మా ముఖ్యమంత్రివి అన్నీ క్రేజీ థాట్స్
12-02-202112-02-2021 11:16:27 IST
Updated On 12-02-2021 14:21:38 ISTUpdated On 12-02-20212021-02-12T05:46:27.112Z12-02-2021 2021-02-12T05:45:27.623Z - 2021-02-12T08:51:38.070Z - 12-02-2021

వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు న్యూస్ స్టింగ్ తో పలు అంశాలను చర్చించారు. అమరావతిని రాజధాని నుండి తరలించడం అనే నిర్ణయం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీసుకోవడం దురదృష్టకరమని ఆయన అన్నారు. మాట తప్పను.. మడమ తిప్పను అని ప్రతిపక్షంలో ఉన్న సమయంలో జగన్ మోహన్ రెడ్డి చెప్పే వారని.. అధికారం లోకి వచ్చాక ఆయన ఇలాంటి నిర్ణయం తీసుకోవడం తనకు కూడా ఆశ్చర్యానికి గురిచేసిందని అన్నారు రఘు రామ. తాను ధైర్యంగా ఈ మార్పు తప్పు అని చెబుతున్నానని.. కానీ చాలా మంది వైసీపీ నాయకులు దీన్ని చెప్పలేకపోతున్నారని అన్నారు. ఇక మూడు రాజధానుల ప్రకటన కూడా కరెక్ట్ కాదని అన్నారు. ఉదాహరణకు సౌత్ ఆఫ్రికాను చూపించడం కూడా సరైన పద్ధతి కాదని అన్నారు ఆయన. అక్కడి పరిస్థితులు వేరే.. ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితులు వేరే అని అన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణ అన్నది రాంగ్ ప్రయోగం అని కూడా తెలిపారు. వైజాగ్ ఇప్పటికే ఎంతగానో అభివృద్ధి చెందిందని.. మళ్లీ వైజాగ్ ను అభివృద్ధి చేయడం అన్నది సరైన నిర్ణయం కాదని అన్నారు. వైజాగ్ ను గత ప్రభుత్వాలే చాలా అభివృద్ధి చేశాయని అన్నారు. వైజాగ్ లో నీటి సమస్య కూడా ఉన్నాయని అన్నారు. వైజాగ్ ఎక్కడో విసిరేసినట్లుగా ఉంటుందని.. రాయలసీమ జిల్లాల వాళ్లు వైజాగ్ కు వెళ్లడం కూడా చాలా కష్టంతో కూడుకున్నదని అన్నారు. విమానాల్లో తిరగాలంటే సాధారణ వ్యక్తులకు కుదిరేపని కాదని అన్నారు. ప్రభుత్వ ఆలోచనలు సవ్యమైన మార్గంలో లేవని దెప్పిపొడిచారు. అమరావతిని టీడీపీ రాజధాని చేసిందని.. అందుకే మార్చాలని వైసీపీ ప్రభుత్వం అనుకుంటుందన్న నింద ఉందన్నది ఆ విషయంలో కూడా నిజం ఉందని రఘు రామ చెప్పుకొచ్చారు. అంతేకానీ అమరావతిని మార్చాలని అనుకోవడం మాత్రం తప్పేనని అన్నారు. ఇన్ సైడర్ ట్రేడింగ్ అనే కాన్సెప్ట్ రియలెస్టేట్ రంగంలో లేదని అన్నారు రఘురామ.. అమరావతిని రాజధాని చేయడానికి ముందు చాలా తక్కువ ఎకరాల భూములు రిజిస్టర్ చేయించుకున్నాయని అన్నారు. ఇంకా ఇటీవలి కాలంలోనే ప్రభుత్వం పేదలకు భూములు ఇవ్వాలని అనుకున్న సమయంలో ఎక్కువగా అవకతవకలు చోటు చేసుకున్నాయని ఆరోపించారు.

జాగారం చేస్తున్న భక్తులతో కలిసి ఎమ్మెల్యే జగ్గారెడ్డి నృత్యం
01-03-2021

కేబీఆర్ పార్క్ లో ఎమ్మెల్సీ అభ్యర్థి వాణిదేవి ప్రచారం
01-03-2021

రేణిగుంట ఎయిర్ పోర్టులో బైఠాయించిన చంద్రబాబు
01-03-2021

రాజధాని ఒకే చోట వద్దు అని చరిత్ర చెప్పింది : అంబటి రాంబాబు
27-02-2021

దెబ్బ తగిలిన తర్వాతే చంద్రబాబు నిజస్వరూపం బయట పడింది: సజ్జల
25-02-2021

91 వేల పోస్టుల భర్తీకి సంబంధించి టైం టేబుల్ ఏది..!
25-02-2021

వైసీపీ నాయకుల్ని చూస్తుంటే నవ్వొస్తుంది.. నారా లోకేష్
25-02-2021

ఎపిసోడ్ 2 పఠన కుతూహలం : ఈవారం శ్రీశ్రీ ఖడ్గసృష్టి, మహాప్రస్థానం నుంచి..
22-02-2021

21-02-21 నుంచి 27-02-21 వరకు వార ఫలాలు
21-02-2021

ఫిబ్రవరి 20న విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ పోరాట యాత్ర చేస్తాం - ఎంపీ విజయసాయిరెడ్డి
16-02-2021
ఇంకా