కేంద్రం, ట్విట్టర్ మధ్య ముదిరిన వివాదం.. దేశీయ 'కూ' యాప్ షురూ
11-02-202111-02-2021 08:51:19 IST
Updated On 11-02-2021 08:51:17 ISTUpdated On 11-02-20212021-02-11T03:21:19.167Z11-02-2021 2021-02-11T03:21:03.923Z - 2021-02-11T03:21:17.118Z - 11-02-2021

koo app twitter alternative: భారత ప్రభుత్వానికి, మైక్రో బ్లాగింగ్ ప్లాట్ ఫామ్ ట్విట్టర్‌కి మధ్య కొనసాగుతున్న వివాదం ఒక కొత్త దేశీయ యాప్ ఆవిర్భావానికి దారి తీసింది. ఖలిస్తాన్, పాకిస్తాన్ లింకులు ఉన్న 1,178 ఖాతాలను నిషేధించాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం చేసిన హెచ్చరికల నేపథ్యంలో ట్విట్టర్ ఇప్పటికే పలు ఖాతాలను తొలగించింది కానీ భారత ప్రభుత్వ ఆదేశాలు భావ ప్రకటనా స్వేచ్ఛకు పెను దెబ్బ అంటూ ట్విట్టర్ తాజాగా తన బ్లాగ్ పోస్ట్‌లో చేసిన వ్యాఖ్య పట్ల కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖ మండిపడింది. ప్రభుత్వంతో చర్చలు జరపడానికి ముందే ట్విట్టర్ ఇలా వ్యవహరించడం సరి కాదని, అసాధారణమైన ఈ ప్రకటనపై త్వరలోనే స్పందిస్తానని సమాచార మంత్రిత్వ శాఖ పేర్కొంది. అయితే ఈ ప్రకటనను దేశీయ యాప్ కూ ప్లాట్ ఫామ్‌పై ఐటీ శాఖ పోస్ట్ చేయడం సంచలనం కలిగిస్తోంది. ఉగ్రవాదులకు మద్దతిస్తున్న లింకులను నిషేధించాలని ఆదేశించిన కేంద్రప్రభుత్వంతో సమావేశం కావడానికి అవకాశం ఇవ్వాలని ట్విట్టర్ కోరింది ఈ మేరకు ఐటీ మంత్రిత్వ శాఖ కార్యదర్శితో ట్విట్టర్ సీనియర్ యాజమాన్యం మాట్లాడాల్సి ఉండగా ఆ బేటీకి ముందే ట్విట్టర్ తన బ్లాగ్ పోస్ట్‌లో భావ ప్రకటనా స్వచ్ఛకు భంగం కలిగిందంటూ ట్విట్టర్ వ్యాఖ్యానించడాన్ని కేంద్రం సీరియస్‌గా తీసుకుంది. అసలు ఈ వివాదానికి ఎక్కడ మూలం పడిందంటే జనవరి 26న ఢిల్లీలో సాగుచట్టాల రద్దుకు డిమాండ్ చేస్తున్న రైతు సంఘాలు కిసాన్ ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించిన సందర్భంగా అనూహ్యంగా హింసాకాండ నెలకొంది. ఈ హింసాకాండ తర్వాత 250 ట్విట్టర్ ఖాతాలపై చర్యలు తీసుకోవాలని భారత ప్రభుత్వం కోరగా ట్విటర్ కొన్ని ఖాతాలపై చర్యలు తీసుకుని, కొద్ది గంటల్లోనే వాటిని పునరుద్ధరించింది. దీంతో కేంద్ర ప్రభుత్వం మరోసారి ట్విటర్‌కు ఆదేశాలు జారీ చేసింది. హింసాకాండను రెచ్చగొడుతున్న ట్విటర్ ఖాతాలపై చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపింది. అందరిపై తాను చర్యలు తీసుకోలేనని ముఖ్యంగా మీడియా సంస్థలు, పాత్రికేయులు, ఉద్యమకారులు, రాజకీయ నాయకుల ఖాతాలపై చర్యలు తీసుకోలేదని ట్విట్టర్ తెలిపింది. వీటిపై చర్యలు తీసుకుంటే, భారతీయ చట్టాల ప్రకారం వారి ప్రాథమిక హక్కును ఉల్లంఘించినట్లవుతుందని పేర్కొంది. ప్రభుత్వంతో సమావేశమయ్యేందుకు అవకాశం కల్పించాలని కోరింది. కేంద్ర ఎలక్ట్రానిక్, ఐటీ మంత్రిత్వ శాఖకు బుధవారం ఈ సమాచారాన్ని తెలియజేశామని, చర్చలను కొనసాగిస్తామని ట్విటర్ తెలిపింది. కేంద్రప్రభుత్వ అధికారాన్నే సవాలు చేస్తున్నట్లుగా ట్విట్టర్ వ్యవహరించడంతో ప్రభుత్వం వేగంగా స్పందించింది. ‘కూ’ అనే కొత్త సామాజిక మాధ్యమ వేదికను రూపొందించింది. ఇది ట్విటర్‌కు పోటీగా వచ్చిన మేడ్ ఇన్ ఇండియా ప్లాట్‌ఫామ్. దీనిలో చాలా మంది కేంద్ర మంత్రులు, మంత్రిత్వ శాఖలు తమ అధికారిక ఖాతాలను తెరిచాయి.

రెండేళ్లు ఫ్రీ కాల్స్, ఇంటర్నెట్.. జియో సంచలన ఆఫర్
2 hours ago

ఓటీటీల విషయంలో క్లారిటీ ఇచ్చిన కేంద్రం..!
14 hours ago

ఒకే ఒక్క ట్వీట్ లక్ష కోట్లు ఆవిరయ్యేలా చేసింది..!
23-02-2021

చంద్రయాన్-3 వాయిదా
22-02-2021

వాట్సాప్ కు పోటీగా సందేశ్.. క్లిక్ అయ్యేనా..?
19-02-2021

మార్స్ గ్రహంపై నాసా రోవర్.. ఆపరేషన్ లీడ్‌గా స్వాతి మోహన్
19-02-2021

వార్తలు షేర్ చేయకుండా ఫేస్ బుక్ సంచలన నిర్ణయం
18-02-2021

సంచలన ఆఫర్ ను తీసుకుని వచ్చిన వీఐ
18-02-2021

పౌరుల గోప్యత అంటే అంత చిన్నచూపా.. వాట్సాప్‌పై సుప్రీంకోర్టు ధ్వజం
17-02-2021

వాట్సాప్ ను వెంటాడుతూ ఉన్న ప్రైవసీ వివాదాలు
16-02-2021
ఇంకా