యూట్యూబ్ నుంచి కూడా ట్రంప్ ఔట్
13-01-202113-01-2021 15:31:51 IST
2021-01-13T10:01:51.509Z13-01-2021 2021-01-13T10:01:40.388Z - - 17-01-2021

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై మరో సోషల్ మీడియా దిగ్గజం వేటు వేసింది. ఇప్పటికే ట్విట్టర్, ఫేస్ బుక్, ఇన్స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా టెక్ దిగ్గజాలు తమ వేదికల్లో ట్రంప్‌కు స్థానం లేదని ప్రకటించగా తాజాగా యూట్యూబ్ కూడా ఆ బాటే పట్టింది. దేశాధ్యక్షుడు ట్రంప్ తన యూట్యూబ్ చానల్లో అప్లోడ్ చేసిన కంటెంట్ హింసను రెచ్చగొడుతున్నట్లుగా ఉందని వస్తున్న ఆరోపణలకు స్పందించిన యూట్యూబ్ తాజాగా ట్రంప్‌పై కొరడా ఝళిపించింది. తమ ప్లాట్‌ఫాం విధానాలను ట్రంప్ ఉల్లఘించారని, అందుకే ఆయన యూట్యాబ్ చానల్ని ఒక వారంరోజులపాటు సస్పెండ్ చేస్తున్నామని ప్రకటించింది. అయితే య్యూటూబ్‌లో ట్రంప్ అప్ లోడ్ చేసిన ఏ వీడియో తన అకౌంట్ సస్పెన్షన్‌కి కారణమైందన్నది తెలియడం లేదు. ఈ ఆంక్షల ఫలితంగా ట్రంప్ కనీసం వారంరోజుల పాటు కొత్త కంటెంటును తమ చానల్లో అప్ లోడ్ చేయలేరు. కాగా నిబంధనల ప్రకారం ఈ సస్పెన్షన్ మరికొంత కాలం పొడిగించే అవకాశం ఉందని కూడా మంగళవారం సాయంత్రం వెల్లడించింది. పుండుమీద కారం చల్లినట్లుగా ఈ వీడియోపై వ్యాఖ్యలను నిరవధికంగా నిలిపివేస్తున్నట్టు కూడా యూట్యూబ్ యాజమాన్యం తెలిపింది. ట్రంప్ ఛానల్లో అప్లోడ్ చేసిన తాజా కంటెంట్‌ను జాగ్రత్తగా సమీక్షించామని, హింసకు ప్రేరేపిస్తుందన్న ఆందోళనల దృష్ట్యా, తాజాగా అప్లోడ్ చేసిన కొత్త కంటెంట్‌ను తొలగించామని, తమ విధానాలను ఉల్లంఘించినందుకు ఈ చర్య తీసుకున్నామని యూట్యూబ్ ప్రతినిధి ఒక ప్రకటనలో తెలిపారు. దాదాపు అన్ని సోషల్ మీడియా దిగ్గజ సంస్థలూ ట్రంప్‌పై బాణాలు గురిపెట్టినట్లుంది. గూగుల్‌కు చెందిన వీడియో షేరింగ్ ఫ్లాట్‌ఫామ్ నుంచి ట్రంప్ ఛానల్‌ను తొలగించాలని, కఠినచర్యలు తీసుకోవాలని సామాజిక సంఘాలు మంగళవారం డిమాండ్ చేశాయి. లేదంటే వాణిజ్య ప్రకటనలను నిలిపివేసే ప్రచారం చేపడుతామని హెచ్చరించారు. స్టాప్ హేట్ ఫర్ ప్రాఫిట్ ఉద్యమ సంస్థ ఈ హెచ్చరిక చేసింది. గతవారం ట్రప్ మద్దతుదారులు క్యాపిటల్ హిల్‌పై దాడి చేసిన ఘటన తర్వాత సోషల్ మీడియా సంస్థలన్నీ ట్రంప్‌ను బ్లాక్ చేసిపడేస్తున్నాయి. ఈక్రమంలో ట్విటర్ ట్రంప్ అకౌంట్‌ను శాశ్వతంగా, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అకౌంట్లను తాత్కాలికంగా బ్యాన్ చేసిన విషయం తెలిసిందే. అంతేకాదు ట్రంప్ అనుకూలురైన 70 వేలమంది ట్విటర్ ఖాతాలను నిలిపివేసింది. ట్రంప్ ఛానల్‌కు సుమారు 28 లక్షలమంది సబ్స్క్రైబర్లు ఉన్నారు.

వాట్సాప్ గోప్యత మార్పుతో సిగ్నల్, టెలిగ్రాం పంట పండినట్లే
15-01-2021

ఎయిర్ పోడ్స్ ఛార్జింగ్ కోసం సరికొత్త మొబైల్ కేస్ ను తీసుకుని రానున్న యాపిల్
14-01-2021

వాట్సాప్‌కు ప్రత్యామ్నాయంగా 21 బెస్ట్ యాప్‌లు
13-01-2021

ప్రాణం పోవడానికి కారణం అయిన గూగుల్ మ్యాప్స్..?
13-01-2021

వెనక్కు తగ్గిన వాట్సాప్
12-01-2021

కరోనా టీకా పంపిణీలో కోవిన్ యాప్ ది బెస్ట్
11-01-2021

ప్రపంచంలోనే ధనికుడు ఎలాన్ మస్క్
08-01-2021

పెట్రోల్ బాదుడు మళ్లీ షురూ..ఎలెక్ట్రిక్ వాహనాలే దిక్కా..!
06-01-2021

5జీ స్పీడ్ మామూలుగా లేదు.. సెకనకు 700 ఎంబీల డౌన్ లోడ్
04-01-2021

ఫౌజీ ట్రైలర్ వచ్చేసింది.. గేమ్ వచ్చేదెప్పుడంటే..!
03-01-2021
ఇంకా