newssting
Radio
BITING NEWS :
తెలంగాణలో నేటి నుంచి కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రారంభం. రాష్ట్ర వ్యాప్తంగా వ్యాక్సినేషన్ కు 1213 సెంటర్లు ఏర్పాటు. నిమ్స్ లో వ్యాక్సినేషన్ ను ప్రారంభించనున్న గవర్నర్ తమిళి సై. * దేశవ్యాప్తంగా విజృంభిస్తున్న బర్డ్ ఫ్లూ. 11 రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ వ్యాపించినట్లు కేంద్రం ప్రకటన. * ఏపీ తమిళనాడు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ బస్సుల వివాదం. పర్మిట్, రికార్డులు సరిగ్గాలేవని బస్సులు సీజ్. * తెలుగు రాష్ట్రాలకు 19 మంది ఐఏఎస్ లను కేటాయించిన కేంద్రం. ఏపీకి 10 మంది, తెలంగాణకు 9 మంది ఐఏఎస్ ల కేటాయింపు. * కృష్ణాజిల్లా మాజీ ఎస్పీఓ నాగశ్రీను ఆత్మహత్యాయత్నం. నాగశ్రీను పరిస్థితి విషమం, గుంటూరు ఆస్పత్రికి తరలింపు. * మధురై అలాంగనల్లూర్ లో ప్రారంభమైన జల్లికట్టు పోటీలు. పోటీలను ప్రారంభించిన సీఎం పళనిస్వామి, డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వం. * కొత్త ప్రైవసీ విధానంపై వెనక్కితగ్గిన వాట్సాప్. కొత్త ప్రైవసీ విధానాన్ని మే 15 వరకూ వాయిదా వేస్తున్నట్లు ప్రకటించిన వాట్సాప్ యాజమాన్యం.

వెనక్కు తగ్గిన వాట్సాప్

12-01-202112-01-2021 11:24:05 IST
2021-01-12T05:54:05.154Z12-01-2021 2021-01-12T05:53:46.409Z - - 17-01-2021

వెనక్కు తగ్గిన వాట్సాప్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

సోషల్ మీడియా దిగ్గజం వాట్సాప్ ఇటీవల తమ ప్రైవసీ నిబంధనలలో మార్పులను తీసుకుని వచ్చింది. ఈ ప్రైవసీ నిబంధనల కారణంగా ఎంతో డేటా వాట్సాప్ చేతిలోకి వెళ్లిపోయే ప్రమాదం ఉందని పలువురు ఆరోపించారు. ఎంతో మంది ఇక వాట్సాప్ కు ప్రత్యమ్నాయం వెతుక్కోవలసిన సమయం వచ్చిందంటూ చెప్పుకొచ్చారు. ఇక అంతే తమ గురించి ప్రపంచ వ్యాప్తంగా విమర్శలు వస్తూ ఉన్నాయని భావించగా.. ఆ విషయంలో ప్రజలకు క్లారిటీ ఫేస్ బుక్ సంస్థ భావించింది. ఫేస్ బుక్ అధీనంలో ఉన్న వాట్సాప్, ఈ మేరకు  అన్ని ప్రైవేటు మెసేజ్ లూ 100 శాతం సురక్షితంగా ఉంటాయని, ఈ విషయంలో వస్తున్న ఊహాగానాలను నమ్మవద్దని ట్వీట్ చేసింది. బిజినెస్ ఖాతాలకు సంబంధించిన సమాచారంపైనే పాలసీ నిబంధనల ప్రభావం ఉంటుందని క్లారిటీ ఇచ్చింది. బంధుమిత్రులు, స్నేహితులకు పంపే సమాచారం పూర్తి రహస్యమని చెప్పుకొచ్చింది. 

వాట్సాప్ ద్వారా పంపే సమాచారాన్ని ఫేస్ బుక్ తో కూడా పంచుకోబోమని.. ఎవరి ప్రైవేటు మెసేజ్ లను తాము చూడబోమని, కాల్స్ ను కూడా వినబోమని స్పష్టం చేసింది వాట్సాప్. కేవలం కాల్ లాగ్స్ ను మాత్రం దాచి వుంచుతామని తెలిపింది. ఇక తమ మాధ్యమం ద్వారా లోకేషన్ షేర్ చేసినా, ఆ వివరాలను చూడబోమని స్పష్టం చేసింది. ఫేస్ బుక్ కు ఇవ్వబోమని, కాంటాక్టుల వివరాలను కూడా ఎవరితోనూ పంచుకోబోమని తెలిపింది. ఫేస్ బుక్ యాజమాన్యం కింద ఉన్నప్పటికీ వాట్సాప్ గ్రూప్ ప్రైవేటు సంస్థగానే వ్యవహరిస్తుందని తెలిపింది. యూజర్లు అవసరమనుకుంటే, తమ మెసేజ్ లను నియమిత సమయం తరువాత డిలీట్ చేసే ఆప్షన్ పెట్టుకోవచ్చని సూచించింది. ఎప్పుడు కావాలంటే అప్పుడు డేటాను తిరిగి డౌన్ లోడ్ చేసుకునే సదుపాయాన్ని కల్పిస్తామని అంటోంది. తమ ప్రైవసీ నిబంధనలలో చేసిన మార్పులతో ఇన్ని విమర్శలు వస్తాయని వాట్సాప్ సంస్థ కూడా అనుకుని ఉండదు. ఎలాగైనా తిరిగి ప్రజల నమ్మకాన్ని సొంతం చేసుకోవాలని ఫేస్ బుక్ సంస్థ భావిస్తోంది. దీనిపై యూజర్లు ఏమంటారో చూడాలి. 

వాట్సాప్ గోప్యత మార్పుతో సిగ్నల్, టెలిగ్రాం పంట పండినట్లే

వాట్సాప్ గోప్యత మార్పుతో సిగ్నల్, టెలిగ్రాం పంట పండినట్లే

   15-01-2021


ఎయిర్ పోడ్స్ ఛార్జింగ్ కోసం సరికొత్త మొబైల్ కేస్ ను తీసుకుని రానున్న యాపిల్

ఎయిర్ పోడ్స్ ఛార్జింగ్ కోసం సరికొత్త మొబైల్ కేస్ ను తీసుకుని రానున్న యాపిల్

   14-01-2021


వాట్సాప్‌కు ప్రత్యామ్నాయంగా 21 బెస్ట్ యాప్‌లు

వాట్సాప్‌కు ప్రత్యామ్నాయంగా 21 బెస్ట్ యాప్‌లు

   13-01-2021


యూట్యూబ్ నుంచి కూడా ట్రంప్ ఔట్

యూట్యూబ్ నుంచి కూడా ట్రంప్ ఔట్

   13-01-2021


ప్రాణం పోవడానికి కారణం అయిన గూగుల్ మ్యాప్స్..?

ప్రాణం పోవడానికి కారణం అయిన గూగుల్ మ్యాప్స్..?

   13-01-2021


కరోనా టీకా పంపిణీలో కోవిన్ యాప్ ది బెస్ట్

కరోనా టీకా పంపిణీలో కోవిన్ యాప్ ది బెస్ట్

   11-01-2021


ప్రపంచంలోనే ధనికుడు ఎలాన్ మస్క్

ప్రపంచంలోనే ధనికుడు ఎలాన్ మస్క్

   08-01-2021


పెట్రోల్ బాదుడు మళ్లీ షురూ..ఎలెక్ట్రిక్ వాహనాలే దిక్కా..!

పెట్రోల్ బాదుడు మళ్లీ షురూ..ఎలెక్ట్రిక్ వాహనాలే దిక్కా..!

   06-01-2021


5జీ స్పీడ్ మామూలుగా లేదు.. సెకనకు 700 ఎంబీల డౌన్ లోడ్

5జీ స్పీడ్ మామూలుగా లేదు.. సెకనకు 700 ఎంబీల డౌన్ లోడ్

   04-01-2021


ఫౌజీ ట్రైలర్ వచ్చేసింది.. గేమ్ వచ్చేదెప్పుడంటే..!

ఫౌజీ ట్రైలర్ వచ్చేసింది.. గేమ్ వచ్చేదెప్పుడంటే..!

   03-01-2021


ఇంకా

Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle