newssting
Radio
BITING NEWS :
ఏలూరు మాజీ ఎంపి మాగంటి బాబు కుమారుడు ఆత్మహత్యాయత్నం. అర్థరాత్రి విజయవాడ ఆంధ్రా ఆస్పత్రికి తరలింపు. ఐసీయూలో వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్న వైద్యులు. బ్రెయిన్ స్ట్రోక్ తో ఆస్పత్రిలో చేర్పించామని చెప్తున్న కుటుంబ సభ్యులు. 24 గంటలు గడిస్తే గానీ ఏమీ చెప్పలేమన్న వైద్యులు. * ఏపీ మునిసిపల్ ఎన్నికల్లో అత్యధిక ఏకగ్రీవాలు చేసిన వైసీపీ. వైసీపీ -570, టీడీపీ -5, బీజేపీ -1, ఇతరులు -2 ఏకగ్రీవాలు. * విశాఖలో కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం. విజయవాడ నుంచి విశాఖకు తరలనున్న కమాండ్ కంట్రోల్ రూమ్. విశాఖలోని ప్రభుత్వ భూమిలో కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు. * నెల్లూరు జాయింట్ కలెక్టర్ కార్యాలయ సిబ్బందిపై కేసు నమోదు. పదోన్నతి కల్పిస్తామని చెప్పి మోసం చేశారని అంగన్ వాడీ కార్యకర్త ఫిర్యాదు. జేసీ సీసీ శ్రీకాంత్, సిబ్బంది దయాకర్, వికాస్ పై కేసు నమోదు. జేసీ భార్య ఇంట్లో పనిచేయించుకుంటున్నారంటూ ఫిర్యాదు. కేసును తప్పుదోవ పట్టిస్తున్నారని ఆందోళన. * రాజకీయాలపై సంచలన ప్రకటన చేసిన జయ నెచ్చెలి శశికళ. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన చిన్నమ్మ. శశికళ ప్రకటనతో నిరాశ చెందిన అభిమానులు. ఇది బీజేపీ స్క్రిప్ట్ అంటున్న శశికళ మద్దతుదారులు. * సీఎం జగన్ కు ఏపీ సీపీఎం కార్యదర్శి రామకృష్ణ లేఖ. రేపటి రాష్ట్ర బంద్ కు సహకరించాలని సీఎంకు వినతి. విశాఖ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా బంద్ కు పిలుపునిచ్చిన సీపీఐ.

మార్స్ గ్రహంపై నాసా రోవర్.. ఆపరేషన్ లీడ్‌గా స్వాతి మోహన్

19-02-202119-02-2021 10:56:19 IST
2021-02-19T05:26:19.632Z19-02-2021 2021-02-19T05:26:15.694Z - - 04-03-2021

మార్స్ గ్రహంపై నాసా రోవర్.. ఆపరేషన్ లీడ్‌గా స్వాతి మోహన్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
అంగారక గ్రహంపై జీవం ఆనవాళ్లకు సంబంధించిన నమూనాలను సేకరించడానికి అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా పంపించిన పర్సవరన్స్ రోవర్ ఈ శుక్రవారం అంగారక గ్రహంపై దిగనుంది. కాగా ఈ రోవర్ ప్రయోగంలో అత్యంత కీలక పాత్ర పోషించింది భారత సంతతి అమెరికన్ మహిళ స్వాతి మోహన్ కావడంతో ఆమె పేరు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

వివరాల్లోకి వస్తే పెర్సీ అనే ముద్దు పేరున్న ఈ పర్సవరన్స్‌ అంగారకగ్రహంపైకి నాసా పంపిస్తున్న అతిపెద్ద, అత్యాధునిక రోవర్‌. ఇది మార్స్ గ్రహంలోని రాళ్లు, మట్టి తదితరాలను సేకరిస్తుంది. అంగారక గ్రహంపై ఉన్న పురాతన నదీ పరివాహక ప్రాంతంగా భావిస్తున్న ప్రదేశంలో ఈ రోవర్‌ దిగనుంది. ఒకవేళ ఈ అరుణ గ్రహంపై జీవం ఉండి ఉంటే 300–400 కోట్ల ఏళ్లకు ముందు ఉండి ఉండవచ్చని శాస్త్రవేత్తలు విశ్వసిస్తున్నారు. 

ఈ పెర్సీ రోవర్‌ 7 అడుగుల లోతు వరకు తవ్వి, రాళ్లు, మట్టి, ఇతర పదార్ధాలను సేకరించగలదు. ఈ శాంపిల్స్‌ను ట్యూబ్స్‌లో భద్రపరిచి, అక్కడే ఉంచుతుంది. తరువాత పంపించే మరో రోవర్‌ ఆ సాంపిల్స్‌ను మరో వ్యోమనౌక ద్వారా భూమికి తీసుకువస్తుంది. అంటే, ఈ నమూనాలు భూమిని చేరేందుకు మరో పదేళ్లు పడుతుంది.

స్వాతి మోహన్‌ ఆపరేషన్స్ లీడ్..

భారతీయ సంతతికి చెందిన శాస్త్రవేత్త డాక్టర్‌ స్వాతి మోహన్‌ నాసా తాజా రోవర్ ప్రయోగంలో కీలక బాధ్యతలు నిర్వరిస్తున్నారు. ‘మార్స్‌ 2020 గైడెన్స్, నేవిగేషన్, అండ్‌ కంట్రోల్స్‌(జీఎన్‌ అండ్‌ సీ)కి ఆమె ఆపరేషన్స్‌ లీడ్‌గా నాయకత్వం వహిస్తున్నారు. మొత్తం ప్రయోగంలో లీడ్‌ సిస్టమ్‌ ఇంజినీర్‌గానూ కీలకంగా ఉన్నారు. మిషన్‌ కంట్రోల్‌ స్టాఫ్‌కు విధుల కేటాయింపు, మిషన్‌ కంట్రోల్‌ రూమ్‌లో పాటించే విధివిధానాల రూపకల్పన తదితర బాధ్యతలు నిర్వహిస్తున్నారు. 

‘జీఎన్‌ అండ్‌ సీ’సబ్‌ సిస్టమ్స్‌కి, ప్రయోగంలో పాలు పంచుకుంటున్న ఇతర బృందాలకు స్వాతి మోహన్ సంధానకర్తగా వ్యవహరిస్తున్నారు. మొత్తం ప్రయోగానికి జీఎన్‌ అండ్‌ సీ అత్యంత కీలకమైన విభాగం. ఈ మిషన్‌కు కళ్లు, చెవులు ఈ విభాగమే.  

గూగుల్ కు షాక్ ఇచ్చేలా ఇస్రో మ్యాప్స్

ఒక మార్స్ సంవత్సర కాలంపాటు ఈ రోవర్ అంగారక గ్రహంపై గడుపుతుంది. మార్స్ గ్రహంపై సంవత్సర కాలం అంటే భూమిపై రెండేళ్ల కాలం అన్నమాట. అత్యంత పురాతనమైన సూక్ష్మ జీవి ఉనికికి సంబంధించిన సంకేతాలను కనిపెట్టడమే ఈ రోవర్ లక్ష్యం. 

ఏడాది ప్రాయంలో భారత్ నుంచి అమెరికాకు కుటుంబంతోపాటు వలస వెళ్లిన డాక్టర్ స్వామి మోహన్ ఉత్తర వర్జీనియా-వాషింగ్టన్ డీసీలో పెరిగి, తర్వాత కార్నెల్ యూనివర్సిటీలో మెకానికల్, ఏరోస్పేసే ఇంజనీరింగ్‌లో డిగ్రీ పుచ్చుకున్నారు. ఎమ్ఐటీ ఏరోనాటిక్స్ అస్ట్రో నాటిక్స్ నుంచి ఎమ్మెస్, పీహెచ్‌డీని సాధించారు. కేసిని (శనిగ్రహంపైకి ఉపగ్రహం), గ్రెయిల్ (చంద్రుడిపై దిగిన ఉపగ్రహం) వంటి పలు విధాలైన ఉపగ్రహ ప్రయోగాలపై ఆమె పనిచేశారు. ఈ మార్స్‌ 2020 ప్రయోగం 2013లో ప్రారంభమైనప్పటి నుంచి డాక్టర్‌ స్వాతి మోహన్‌ ఇందులో పాలుపంచుకుంటున్నారు. ప్రస్తుతం నాసా జెట్ ప్రొపల్సన్ లాబరేటరీలో పనిచేస్తున్నారు.

తొమ్మిదేళ్ల ప్రాయంలో తొలిసారిగా స్టార్ ట్రెక్ సినిమా చూసిన స్వాతి విశ్వంలోని నూతన ప్రాంతాలను ఆ సినిమా చూపించిన చిత్రణకు నివ్వెరపోయారు. అప్పటినుంచే విశ్వం లోని నూతన, సుందరమైన ప్రాంతాలను కనుగొనాలని తలిచారు. అంతరిక్ష ప్రయోగాలపై తనకున్న ఆసక్తిని నెరవేర్చుకోవాలంటే ఇంజనీరింగ్ చదువేమార్గమని నిర్ణయించుకున్నారు.

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle