధించిన ఏ విషయం కూడా జరగలేదు. చివరకు స్క్రిప్ట్ అంతా రెడీ అయ్యాక అల్లు అరవింద్‌కు చూపించామన్నారు. షూటింగ్ ఎప్పుడు మొదలుపెడుతున్నారని ఆయన అడగడంతో అప్పుడు నేను బన్నీ సినిమా ఫిక్స్ అయిందని నిర్ణయించుకున్నామని తివిక్రమ్ అన్నారు. తమన్ ఇచ్చిన సంగీతం కూడా అద్భుతం అని అన్నారు. ఈ సినిమాకు మొదటి నుండి బన్నీ నిలబడ్డాడని అన్నారు. సినిమాలో అల్లు అర్జున్ కు వాచ్ ఉంటుంది కానీ.. సినిమా షూటింగ్ లో మాత్రం అలుపెరగకుండా పని చేశారని అన్నారు. సినిమాకు పని చేసిన ప్రతి ఒక్కరూ.. ఇది మాది అన్నట్లుగా పని చేశారని అన్నారు. నిర్మాతల దగ్గర నుండి క్లాప్ అసిస్టెంట్ వరకూ ప్రతి ఒక్కరూ ఎంతో గొప్పగా పనిచేశారని అన్నారు. కొన్ని జ్ఞాపకాలు ఎంతో గొప్పగా ఉంటాయని.. ఈ సినిమాను మేము చూపిస్తూనే ఉంటాం.. మీరు చూడాలి. మేము వదిలినా జెమినీ టీవీ వాళ్లు వదలరు.. చూస్తూనే ఉండాల్సిందే.. ఇది మరో అతడు అని త్రివిక్రమ్ వెల్లడించారు.

కవి శ్రీ గురజాడ అప్పారావు గారిని గుర్తుచేసుకున్న మోదీ
11 hours ago

ఏపీలో వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రారంభించిన సీఎం జగన్
12 hours ago

కోవిడ్-19 వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించిన మోడీ..
12 hours ago

సంక్రాంతి రోజు తప్పనిసరిగా చేయాల్సిన దానాలు..
14-01-2021

ఫ్యామిలీతో భోగి సంబరాలు చేసుకున్న మోహన్ బాబు
13-01-2021

జీఓలను భోగి మంటలో వేసి కాల్చిన చంద్రబాబు..
13-01-2021

అలా వైకుంఠపురములో సినిమా ఫంక్షన్ లో అల్లు అర్జున్ స్పీచ్
12-01-2021

అనాధాశ్రమాలకి 10 లక్షల రూపాయలు ఇచ్చిన బిగ్ బాస్ సోహెల్
11-01-2021

సభలో నెల్లూరు విద్యార్థిని ఇంగ్లీష్ స్పీచ్ కి ఫిదా అయిన జగన్
11-01-2021

జగన్ సభలో దుమ్ములేపిన అనిల్ కుమార్ యాదవ్ స్పీచ్
11-01-2021
ఇంకా