newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

పేదలు మద్యం కొనుగోలు చేయలేక.. శానిటైజర్లు తాగి చనిపోతున్నారు: జనసేన

05-04-202105-04-2021 18:35:29 IST
2021-04-05T13:05:29.834Z05-04-2021 2021-04-05T13:04:54.254Z - - 11-04-2021

పేదలు మద్యం కొనుగోలు చేయలేక.. శానిటైజర్లు తాగి చనిపోతున్నారు: జనసేన
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
మద్యం అమ్మకాలను ప్రభుత్వమే ప్రోత్సహిస్తూ సొమ్ము చేసుకుంటుంది. గత రెండేళ్ళలో ఆదాయం పెరగడమే తప్ప.. నియంత్రకు చర్యలు ఏవీ, జగన్ ప్రభుత్వం మద్యం అమ్మకాలను పరుగులు పెట్టించే దిశగా నిర్ణయాలు చేస్తుంది. చిత్తశుద్ది ఉంటే.. మద్యం పూర్తిగా నిషేధించాలి.. కానీ సొంత బ్రాండ్లతో పేదల జీవితాలను బలి చేసుకుంటున్నారు. మద్యం ద్వారా వచ్చే ఆదాయాన్ని సంక్షేమ పధకాలకు తరలిసంచడం వాస్తవం కాదా అని జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన మహేష్ అధికార పార్టీ వైసీపీ ని ప్రశ్నించారు. 

పేదలు మద్యం కొనుగోలు చేయలేక.. శానిటైజర్లు తాగి చనిపోతున్నారు, లిక్కర్ తో పాటు బీరు అమ్మకాలు కూడా పెద్ద ఎత్తున రాష్ట్రంలో పెరిగిపోయాయి. మద్యం పై ప్రభుత్వానికి శ్వేత పత్రం విడుదల చేసే దమ్ముందా అని పోతిన మహేష్ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు.  


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle