భారత ప్రభుత్వం వార్నింగ్.. దిగొచ్చిన ట్విట్టర్
10-02-202110-02-2021 12:12:05 IST
2021-02-10T06:42:05.455Z10-02-2021 2021-02-10T06:41:56.278Z - - 08-03-2021

భారత ప్రభుత్వం తీసుకుని వచ్చిన వ్యవసాయ చట్టాలపై పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే..! సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున విదేశీ సెలెబ్రిటీల దగ్గర నుండి.. భారత్ కు చెందిన వారు కూడా ట్వీట్లు చేస్తూ వస్తున్నారు. అయితే అలా చేసిన ట్వీట్ల ద్వారా భారత ప్రధాని మీద అనుచిత హ్యాష్ ట్యాగ్స్ ఉపయోగించడం కూడా వివాదాస్పదం అయింది. దీంతో ఆ ట్వీట్స్ చేసిన అకౌంట్స్ ను సస్పెండ్ చేయాలని భారత ప్రభుత్వం ట్విట్టర్ ను కోరింది.. అయితే కొన్ని గంటల పాటూ మాత్రమే సస్పెండ్ చేసిన ట్విట్టర్ ఆ తర్వాత వాటిని తిరిగి కొనసాగించింది. ఈ విషయం భారత ప్రభుత్వానికి అసలు నచ్చలేదు. దీంతో ట్విట్టర్ మీద ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది.
ట్విట్టర్ సంస్థ అత్యున్నత అధికారులు అరెస్ట్ అయ్యే ముప్పు, జరిమానా పడే అవకాశం ఉండడంతో.. కేంద్ర ప్రభుత్వం బ్లాక్ లిస్టులో పెట్టిన ఖాతాలను డిలీట్ చేస్తోంది. ‘రైతుల హత్యకు మోదీ కుట్ర (#ModiPlanningFarmerGenocide)’ అన్న హాష్ ట్యాగ్ తో కొందరు ట్వీట్టు చేస్తున్నారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. రెచ్చగొట్టేలా ఉన్న ఆ ట్వీట్లను తొలగించాలని, ఆ ఖాతాలను డిలీట్ చేయాలని ట్విట్టర్ ను ఐటీ మంత్రిత్వ శాఖ ఆదేశించింది. అందుకు ట్విట్టర్ ఒప్పుకోలేదు. ప్రభుత్వ ఆదేశాలను ట్విట్టర్ పాటించాల్సిందేనని, లేదంటే అరెస్ట్ లను ఎదుర్కోవాల్సి ఉంటుందని ఐటీ శాఖ నోటీసులు ఇవ్వడంతో తలొగ్గాల్సి వచ్చింది ట్విట్టర్. ఆ హాష్ ట్యాగ్ తో 257 ఖాతాల నుంచి ట్వీట్లు వెళ్లినట్టు గుర్తించిన సంస్థ.. 126 ఖాతాలను డిలీట్ చేసినట్టు అధికార వర్గాలు చెబుతున్నాయి. ఖలిస్థానీ, పాకిస్థాన్ గ్రూపులతో లింకులున్నట్టు కేంద్ర ప్రభుత్వం భావిస్తున్న 1,178 ఖాతాల్లో 583 ఖాతాలను తొలగించారు. దీనిపై ట్విట్టర్ భారత ప్రతినిధి స్పందించేందుకు నిరాకరించారు. మొత్తంగా 709 ఖాతాలను తొలగించినట్టు తెలుస్తోంది. సామాజిక మాధ్యమాల్లో భారత్ లో జరుగుతున్న రైతుల ఉద్యమం విషయంలో రెచ్చగొట్టే పోస్టులు పెట్టడానికి కొందరు ప్లాన్ వేసినట్లుగా కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. రిపబ్లిక్ డే పెరేడ్ సమయంలో పాకిస్థాన్ లో కొన్ని వందల ట్విట్టర్ ఖాతాలను కేవలం హింసను ప్రేరేపించడానికే మొదలు పెట్టారని కేంద్రం హెచ్చరించింది. వాటిపై కూడా అధికారులు నిఘా పెట్టారు.

ప్రపంచంలోనే అతిపెద్ద ఓలా ఈ-స్కూటర్ ఫ్యాక్టరీ.. ఏడాదిలో కోటి యూనిట్ల తయారీ
11 hours ago

ట్వీట్ లో తప్పులకు చెక్ పెట్టొచ్చా..?
06-03-2021

మంచి నిర్ణయం తీసుకున్న రిలయన్స్ సంస్థ.. పలు టెక్ దిగ్గజాలు కూడా..!
05-03-2021

స్పెక్ట్రమ్ వేలంలో భారీ బిడ్లు.. టాప్ బయ్యర్గా రిలయెన్స్
03-03-2021

ఐదేళ్ల తర్వాత టెలికాం స్పెక్ట్రమ్ వేలం.. జియో దూకుడు..!
03-03-2021

గూగుల్ మెసేజీలకు షెడ్యూల్ పెట్టుకునే అవకాశం కూడా..!
02-03-2021

పీఎస్ఎల్వీ సీ51.. భారత్ ఖ్యాతిని మరింత పెంచుతూ..!
28-02-2021

రెండేళ్లు ఫ్రీ కాల్స్, ఇంటర్నెట్.. జియో సంచలన ఆఫర్
27-02-2021

ఓటీటీల విషయంలో క్లారిటీ ఇచ్చిన కేంద్రం..!
26-02-2021

ఒకే ఒక్క ట్వీట్ లక్ష కోట్లు ఆవిరయ్యేలా చేసింది..!
23-02-2021
ఇంకా