ఇక చుక్ చుక్ బండే బెటర్.. అమెజాన్ లో ట్రైన్ టికెట్స్!
07-10-202007-10-2020 22:32:26 IST
2020-10-07T17:02:26.160Z07-10-2020 2020-10-07T17:02:17.100Z - - 20-01-2021

అమేజాన్ అంతే. అడుగు పెట్టిందంటే అక్కడ రచ్చే. తన స్టైల్ మార్క్ చూసుకుంటుంది. మిగతా వాళ్లంతా ఎందుకొచ్చిందిరా బాబూ అని తలలు పట్టుకోవాల్సిందే. ఇప్పుడు చుక్ చుక్ బండి బుకింగ్ లోకి కూడా వచ్చేసింది అమేజాన్. లాంగ్ జర్నీ చేస్తూ ఊరెళ్లాలంటే రైలు బండే బెటర్ అనుకుంటాం కదా. బస్సులు అయితే టిక్కెట్ రేట్ల పేరుతో బాదేస్తుంటారు..
రైలు బండైతే దర్జాగా పడుకుని వెళ్లొచ్చు..సగం రేటుకే జర్నీ చేయొచ్చు అనుకుంటాం. ఇప్పుడు ఆ సగం రేటులో ఇంకో పావలానో పది పైసలో తగ్గడం గ్యారంటీ. ఎందుకంటే అమేజాన్ సైట్ లో కూడా రైలు టిక్కెట్లు బుక్ చేసుకునే ఛాన్స్ వచ్చింది. ఆల్రెడీ ఒప్పందాలు పత్రాలు పర్మిషన్లు అన్నీ అయిపోయాయంట. ఇక డిస్కౌంట్ లు తీసుకోవడం బుక్ చేసుకోవడం.. ఆఫర్లు అందుకోవడం చెక్కేయడం..అంతే. వచ్చీ రాగానే ఓపెనింగ్ ఆఫర్లు కన్ఫామ్ చేసింది. 10 పర్సంట్ డిస్కౌంట్ ఫిక్స్ చేసింది అమేజాన్. ప్రైమ్ ఉన్న వాళ్లకి ఇంకో రెండు శాతం అంటూ 12 పర్సంట్ డిస్కౌంట్ ఇస్తోంది.
ఇప్పుడే ఇలా ఉదంటే ముందు ముందు టిక్కెట్ కాస్ట్ ఇంకా చీప్ కావడం గ్యారంటీ. ఇంకేదో బ్యాంకు వాళ్లు వస్తారు..ఇంకో టెన్ పర్సంట్ అంటారు. మరేదో క్రెడిట్ కార్డు వాళ్లు వచ్చి ఇంకో ఫైవ్ పర్సంట్ అంటరు. ఇలా డిస్కౌంట్ల వరద వానాకాలంతో పని లేకుండా పరుగులు పెడుతూనే ఉంటుంది. ఇక పండగలు పబ్బాలు వచ్చినప్పుడు ఆటలాడండి ఆఫర్లు అందుకోండి అంటూ అమేజాన్ బంపర్ ఆఫర్లు ఇవ్వడం గ్యారంటీ.
ఈ వార్త తెలిసిన జనాలు..పెట్రోల్ బుకింగుకి కూడా వస్తే బాగుండు..మటన్ మార్కెట్ లోకి.. కూరగాయల మార్కెట్ లోకి కూడా వస్తే బావుండు అంటున్నారు. కంగారేం లేదు. ముందు ముందు చాలా మార్కెట్స్ లోకి వస్తుంది. మనకి కూడా అవకాశాలు బానే ఉంటయ్. ప్రజెంట్ గా అయితే వచ్చిన ఆఫర్లు ఎంజాయ్ చేస్తే పోలా.

వాట్సప్ కు భారత్ వార్నింగ్
5 hours ago

ఫ్లిప్ కార్ట్ సూపర్ కాయిన్స్ ను ఇకపై అలా కూడా వాడుకోవచ్చట..!
18-01-2021

ఫేస్బుక్, ట్విట్టర్‌కు పార్లమెంటరీ ప్యానెల్ పిలుపు
18-01-2021

వాట్సాప్ యూటర్న్.. మే 15 వరకు కొత్త ప్రైవసీ విధానం లేదు
17-01-2021

వాట్సాప్.. వెనకడుగు వేయకతప్పలేదు
17-01-2021

వాట్సాప్ గోప్యత మార్పుతో సిగ్నల్, టెలిగ్రాం పంట పండినట్లే
15-01-2021

ఎయిర్ పోడ్స్ ఛార్జింగ్ కోసం సరికొత్త మొబైల్ కేస్ ను తీసుకుని రానున్న యాపిల్
14-01-2021

వాట్సాప్‌కు ప్రత్యామ్నాయంగా 21 బెస్ట్ యాప్‌లు
13-01-2021

యూట్యూబ్ నుంచి కూడా ట్రంప్ ఔట్
13-01-2021

ప్రాణం పోవడానికి కారణం అయిన గూగుల్ మ్యాప్స్..?
13-01-2021
ఇంకా