newssting
Radio
BITING NEWS :
అమెరికాలోని కుంబా ప్రాంతంలో తుపాకులతో దాడులు. పాఠశాలపై దాడులకు పాల్పడిన దుండగులు. 8 మంది చిన్నారులు దుర్మరణం. ఇంతవరకూ దాడికి గల కారణాలపై నో క్లారిటీ. వేర్పాటువాదుల పనైఉంటుందని అనుమానిస్తున్న పోలీసులు. * ఇంద్రకీలాద్రిపై ఘనంగా దసరా ఉత్సవాలు. ఆఖరిరోజు శ్రీ రాజరాజేశ్వరీ దేవి అలంకరణలో దర్శనమిస్తున్న దుర్గమ్మవారు. అమ్మవారి దర్శనం కోసం బారులు తీరిన భక్తులు. * దుర్గమ్మను దర్శించుకున్న కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. దసరా సందర్భంగా విజయవాడలో బీజేపీ కార్యాలయాన్ని ప్రారంభించిన కిషన్ రెడ్డి. రాష్ట్రంలో బీజేపీ బలపడుతుందన్న కేంద్ర మంత్రి. * రానున్న 4 రోజుల్లో ఏపీకి భారీ వర్షాలు. * సికింద్రాబాద్ ముత్యాలమ్మ ఆలయం వద్ద పేలుడు. ఆలయం సమీపంలోని చెత్తకుప్పలో పేలిన పెయింట్ డబ్బా, వ్యక్తికి గాయాలు. * వనపర్తి జిల్లా గోపాల్ పేట మండలం బుద్దారం గ్రామంలో విషాదం. భారీ వర్షాలకు నానిపోయిన ఇంటి పై కప్పు కూలి ఐదుగురు దుర్మరణం, ఇద్దరికి తీవ్రగాయాలు. * తెలంగాణ రాష్ట్ర ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్.

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో సోనూ సూద్

29-09-202029-09-2020 13:20:21 IST
Updated On 29-09-2020 13:20:55 ISTUpdated On 29-09-20202020-09-29T07:50:21.585Z29-09-2020 2020-09-29T07:50:02.874Z - 2020-09-29T07:50:55.118Z - 29-09-2020

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో  సోనూ సూద్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన 3వ విడత గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా సోమవారం రామోజీ ఫిలిం సిటీలో జాతీయస్థాయిలో వేలాది మంది వలస కూలీలను ఆదుకున్న ప్రముఖ స్వచ్ఛంద సేవకుడు, సినీ నటుడు సోనూ సూద్ మొక్కలు నాటారు.  

ఈ సందర్భంగా సోనూ సూద్ ప్రముఖ సినీ దర్శకుడు శ్రీను వైట్ల ఇచ్చిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరించిన తాను ఈరోజు మొక్కలు నాటినట్లు తెలిపారు. రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ గారు గ్రీన్ ఇండియా ఛాలెంజ్  ఆలోచనకు శ్రీకారం చుట్టడం చాలా సంతోషంగా ఉందన్నారు.  

కరోనా, తదనంతర కాలంలో పర్యావరణ పరిరక్షణ ఆవశ్యకత పెరిగిందన్నారు.  చెట్లు నాటడం ప్రతి ఒక్కరి బాధ్యత అనీ, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో నేను ఒకరిగా పాల్గొన్నందుకు ఆనందంగా ఉందని అన్నారు. ఇదే స్ఫూర్తితో లక్షలాది మంది గ్రీన్ ఛాలెంజ్ ను స్వీకరిస్తూ మొక్కలు నాటాలని, పర్యావరణాన్ని పరిరక్షించాలని సోనూ సూద్  పిలుపునిచ్చారు.


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle