ఇస్రో.. 8.9వేల కోట్ల రూపాయలు చెల్లించాల్సిందే
30-10-202030-10-2020 15:25:36 IST
Updated On 30-10-2020 15:44:12 ISTUpdated On 30-10-20202020-10-30T09:55:36.595Z30-10-2020 2020-10-30T09:55:27.329Z - 2020-10-30T10:14:12.769Z - 30-10-2020

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రోకు అమెరికా న్యాయస్థానంలో ఎదురుదెబ్బ తగిలింది. దీంతో ఆ సంస్థకు చెందిన వ్యాపార విభాగమైన యాంత్రిక్స్ కార్పోరేషన్ ఇప్పుడు 1.2 బిలియన్ డాలర్లు(రూ.8.9వేల కోట్లు) పరిహారంగా చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇస్రోకు చెందిన వాణిజ్య శాఖ యాంత్రిక్స్ కార్పొరేషన్‌కు అమెరికా కోర్టు భారీ జరిమానా విధించింది. బెంగుళూరుకు చెందిన స్టార్టప్ దేవాస్ మల్టీమీడియాకు 102 కోట్ల డాలర్లు చెల్లించాలంటే యాంత్రిక్స్‌ను ఆదేశించింది. రెండు శాటిలైట్లు అభివృద్ధి చేసి, ఎస్-బ్యాండ్ స్పెక్ట్రమ్‌లో సిగ్నల్ అందించే విధంగా దేవాస్‌తో 2005లో యాంత్రిక్స్ ఒప్పందం కుదుర్చుకున్నది. కానీ ఆ ఒప్పందాన్ని 2011లో యాంత్రిక్స్ రద్దు చేసింది. దీని పట్ల దేవాస్ మల్లీమీడియా కోర్టులను ఆశ్రయించింది. ఈ కేసులో భారత సుప్రీంను ఆశ్రయించిన దేవాస్‌కు ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. తాజాగా సియాటిల్‌లోని వాషింగ్టన్ జిల్లా కోర్టు జడ్జి థామస్ జెల్లీ ఈ కేసులో అక్టోబర్ 27వ తేదీన తీర్పు వెలువరించారు. దేవాస్‌కు 56.2 కోట్ల డాలర్ల జరిమానా చెల్లించాలని, వడ్డీతో కలిపి మొత్తం నష్టపరిహారం 102 కోట్ల డాలర్లు చెల్లించాలంటూ సియాటిల్ కోర్టు తన తీర్పులో యాంత్రిక్స్‌ను ఆదేశించింది. కోర్టు పరిధి అంశంలో దేవాస్, యాంత్రిక్స్ మధ్య విభేదాలు ఉన్నా.. అమెరికాలోనూ కోర్టు కేసును వాదించే హక్కు ఉన్నట్లు గతంలో దేవాస్ తెలిపింది. యాంత్రిక్స్ కార్పొరేషన్‌కు సియాటిల్‌లో ప్రధాన కార్యాలయం ఉన్నది. అందుకే సియాటిల్‌లోని వాషింగ్టన్ జిల్లా కోర్టు జడ్జి థామస్ జెల్లీ ఈ కేసులో అక్టోబర్ 27వ తేదీన తీర్పు వెలువరించారు. దేవాస్‌కు 56.2 కోట్ల డాలర్ల జరిమానా చెల్లించాలని, వడ్డీతో కలిపి మొత్తం నష్టపరిహారం 102 కోట్ల డాలర్లు చెల్లించాలని సియాటిల్ కోర్టు తన తీర్పులో యాంత్రిక్స్‌ను ఆదేశించింది.

ప్రపంచంలోనే అతిపెద్ద ఓలా ఈ-స్కూటర్ ఫ్యాక్టరీ.. ఏడాదిలో కోటి యూనిట్ల తయారీ
12 hours ago

ట్వీట్ లో తప్పులకు చెక్ పెట్టొచ్చా..?
06-03-2021

మంచి నిర్ణయం తీసుకున్న రిలయన్స్ సంస్థ.. పలు టెక్ దిగ్గజాలు కూడా..!
05-03-2021

స్పెక్ట్రమ్ వేలంలో భారీ బిడ్లు.. టాప్ బయ్యర్‌గా రిలయెన్స్
03-03-2021

ఐదేళ్ల తర్వాత టెలికాం స్పెక్ట్రమ్ వేలం.. జియో దూకుడు..!
03-03-2021

గూగుల్ మెసేజీలకు షెడ్యూల్ పెట్టుకునే అవకాశం కూడా..!
02-03-2021

పీఎస్ఎల్వీ సీ51.. భారత్ ఖ్యాతిని మరింత పెంచుతూ..!
28-02-2021

రెండేళ్లు ఫ్రీ కాల్స్, ఇంటర్నెట్.. జియో సంచలన ఆఫర్
27-02-2021

ఓటీటీల విషయంలో క్లారిటీ ఇచ్చిన కేంద్రం..!
26-02-2021

ఒకే ఒక్క ట్వీట్ లక్ష కోట్లు ఆవిరయ్యేలా చేసింది..!
23-02-2021
ఇంకా