newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

ప్రపంచంలోనే అతిపెద్ద ఓలా ఈ-స్కూటర్ ఫ్యాక్టరీ.. ఏడాదిలో కోటి యూనిట్ల తయారీ

08-03-202108-03-2021 12:42:20 IST
2021-03-08T07:12:20.688Z08-03-2021 2021-03-08T07:12:13.551Z - - 20-04-2021

ప్రపంచంలోనే అతిపెద్ద ఓలా ఈ-స్కూటర్ ఫ్యాక్టరీ.. ఏడాదిలో కోటి యూనిట్ల తయారీ
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ప్రపంచ ఆటో మొబైల్స్ మార్కెట్ చరిత్రలోనే సరికొత్త సంచలనానికి ప్రముఖ రైడ్ షేరింగ్ కంపెనీ ఓలా రంగం సిద్ధం చేస్తోంది. తమిళనాడులోని కృష్ణగిరి జిల్లాలో 500 ఎకరాల స్థలంలో నిర్మిచనున్న ఓలా ఎలెక్ట్రిక్ మొబిలిటీ ప్రైవేట్ లిమిటెడ్ ప్రపంచంలోనే అతిపెద్ద ఈ-స్కూటర్ ఫ్యాక్టరీగా చరిత్రకెక్కనుంది. దీని విశేషాలు మామూలుగా లేవు మరి.

తమిళనాడులో ఓలా స్థాపించనున్న ఈ-స్కూటర్ ఫ్యాక్టరీ ఏటా కోటి స్కూటర్లు ఉత్పత్తి చేయగల సామర్థ్యంతో ఉంటోంది. పైగా 2022 నాటికి ప్రపంచంలోని మొత్తం ఎలెక్ట్రిక్ స్కూటర్లలో 15 శాతం ఈ ఒక్క ఫ్యాక్టరీలోనే తయారు చేయాలని లక్ష్యం విధించుకున్నారు కూడా. అంటే ప్రతి రెండు సెకన్లకు ఒక స్కూటర్ ఉత్పత్తి జరుగుతుందన్నమాట.

పెట్రోలు, డీజిలు ధరలు చుక్కలంటుతుండటంతో అల్లాడుతున్న ప్రపంచానికి ఆ వార్త కాస్త ఉపశమనం కలిగించేటట్టుగా ఉంది. చమురు ధరలు భరించలేకపోతున్న వాహనదారుల్లో చాలామంది ఇప్పటికే ఎలెక్ట్రిక్ స్కూటర్లపై కన్నేశారు. ఈ క్రమంలోనే ఓలా సంస్థ.. ఎలక్ట్రిక్ వాహనాల ఫ్యాక్టరీ పెట్టాలని నిర్ణయించుకుంది. తమిళనాడులో ఓలా పెట్టే ఈ-స్కూటర్ ఫ్యాక్టరీ ప్రపంచంలోనే అతి పెద్దది. 330 మిలియన్ డాలర్లతో ఏర్పాటు చేస్తున్న ఈ ఫ్యాక్టరీ వచ్చే ఏడాదిలో విస్తరించాలనేది ఓలా యోచన.

Ola Electric

260 ఎకరాల విస్తీర్ణంలో ప్లాంట్, 240 ఎకరాల విస్తీర్ణంలో రెండు సప్లయిర్ పార్కులతో రూపొదనున్న ఈ-స్కూటర్ ఫ్యాక్టరీ ఈ సంవత్సరం జూన్ నుంచే ఉత్పత్తి ప్రారంభింస్తుందని, తొలి దశలో 20 లక్షల ఈ-స్కూటర్ల తయారీని లక్ష్యంగా పెట్టుకున్నామని, వీటిని భారత్‌లో రిటైల్‌గా అమ్ముతూనే ఎగుమతి కూడా చేస్తామని ఓలా ఎలెక్ట్రిక్ సంస్థ పేర్కొంది. 

ఈ ప్లాంట్‌లో మొత్తం 10 అసెంబ్లీ లైన్లు ఉంటాయని, 3 వేల రోబోట్లు, 10 వేల మంది కార్మికులతో ఈ-స్కూటర్ల ఉత్పత్తిని ప్రారంభిస్తామని సంస్థ సీఈఓ భవీష్ అగర్వాల్ తెలిపారు. ఇప్పటికే ఈ-స్కూటర్ల మార్కెట్‌లో లీడర్‌గా ఉంటున్న హీరో మోటో కార్ప్ సంస్థ సైతం సంవత్సరానికి 65 లక్షల యూనిట్లను మాత్రమే తయారు చేస్తోంది.

భారతదేశంలో ఏటా 2 కోట్ల 25 లక్షల సాధారణ టూవీలర్స్ అమ్ముడవుతుంటాయి. ఎలెక్ట్రిక్ వాహనదారుల భవిష్యత్ అవసరాలను తమ సంస్థ అవలీలగా తీరుస్తుందని భవీష్ ఈ సందర్భంగా చెప్పారు.

స్వావలంబన, ఆటోమేషన్, సామర్థ్యత సూత్రాల ప్రాతిపదికన తమ ఉత్పత్తులు వినియోగదారుల ఆకాంక్షలకు అనుగుణంగా ఉంటాయని భవీష్ పేర్కొన్నారు. తాము స్థాపించనున్న సంస్థ మామూలు ఎలెక్ట్రిక్ స్కూటర్ల సంస్థగా ఉండబోదని ప్రపంచంలోనే అతిపెద్ద టూవీలర్ ఫ్యాక్టరీని స్థాపించబోతున్నామని భవీష్ సగర్వంగా చెప్పారు.

ఇప్పటికిప్పుడే ఓలా ఈ-స్కూటర్ల ధరను వెల్లడించబోమని, అయితే మార్కెట్లో పోటీని తట్టుకునేలా, సరసమైన ధరకే తమ ఉత్పత్తిని అందిస్తామని ఓలా ఎలెక్ట్రిక్ సీఈఓ చెప్పారు. అయితే ఓలా నిర్మించనున్న ఇ-స్కూటర్ ధర లక్ష రూపాయల లోపే ఉండవచ్చని అంచనా.

పెట్రోల్ బాదుడు మళ్లీ షురూ..ఎలెక్ట్రిక్ వాహనాలే దిక్కా..!

వాట్సాప్ పింక్ లో కూడా వస్తుందా.. వస్తే మీరు ట్రాప్ లో పడ్డట్టే

వాట్సాప్ పింక్ లో కూడా వస్తుందా.. వస్తే మీరు ట్రాప్ లో పడ్డట్టే

   17-04-2021


గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

   12-04-2021


ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

   10-04-2021


మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

   07-04-2021


కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

   06-04-2021


ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

   05-04-2021


పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

   01-04-2021


రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

   25-03-2021


వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

   24-03-2021


ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

   22-03-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle