వాట్సాప్ ను వెంటాడుతూ ఉన్న ప్రైవసీ వివాదాలు
16-02-202116-02-2021 13:10:38 IST
Updated On 16-02-2021 10:38:58 ISTUpdated On 16-02-20212021-02-16T07:40:38.663Z15-02-2021 2021-02-15T17:34:34.372Z - 2021-02-16T05:08:58.594Z - 16-02-2021

ప్రముఖ సామాజిక మాధ్యమం ఫేస్ బుక్, దానికి చెందిన మెసేజింగ్ యాప్ వాట్సాప్ లకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. మీది రెండు లేదా మూడు ట్రిలియన్ డాలర్ల సంస్థ కావచ్చు... కానీ మీకంటే ప్రజలు వారి గోప్యతకే ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తారని సుప్రీం కోర్టు వ్యాఖ్యలు చేసింది. భారతదేశంలో ఇటీవల ప్రవేశపెట్టిన నూతన గోప్యతా విధానంపై వివరణ ఇవ్వాలని నోటీసుల్లో సుప్రీం ఆదేశించింది. నాలుగు వారాల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. ప్రజల గోప్యతను కాపాడటం తమ బాధ్యత అని స్పష్టం చేసింది. గోప్యత లేకపోవడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారని చెప్పుకొచ్చింది ధర్మాసనం. ఎవరికైనా మెసేజ్ పంపితే అది ఫేస్ బుక్ కు అందుబాటులో ఉంటోందని ప్రజలు అనుకుంటున్నారని.. ఇలాంటి ఎన్నో అనుమానాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత మీ సంస్థకు ఉందని తెలిపింది. ఇక ఫేస్ బుక్, వాట్సాప్ తరపున ప్రముఖ లాయర్ కపిల్ సిబాల్ వాదించారు. నూతన గోప్యతా విధానం వల్ల యూజర్ల సమాచారం బయటకు వెళ్లదని అన్నారు. ప్రైవసీపై యూరప్ లో ఒక ప్రత్యేక చట్టం ఉందని, భారత్ కూడా అలాంటి చట్టాలనే తీసుకొస్తే, దాన్ని అనుసరించడం జరుగుతుందని చెప్పారు. ఫేస్ బుక్, వాట్సాప్ లు ఒకరి మెసేజీలను చూసే అవకాశమే లేదని కోర్టుకు వివరించారు కపిల్ సిబాల్. నూతన ప్రైవసీ పాలసీ యూజర్ల వ్యక్తిగత సమాచార భద్రతకు వ్యతిరేకంగా ఉందని వచ్చిన వ్యాఖ్యలపై వాట్సాప్ మాతృసంస్థ ఫేస్ బుక్ కొద్దిరోజుల కిందట కూడా వివరణ ఇచ్చింది. ఫేస్ బుక్ ఇండియా వైస్ ప్రెసిడెంట్, మేనేజింగ్ డైరెక్టర్ అజిత్ మోహన్ ఓ కార్యక్రమంలో వాట్సాప్ ప్రైవసీ పాలసీ గురించి మాట్లాడారు. ప్రైవసీ పాలసీపై తాము మరికొంచెం వివరణాత్మకంగా చెబితే బాగుండేదని.. వ్యక్తిగత సమాచారం ఎన్ క్రిప్షన్ చేయడంలో వాట్సాప్ నిబద్ధతను ఎవరూ అనుమానించలేరని అన్నారు. తామేమీ యూజర్ల సందేశాలను చదవబోమని, ఏ ఒక్కరి సందేశాలను తాము వీక్షించబోమని స్పష్టం చేశారు. ఇతరులెవ్వరూ కూడా యూజర్ల సందేశాల్లోకి తొంగి చూసే అవకాశం లేదని, ప్రైవసీ పాలసీలో ఎలాంటి మార్పులు, చేర్పులు చేశామో అందరికీ అర్థమయ్యేలా వివరించి ఉంటే ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదని చెప్పుకొచ్చారు. వాట్సాప్ లో ఇటీవల ప్రైవసీకి సంబంధించి కొత్త రూల్స్ ను ప్రవేశపెట్టబోతున్నామని చెప్పగానే.. ప్రపంచ వ్యాప్తంగా పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. వాట్సాప్ కు ప్రత్యామ్నాయంగా వేరే యాప్ ఉపయోగించండి అంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. వాట్సాప్ ఏకంగా అందరి మెసేజీలు చదివేస్తోంది అంటూ ప్రచారం కూడా చేశారు.

రెండేళ్లు ఫ్రీ కాల్స్, ఇంటర్నెట్.. జియో సంచలన ఆఫర్
an hour ago

ఓటీటీల విషయంలో క్లారిటీ ఇచ్చిన కేంద్రం..!
13 hours ago

ఒకే ఒక్క ట్వీట్ లక్ష కోట్లు ఆవిరయ్యేలా చేసింది..!
23-02-2021

చంద్రయాన్-3 వాయిదా
22-02-2021

వాట్సాప్ కు పోటీగా సందేశ్.. క్లిక్ అయ్యేనా..?
19-02-2021

మార్స్ గ్రహంపై నాసా రోవర్.. ఆపరేషన్ లీడ్‌గా స్వాతి మోహన్
19-02-2021

వార్తలు షేర్ చేయకుండా ఫేస్ బుక్ సంచలన నిర్ణయం
18-02-2021

సంచలన ఆఫర్ ను తీసుకుని వచ్చిన వీఐ
18-02-2021

పౌరుల గోప్యత అంటే అంత చిన్నచూపా.. వాట్సాప్‌పై సుప్రీంకోర్టు ధ్వజం
17-02-2021

ముఖ్యమంత్రి కుమార్తెను ఆన్ లైన్ లో మోసం చేసిన కేటుగాళ్లను పట్టుకున్న పోలీసులు
15-02-2021
ఇంకా