newssting
Radio
BITING NEWS :
ఏలూరు మాజీ ఎంపి మాగంటి బాబు కుమారుడు ఆత్మహత్యాయత్నం. అర్థరాత్రి విజయవాడ ఆంధ్రా ఆస్పత్రికి తరలింపు. ఐసీయూలో వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్న వైద్యులు. బ్రెయిన్ స్ట్రోక్ తో ఆస్పత్రిలో చేర్పించామని చెప్తున్న కుటుంబ సభ్యులు. 24 గంటలు గడిస్తే గానీ ఏమీ చెప్పలేమన్న వైద్యులు. * ఏపీ మునిసిపల్ ఎన్నికల్లో అత్యధిక ఏకగ్రీవాలు చేసిన వైసీపీ. వైసీపీ -570, టీడీపీ -5, బీజేపీ -1, ఇతరులు -2 ఏకగ్రీవాలు. * విశాఖలో కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం. విజయవాడ నుంచి విశాఖకు తరలనున్న కమాండ్ కంట్రోల్ రూమ్. విశాఖలోని ప్రభుత్వ భూమిలో కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు. * నెల్లూరు జాయింట్ కలెక్టర్ కార్యాలయ సిబ్బందిపై కేసు నమోదు. పదోన్నతి కల్పిస్తామని చెప్పి మోసం చేశారని అంగన్ వాడీ కార్యకర్త ఫిర్యాదు. జేసీ సీసీ శ్రీకాంత్, సిబ్బంది దయాకర్, వికాస్ పై కేసు నమోదు. జేసీ భార్య ఇంట్లో పనిచేయించుకుంటున్నారంటూ ఫిర్యాదు. కేసును తప్పుదోవ పట్టిస్తున్నారని ఆందోళన. * రాజకీయాలపై సంచలన ప్రకటన చేసిన జయ నెచ్చెలి శశికళ. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన చిన్నమ్మ. శశికళ ప్రకటనతో నిరాశ చెందిన అభిమానులు. ఇది బీజేపీ స్క్రిప్ట్ అంటున్న శశికళ మద్దతుదారులు. * సీఎం జగన్ కు ఏపీ సీపీఎం కార్యదర్శి రామకృష్ణ లేఖ. రేపటి రాష్ట్ర బంద్ కు సహకరించాలని సీఎంకు వినతి. విశాఖ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా బంద్ కు పిలుపునిచ్చిన సీపీఐ.

సంచలన ఆఫర్ ను తీసుకుని వచ్చిన వీఐ

18-02-202118-02-2021 11:48:58 IST
Updated On 18-02-2021 15:46:12 ISTUpdated On 18-02-20212021-02-18T06:18:58.736Z18-02-2021 2021-02-18T06:18:53.766Z - 2021-02-18T10:16:12.570Z - 18-02-2021

సంచలన ఆఫర్ ను తీసుకుని వచ్చిన వీఐ
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
టెలికాం ఆపరేటర్ల మధ్య ఇటీవలి కాలంలో భారీ పోటీ ఉన్న సంగతి తెలిసిందే..! వినియోగదారులను కోల్పోకుండా ఉండేందుకు ఎన్నెన్నో ప్రణాళికలు రచిస్తూ వస్తున్నారు. జియో, ఎయిర్ టెల్ మధ్య ప్రధాన పోటీ కనిపిస్తూ ఉండగా.. తాజాగా వొడాఫోన్‌ ఐడియా (వీఐ) ఓ సంచలన ఆఫర్ ను తీసుకుని వచ్చింది. వినియోగదారుల సంఖ్యను పెంచే ప్రయత్నంలో యూజర్ల కోసం సరికొత్త‌ ఆఫర్‌ ప్రకటించింది.  ప్రిపెయిడ్‌ కస్టమర్లకు రాత్రి సమయంలో అపరిమిత డేటా ఉచితంగా ఆఫర్‌ చేస్తోంది. రూ.249 ఆపైన అన్‌లిమిటెడ్‌ డెయిలీ డేటా రీచార్జ్‌లకు ఇది వర్తిస్తుంది. రాత్రి 12 నుంచి ఉదయం 6 వరకు ఎటువంటి అదనపు ఖర్చు లేకుండా వినియోగదార్లు ఉచిత డేటాను వాడుకోవచ్చు. రోజువారీ మిగిలిన డేటాను వారాంతంలో వాడుకునే వెసులుబాటునూ కల్పిస్తోంది. 

వొడాఫోన్ ఐడియా వంద కన్నా తక్కువ ధరలకు రూ.49, రూ.59, రూ.65, రూ.79, రూ.85 కు రీఛార్జ్ ప్లాన్లు అందిస్తోంది. వీటికి 28 రోజుల టాక్ టైమ్ లభిస్తుంది. 400 MB డేటా సైతం వినియోగదారులకు అందిస్తుంది. విఐ రూ.98 రీఛార్జ్ ప్లాన్‌లో డ్యూయల్ డేటా ఆఫర్ సైతం పొందవచ్చు. 28 రోజులు వ్యాలిడిటీతో 12GB డేటాను ఉపయోగించుకుంటారు.

వొడాఫోన్ ఐడియా రూ.218 ప్లాన్ రీఛార్జ్ చేస్తే 28 రోజుల వేలిడిటీ లభిస్తుంది. 6 జీబీ డేటా వాడుకోవచ్చు. అన్‌లిమిటెడ్ కాల్స్ చేసుకోవచ్చు. వీఐ మూవీస్, టీవీ బేసిక్ యాక్సెస్ లభిస్తుంది. వొడాఫోన్ ఐడియా రూ.219 ప్లాన్ రీఛార్జ్ చేస్తే 28 రోజుల వేలిడిటీ లభిస్తుంది. రోజూ 1 జీబీ డేటా వాడుకోవచ్చు. అన్‌లిమిటెడ్ కాల్స్ చేసుకోవచ్చు. వీఐ మూవీస్, టీవీ బేసిక్ యాక్సెస్ లభిస్తుంది. వొడాఫోన్ ఐడియా యాప్ ద్వారా రీఛార్జ్ చేస్తే 2జీబీ డేటా అదనంగా లభిస్తుంది.

వొడాఫోన్ ఐడియా రూ.248 రీఛార్జ్ చేస్తే 28 రోజుల వేలిడిటీ లభిస్తుంది. మొత్తం 8జీబీ డేటా ఉపయోగించుకోవచ్చు. అన్‌లిమిటెడ్ కాల్స్ చేసుకోవచ్చు. రోజూ 100ఎస్ఎంఎస్‌లు వాడుకోవచ్చు. వీఐ మూవీస్, టీవీ క్లాసిక్ యాక్సెస్ లభిస్తుంది. 

వొడాఫోన్ ఐడియా రూ.249 రీఛార్జ్ చేస్తే 28 రోజుల వేలిడిటీ లభిస్తుంది. రోజూ 1.5జీబీ డేటా ఉపయోగించుకోవచ్చు. అన్‌లిమిటెడ్ కాల్స్ చేసుకోవచ్చు. వీఐ మూవీస్, టీవీ క్లాసిక్ యాక్సెస్ లభిస్తుంది. వొడాఫోన్ ఐడియా యాప్ ద్వారా రీఛార్జ్ చేస్తే 5జీబీ డేటా అదనంగా లభిస్తుంది. రోల్ ఓవర్ డేటా వర్తిస్తుంది. అంటే వారంలో మొదటి 5 రోజుల్లో ఉపయోగించని డేటాను శని, ఆదివారాలు ఉపయోగించుకోవచ్చు.


Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle