newssting
Radio
BITING NEWS :
విజయవాడలో కన్నకూతురిని అమ్మకానికి పెట్టిన తాగుబోతు తండ్రి. విషయం తెలిసి తండ్రిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చిన చైల్డ్ లైన్ అధికారులు. అనంతరం చిన్నారిని తల్లిదండ్రులకు అప్పగించిన పోలీసులు. * తెలుగు రాష్ట్రాల్లో రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో 11 మంది దుర్మరణం. రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో ఇన్నోవా - బోర్ వెల్ లారీ ఢీ. ప్రమాదంలో ఆరుగురు మృతి, ముగ్గురికి తీవ్రగాయాలు. ప్రమాద సమయంలో ఇన్నోవాలో 11 మంది ప్రయాణికులు. మృతులంతా హైదరాబాద్ లోని తాడ్ బన్ కు చెందినవారుగా గుర్తించిన పోలీసులు. * కర్నూల్ జిల్లా గూడూరు వద్ద బైక్ ను ఢీ కొట్టిన ట్రాక్టర్. ముగ్గురు దుర్మరణం, మృతులంతా బ్రాహ్మణదొడ్డికి చెందినవారుగా గుర్తించిన పోలీసులు. * ఖమ్మం జిల్లా కామేపల్లి వద్ద టిప్పర్ - స్కూటీ ఢీ, ఇద్దరు మృతి. * మూడోరోజు ప్రారంభమైన ఏపీ అసెంబ్లీ సమావేశాలు. రాష్ట్రంలో ఇసుక సమస్యపై అసెంబ్లీలో టీడీపీ వాయిదా తీర్మానం.

తప్పు ఒప్పుకున్న ట్విట్టర్.. భారత ప్రభుత్వం క్షమిస్తుందా..?

19-11-202019-11-2020 18:56:48 IST
2020-11-19T13:26:48.379Z19-11-2020 2020-11-19T13:26:40.709Z - - 02-12-2020

తప్పు ఒప్పుకున్న ట్విట్టర్.. భారత ప్రభుత్వం క్షమిస్తుందా..?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

 చైనా భూభాగంలో లద్దాఖ్‌ను చూపడం తమ తప్పేనని సామాజిక మాధ్యమం ట్విట్టర్‌ అంగీకరించింది. తప్పుగా చూపించినందుకు ట్విట్టర్‌ రాతపూర్వకంగా పార్లమెంటరీ కమిటీకి క్షమాపణలు తెలిపినట్లు, ఈనెలాఖరుకు ఆ తప్పుని సరిదిద్దుకుంటామని హామీ ఇచ్చినట్లు పార్లమెంటరీ కమిటీ ఛైర్‌పర్సన్‌ మీనాక్షి లేఖి తెలిపారు. 

లేహ్ ప్రాంతాన్ని కేంద్రపాలిత ప్రాంతం లడఖ్‌లో చూపకుండా జమ్మూకాశ్మీర్‌‌లో చూపించిన నేపథ్యంలో ట్విట్టర్‌కు నవంబర్ 9న కేంద్రం నోటీసులు జారీ చేసింది. భారతదేశ ప్రాదేశిక సమగ్రతను అగౌరపర్చినందుకు మీపై ఎందుకు చట్టపరమైన చర్యలు ఎందుకు తీసుకోకూడదో చెప్పాలని ట్విట్టర్‌ను ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ నోటీసులో తెలిపింది. ఇటీవలే లడఖ్‌ను ప్రభుత్వం కేంద్రపాలిత ప్రాంతంగా చేసి, దానికి లేహ్‌ను రాజధానిగా చేసింది. ట్విట్టర్ మాత్రం లేహ్‌ను చైనాలో భాగంగా చూపించడంతో దీనిని భారత ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. ట్విట్టర్ అధినేత జాక్ డోర్సీకి లేఖ రాయడంతో పటంలో మార్పులు చేయడంతో లేహ్ ను జమ్మూకశ్మీర్‌లో భాగంగా చేసింది. దీంతో ప్రభుత్వం మరోమారు మండిపడింది. ఇలా ఎందుకు చూపించాల్సి వచ్చిందో వివరణ ఇవ్వాలంటూ నోటీసులు పంపింది.భారత సార్వభౌమత్వాన్ని అణగదొక్కేందుకు ఉద్దేశపూర్వకంగానే ఇలా చేస్తున్నట్టు కనిపిస్తోందని నోటీసుల్లో ఆగ్రహం వ్యక్తం చేసింది. తప్పుడు పటాన్ని చూపించి భారతదేశ ప్రాదేశిక సమగ్రతను అగౌరవపరిచినందుకు వెబ్‌సైట్, దాని ప్రతినిధులపై చట్టపరమైన చర్యలు ఎందుకు తీసుకోకూడదో ఐదు రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించింది. 

అందులో భాగంగా ట్విట్టర్ తప్పు ఒప్పుకుంది. భారత పటాన్ని జియో ట్యాగింగ్‌లో తప్పుగా చూపించినందుకు ట్విట్టర్‌ చీఫ్‌ ప్రైవసీ ఆఫీసర్‌ డామియన్‌ కరియన్‌ సంతకంతో కూడిన అఫిడవిట్‌ పార్లమెంటు కమిటీకి సమర్పించారు. ట్విట్టర్‌ ఇండియా ప్రతినిధులు క్షమాపణ కోరారు. భారత ప్రజల విశ్వాసాలను గాయపర్చినందుకు వారు క్షమాపణ కోరారని, నవంబర్‌ 30 లోపు ఆ తప్పును సరిదిద్దుకుంటామని హామీ ఇచ్చినట్టు మీనాక్షి లేఖి తెలిపారు.


Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle