newssting
Radio
BITING NEWS :
విజయవాడలో కన్నకూతురిని అమ్మకానికి పెట్టిన తాగుబోతు తండ్రి. విషయం తెలిసి తండ్రిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చిన చైల్డ్ లైన్ అధికారులు. అనంతరం చిన్నారిని తల్లిదండ్రులకు అప్పగించిన పోలీసులు. * తెలుగు రాష్ట్రాల్లో రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో 11 మంది దుర్మరణం. రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో ఇన్నోవా - బోర్ వెల్ లారీ ఢీ. ప్రమాదంలో ఆరుగురు మృతి, ముగ్గురికి తీవ్రగాయాలు. ప్రమాద సమయంలో ఇన్నోవాలో 11 మంది ప్రయాణికులు. మృతులంతా హైదరాబాద్ లోని తాడ్ బన్ కు చెందినవారుగా గుర్తించిన పోలీసులు. * కర్నూల్ జిల్లా గూడూరు వద్ద బైక్ ను ఢీ కొట్టిన ట్రాక్టర్. ముగ్గురు దుర్మరణం, మృతులంతా బ్రాహ్మణదొడ్డికి చెందినవారుగా గుర్తించిన పోలీసులు. * ఖమ్మం జిల్లా కామేపల్లి వద్ద టిప్పర్ - స్కూటీ ఢీ, ఇద్దరు మృతి. * మూడోరోజు ప్రారంభమైన ఏపీ అసెంబ్లీ సమావేశాలు. రాష్ట్రంలో ఇసుక సమస్యపై అసెంబ్లీలో టీడీపీ వాయిదా తీర్మానం.

వాట్సప్ లో కొత్త అప్డేట్ వచ్చేసింది..!

23-10-202023-10-2020 18:12:32 IST
Updated On 24-10-2020 12:56:57 ISTUpdated On 24-10-20202020-10-23T12:42:32.294Z23-10-2020 2020-10-23T12:42:25.681Z - 2020-10-24T07:26:57.338Z - 24-10-2020

వాట్సప్ లో కొత్త అప్డేట్ వచ్చేసింది..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

వాట్సప్.. ఇది వచ్చాక సాధారణ మెసేజీలు చేయడమన్నదే మానేశారు ప్రజలు. అందరి చేతుల్లోకి స్మార్ట్ ఫోన్స్ వచ్చేయడంతో వాట్సప్ ఓపెన్ చేయడం.. అవతలివాళ్ళకు మెసేజీలు చేసేయడం. కానీ కొన్ని కొన్ని సార్లు మన ప్రమేయం లేకుండా వాట్సప్ గ్రూప్ లలోకి చేరుస్తూ ఉంటారు. గ్రూప్ నుండి లెఫ్ట్ అయిపోదామనుకుంటే.. అవతలి వాళ్ల మనోభావాలు ఎక్కడ దెబ్బతింటాయో అని బాధపడుతూ ఉంటాం. అందుకనే మ్యూట్ పెట్టుకుంటూ ఉంటాం. 

తాజాగా కొత్త అప్డేట్ ను వాట్సప్ తీసుకుని వచ్చింది. నోటిఫికేషన్లను 8 గంటలు, వారం, నెల, ఏడాది వరకు మాత్రమే మ్యూట్ చేసే సదుపాయం ఉండేది. వాట్సప్ ఇప్పుడా ఆప్షన్ల జాబితాలో శాశ్వతంగా మ్యూట్ చేసే అవకాశాన్ని కూడా చేర్చింది. వాట్సప్ లో ఈ సరికొత్త ఫీచర్ ను 'ఆల్వేస్' పేరిట అందుబాటులోకి తీసుకువచ్చారు.

వాట్సప్ మొబైల్ లోనే కాకుండా, వాట్సప్ వెబ్ లోనూ పొందుపరిచినట్టు సంస్థ వెల్లడించింది. ఈ ఫీచర్ కు సంబంధించిన ప్రయోగాత్మక బీటా వెర్షన్ ను వాట్సప్ ఇంతకుముందే తీసుకువచ్చింది. దీనికి అత్యధికుల నుంచి సంతృప్తి వ్యక్తం కావడంతో తాజాగా అందరికీ అందుబాటులోకి తీసుకువచ్చింది. వాట్సప్ లో ఈ ఫీచర్ కనిపించకపోతే లేటెస్ట్ వెర్షన్ కు అప్ డేట్ చేసుకోవాలి. ఇంకేముంది అవసరంలేని నోటిఫికేషన్లు ఎప్పటికీ మన కంటపడవు.. మళ్లీ మనం అన్ మ్యూట్ చేసేదాకా ఆ నోటిఫికేషన్లు మనల్ని డిస్టర్బ్ చేయవు.      


Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle