టోక్యో ఒలింపిక్స్ 2020 లో భారత దేశపు పతాకాన్ని ఎగుర వేస్తారనే ఆశలను మోస్తున్న 10 మంది మహిళలు
24-07-202124-07-2021 21:35:44 IST
2021-07-24T16:05:44.349Z24-07-2021 2021-07-24T16:05:40.883Z - - 25-05-2022

టోక్యో ఒలింపిక్స్ శనివారం నుండి ప్రారంభమయ్యాయి ఈ ఏడాది 127 మంది భారతీయ బృందం 2020 ఒలింపిక్స్‌లో రెండంకెల పతకాలతో స్వదేశానికి తిరిగి రావాలనే ఆశతో ఉంది. పతకాలు తెచ్చే అవకాశమున్న 10 మంది మహిళల క్రీడాకారుల జాబితా ఇక్కడ చూద్దాము. 1. పివి సింధు (బాడ్మింటన్) నిస్సందేహంగా ఈ జాబితాలో గుర్తించదగిన పేర్లలో ఒకటి, హైదరాబాద్ లో జన్మించిన షట్లర్ బ్యాడ్మింటన్ బంగాఋ పతాకం తో ఇంటికి రావచ్చు అని అందరూ ఆశ పడుతున్నారు. 2016 ఒలింపిక్స్‌లో రజతం గెలుచుకున్నప్పుడు సింధు బంగారు పతాకానికి అతి తక్కువ దూరంలో ఉండింది. . సింధు ఇప్పుడు మంచి ఫామ్‌లో ఉంది, ఆల్-ఇంగ్లాండ్ ఓపెన్ సెమీ-ఫైనల్‌కు కూడా చేరుకుంది. కాకపొతే ఇక్కడ ఉన్న ఇబ్బంది ఏమిటంటే, రియోలో కంటే టోక్యోలో పోటీ కఠినమైనది. 2. MC మేరీ కోమ్ (బాక్సింగ్) 38 ఏళ్ల బాక్సర్ మరియు రాజ్యసభ ఎంపి. అపారమైన అనుభవం మరియు ఎన్నో రికార్డులతో టోక్యో లో అడుగు పెట్టింది .మేరీ కోమ్ 2012 ఒలింపిక్స్‌లో కాంస్య పతకాన్ని గెలుచుకున్నారు, ఆపై 2014 ఇంచియాన్ ఆసియా గేమ్స్ మరియు 2018 గోల్డ్ కోస్ట్ కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణం సాధించారు. ప్రపంచ అమెచ్యూర్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో అనేక ఎడిషన్లలో ఆరు బంగారు పతకాలతో ఆమె టోక్యో ప్రచారాన్ని ప్రారంభించింది, 3. వినేష్ ఫోగాట్ (రెస్ట్లింగ్) ప్రఖ్యాత ఫోగాట్ సోదరీమణుల బంధువు, వినేష్ తన 53 వ కిలోల విభాగంలో తొలి ప్రపంచ ఛాంపియన్షిప్ పతకాన్ని గెలుచుకున్నారు, కాంస్య పతకం మ్యాచ్‌లో మరియా ప్రెవోలారకి (గ్రీస్) ను ఓడించారు. గత ఆసియా ఛాంపియన్‌షిప్‌లో, బంగారు పతకం సాధించిన భారతదేశపు తొలి మహిళా రెజ్లర్‌గా కూడా నిలిచింది. ఒక గాయం 2016 లో ఒలింపిక్ పతకం సాధించాలనే ఆమె కలను తుడిచిపెట్టింది. ఇప్పుడు ఆమె ఆ నష్టాన్ని పూడ్చుకోవాలని మరియు టోక్యో నుండి కొంత విలువైన లోహంతో తిరిగి రావాలని ఆమె భావిస్తోంది. 4. సాయిఖోమ్ మిరాబాయి చాను (వెయిట్ లిఫ్టింగ్) మహిళల 49 కిలోల వెయిట్ లిఫ్టింగ్ ఈవెంట్లో రజత పతకం సాధించి టోక్యో 2020 ఒలింపిక్స్‌లో మీరాబాయి చాను భారత ఖాతా ప్రారంభించింది. టోక్యో ఒలింపిక్స్‌లో ఉన్న ఏకైక భారతీయ వెయిట్ లిఫ్టర్, చాను 49 కిలోల విభాగంలో ప్రస్తుత ప్రపంచ నంబర్ మూడో స్థానంలో ఉన్నారు మరియు ఈ ఏడాది ఏప్రిల్‌లో 'క్లీన్ అండ్ జెర్క్' ప్రపంచ రికార్డును బద్దలు కొట్టారు. 5. ఎలవెనిల్ వలరివన్ (షూటింగ్) 21 ఏళ్ల ఈ యువతి 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మహిళల మరియు మిశ్రమ జట్టు ఈవెంట్లలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తారు. అర్హత సాధించడానికి కోటా గెలవవలసిన అవసరం లేని ఏకైక భారతీయ షూటర్ ఆమె, ఆమె సాధించిన విజయాలను పరిశీలిస్తే ఈ విషయం ఆశ్చర్యం కలిగించదు. వీటిలో 2019 ISSF ప్రపంచ కప్ యొక్క 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్లో మొదటి స్థానం గెలుచుకోవడం మరియు తైపీలోని తయోయువాన్లో జరిగిన ఆసియా ఎయిర్ గన్ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం సాధించడం కూడా ఉన్నాయి. 6. దీపికా కుమారి (ఆర్చరీ) ఆర్చరీ ప్రపంచ కప్‌లో దీపికా మూడుసార్లు బంగారు పతకం సాధించింది . జార్ఖండ్‌కు చెందిన దీపికా ఆర్చర్ ప్రపంచ ర్యాంకింగ్స్‌లో నంబర్ 1 స్థానాన్ని దక్కించుకుంది . ఈ అద్భుతమైన ప్రదర్శన తో సహజంగానే ఆమె ప్రజల అంచనాలను పెంచింది. 7. మను భేకర్ (షూటింగ్) 19 ఏళ్ల మను భేకర్ ఈమె పైనే అందరి అంచనాలు ఉన్నాయి . కాబట్టి ఆమె అంచనాల అధిక ఒత్తిడిని కూడా ఎదుర్కోవలసి ఉంటుంది. అదృష్టవశాత్తూ, ఆమె తన వయసుని మీరిన మెచ్యూరిటీని ఆటలో చూపించింది, 2018 ISSF ప్రపంచ కప్‌లో రెండు బంగారు పతకాలను సాధించి, అలా చేసిన అతి పిన్న వయస్కురాలు. మను ప్రపంచ కప్‌లో తొమ్మిది సార్లు బంగారు పతక విజేత 8. సిఎ భవానీ దేవి (ఫెన్సింగ్) 27 ఏళ్ల ఈ యువతి మార్చిలో ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన తొలి భారతీయ ఫెన్సర్‌గా చరిత్ర సృష్టించింది. ఆభవాని దేవికి 9 ఏళ్ళ వయసులోనే ఫెన్సింగ్‌తో పరిచయం కావడంతో అప్పటినుండి వెనక్కి తిరిగి చూడలేదు. గత కామన్వెల్త్ మరియు ఆసియా ఛాంపియన్‌షిప్‌లలో పతకాలు సాధించింది. AOR పద్ధతి ద్వారా అర్హత సాధించింది, 9. మణికా బాత్రా (టేబుల్ టెన్నిస్) రియోలో జరిగిన మొదటి రౌండ్ నుండి ఆమె ఓడిపోయింది , ఒలింపిక్స్ గురించి ఆమె జ్ఞాపకాలు బహుశా ఆమె మరచిపోవచ్చు. కానీ బాత్రా రెండు సంవత్సరాల తరువాత మళ్ళీ తిరిగి వచ్చి 2018 కామన్వెల్త్ క్రీడలలో రెండు బంగారు పతకాలు సాధించింది . ఐఢిల్లీ నుండి వచ్చిన ఈమె ఈ సారి పోడియంలోకి రావడం ద్వారా ఆమె గతంలోని తప్పులను సరిదిద్దాలని ఆశిస్తుంది. 10. ప్రణతి నాయక్ (జిమ్నాస్టిక్స్) కోవిడ్ మహమ్మారి కారణంగా ఆసియా ఒలింపిక్ క్వాలిఫైయింగ్ ఛాంపియన్షిప్స్ జరగనప్పటికీ ప్రణతి టోక్యో కి అర్హత సాధించింది . టోక్యో ఒలింపిక్స్‌లో ప్రణతి హాజరు కావడం రియోలో 2016 లో దీపా కర్మకర్ను ప్రదర్శన కన్నా మెరుగ్గా ఉంటుందని ఆషిస్తున్నారు క్రేడాభిమానులు . రియో లో దీపా నాల్గవ స్థానంలో నిలిచింది. ప్రణతి వినూత్నమైన జిమ్నాస్ట్, కాబట్టి న్యాయమూర్తులను ఆకట్టుకోవడానికి ఆమె వినూత్న ప్రదర్శన చేస్తుందని ఆశిస్తున్నారు అందరూ #Tokyo2020 #Olympic #India #TokyoOlympics #IndianAthlete #AllIndiaQualifiedAthlete #IndianTeam #PVSindhu #DeepikaKumari #MirabaiChanu #DuteeChand #PriyankaGoswami #BhavnaJat #VRevathi #SubhaVenkatesan #DhanalakshmiSekhar #KamalpreetKaur #SeemaPunia #AnnuRani #MaryKom #SimranjitKaur #LovlinaBorgohain #PoojaRani #CABhavaniDevi #AditiAshok #Savita #DeepGraceEkka

కేసీఆర్ ఓటమికి సరైన కారణాలు చెప్పిన ఈ పెద్దాయన
03-11-2021

వై.ఎస్. జగన్ పాలన, పథకాల అమలు పై బద్వేల్ నియోజకవర్గ ప్రజల అభిప్రాయం
30-10-2021

బద్వేల్ ఉప ఎన్నికల్లో గెలుపెవరిది?
30-10-2021

ఓటు బీజేపికి కాదా? ఈటెలకేనా
29-10-2021

హుజురాబాద్ ఉప ఎన్నికలో గెలుపెవరిది?
29-10-2021

కాంగ్రెస్ లో సంక్షోభం... ఇందుకేనా? || పరకాలమ్ -1
09-10-2021

Tokyo Olympics 2020 : ఫెన్సింగ్ లో భవానీ దేవి
26-07-2021

టోక్యో ఒలింపిక్స్ అప్డేట్
26-07-2021

కేటీఆర్ సతీమణి శైలిమ పై రేవంత్ రెడ్డి ఆరోపణలు
19-07-2021

నా లోక్ సభ సభ్యత్వం రద్దు అనేది మీ కల: ఎంపీ రఘురామ కృష్ణంరాజు
19-07-2021
ఇంకా