newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

20-03-202120-03-2021 08:48:20 IST
2021-03-20T03:18:20.612Z20-03-2021 2021-03-20T03:18:01.731Z - - 20-04-2021

టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

 ఫేస్ బుక్ సంస్థ ఓనర్ గా ఉన్న వాట్సాప్, ఇంస్టాగ్రామ్ యాప్స్ ఒక్కసారిగా డౌన్ అయిపోయాయి. శుక్రవారం రాత్రి సమయంలో ఈ రెండు యాప్స్ బాగా మొరాయించాయి. వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ లతో పాటూ ఫేస్‌బుక్, ఫేస్‌బుక్‌ మెసెంజర్‌ లాంటి సోషల్‌ నెట్‌వర్కింగ్‌ వేదికలు శుక్రవారం రాత్రి చాలాసేపు మొరాయించాయని చెప్పుకొచ్చారు. ఏదైనా సందేశం పంపాలన్నా, స్వీకరించాలన్నా సాధ్యం అవ్వలేదు. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో న్యూస్‌ఫీడ్‌ను అప్‌డేట్‌ చేయలేకపోయారు. కొందరైతే తమ అకౌంట్లలో లాగిన్‌ కూడా కాలేకపోయారు ప్రపంచవ్యాప్తంగా ఈ సమస్య ఉత్పన్నమైనట్లు తెలుస్తోంది. సర్వర్‌ డౌన్‌ వల్లే ఆయా సైట్లు మొరాయించినట్లు సమాచారం. ట్రాకింగ్‌ వెబ్‌సైట్‌ ‘డౌన్‌ డిటెక్టర్‌’ గణాంకాల ప్రకారం.. ఇన్‌స్టాగ్రామ్‌పై ప్రపంచవ్యాప్తంగా 12 లక్షల మంది మంది, వాట్సాప్‌పై 38 వేల మంది, ఫేస్‌బుక్‌పై 1,600 మంది ఫిర్యాదు చేశారు. 

రాత్రి 11 సమయంలో ఈ సమస్యలపై ట్విట్టర్ లో పోస్టు చేయడం మొదలుపెట్టారు. గత కొద్ది సమయంగా ఈ యాప్స్ పని చేయడం లేదంటూ ట్విట్టర్ లో మొరపెట్టుకున్నారు. పలువురు కూడా తమకు ఇలాంటి సమస్యనే ఎదురవుతోంది అంటూ చెప్పుకొచ్చారు. వాట్సాప్, మెసెంజర్లలో కనీసం మెసేజ్ పంపాలన్నా కూడా వీలు పడలేదు.. ఇక ఇంస్టాగ్రామ్ లో ఫోటో కానీ.. వీడియో కానీ అప్లోడ్ చేయాలని అనుకున్నా కూడా కుదరలేదని పలువురు చెప్పారు. వాట్సాప్, ఇంస్టాగ్రామ్ లకు ఏమైంది అంటూ పలువురు ఒక్కసారిగా ట్విట్టర్ లో పోస్టులు పెట్టడం మొదలుపెట్టారు.  

ఫేస్ బుక్ కు చెందిన కొన్ని యాప్స్ మొరాయించాయని.. అందుకు కారణం టెక్నీకల్ సమస్యలేనని ఫేస్ బుక్ సంస్థ అధికారి ఒకరు తెలిపారు. ఈ సమస్యకు కారణమైన దాన్ని కనుక్కొని పరిష్కరించామని.. ఎవరికైనా ఇబ్బంది కలిగించి ఉంటే క్షమించండి అంటూ అధికారిక ప్రకటనను విడుదల చేశారు. శుక్రవారం రాత్రి 11 గంటల నుండి 11:40 వరకూ ఈ సమస్య తలెత్తినట్లు పలు వెబ్సైట్లు చెప్పుకొచ్చాయి. ఇలా వాట్సాప్, ఫేస్ బుక్ లు మొరాయించడంతో పలువురు తెగ టెన్షన్ పడ్డారు. మొబైల్ ఫోన్ ను రీస్టార్ట్ చేయడం, ఫ్లైట్ మోడ్ ఆన్ చేయడం, ఇంటర్నెట్ సరిగా పనిచేస్తోందా లేదా అంటూ చూసుకోవడం వంటివి చేశారు. 

వాట్సాప్ పింక్ లో కూడా వస్తుందా.. వస్తే మీరు ట్రాప్ లో పడ్డట్టే

వాట్సాప్ పింక్ లో కూడా వస్తుందా.. వస్తే మీరు ట్రాప్ లో పడ్డట్టే

   17-04-2021


గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

   12-04-2021


ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

   10-04-2021


మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

   07-04-2021


కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

   06-04-2021


ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

   05-04-2021


పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

   01-04-2021


రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

   25-03-2021


వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

   24-03-2021


ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

   22-03-2021


ఇంకా

Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle