newssting
Radio
BITING NEWS :
హైదరాబాద్ వాసులను వెంటాడుతున్న వరద భయం. రానున్న మూడ్రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం. ఏ క్షణాన వరద ముంచెత్తుతుందోనని కంటిమీద కునుకులేకుండా బిక్కుబిక్కుమంటూ గడుపుతున్న లోతట్టు ప్రాంతాల ప్రజలు. * హైదరాబాద్ ను ఆదుకునేందుకు కదిలిన టాలీవుడ్ తారాగణం. సీఎం రిలీఫ్ ఫండ్ కు చిరంజీవి, పవన్ కల్యాణ్, మహేష్ కోటి రూపాయల విరాళం. చెరో 50 లక్షలు ఇచ్చిన ఎన్టీఆర్, రామ్ చరణ్. * విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో ఘనంగా పోలీస్ సంస్మరణ దినోత్సవ వేడుకలు. కరోనాతో మృతి చెందిన పోలీసుల కుటుంబాలకు రూ.50 లక్షలు ఎక్స్ గ్రేషియా ప్రకటించిన సీఎం. పోలీసులకు వీక్లీ ఆఫ్ ఇచ్చిన ఏకైక ప్రభుత్వం వైసీపీనే అన్న మంత్రి సుచరిత. * ఏపీ - తెలంగాణ ప్రభుత్వాల మధ్య ఇంకా కుదరని ఆర్టీసీ ఒప్పందం. ప్రభుత్వాల మొండి వైఖరితో ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు. ఆర్టీసీ అలసత్వాన్ని క్యాష్ చేసుకుంటున్న ప్రైవేట్ ట్రావెల్స్. ఇష్టారాజ్యంగా ఛార్జీలు పెంచిన ప్రైవేట్ బస్సులు. ప్రతి ఏటా ఆర్టీసీకి లాభాలు తెచ్చిపెడుతున్న దసరా. * స్కందమాతగా దర్శనమిస్తోన్న బాసర సరస్వతీ దేవి. * పూర్తిగా నిండిన గండిపేట చెరువు. ఏ క్షణంలోనైనా గేట్లు ఎత్తి నీరు విడుదల చేసే అవకాశం. లోతట్టుప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసిన అధికారులు.

స్మార్ట్ ఫోన్ ల ధరలు పెరగబోతున్నాయ్..!

02-10-202002-10-2020 16:30:52 IST
Updated On 02-10-2020 16:53:29 ISTUpdated On 02-10-20202020-10-02T11:00:52.205Z02-10-2020 2020-10-02T11:00:48.577Z - 2020-10-02T11:23:29.510Z - 02-10-2020

స్మార్ట్ ఫోన్ ల ధరలు పెరగబోతున్నాయ్..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

భారత్ లో స్మార్ట్ ఫోన్ ధరలు పెరగబోతున్నాయి. స్మార్ట్‌ ఫోన్ల తయారీలో ఉపయోగించే డిస్‌ప్లే, టచ్‌ ప్యానెళ్లపై ప్రభుత్వం పది శాతం వరకు దిగుమతి సుంకాన్ని విధించారు. దీంతో స్మార్ట్ ఫోన్ ధరలు మునుపటి కంటే కాస్త ఎక్కువ ధరకు అమ్మబోతున్నారు. యాపిల్‌, శాంసంగ్‌, షియోమి, ఒప్పో బ్రాండెడ్‌ ఫోన్ల ధరలు త్వరలో భారం కానున్నాయి.  

పెంచిన దిగుమతి సుంకాన్ని స్మార్ట్ ఫోన్ కంపెనీలు ఎలాగూ భరించవు.. కాబట్టి తయారీదారులు ఈ భారాన్ని వినియోగదారులపై వేయనున్నారు. ఆత్మనిర్భర్‌ భారత్‌ కార్యక్రమం కింద స్థానిక ఉత్పత్తులను ప్రోత్సహించే ఉద్దేశంతో ప్రభుత్వం ఆయా వస్తువులపై దిగుమతి సుంకాన్ని విధించనుంది. ఈ సుంకం విధించే నిర్ణయంతో డిస్‌ప్లే,టచ్‌ప్యానెళ్లపై సుంకంతో పాటు అదనపు సెస్‌ను కలుపుకొంటే దిగుమతిదారులపై 11 శాతం భారం పడనుంది. దిగుమతి సుంకాల కారణంగా మొబైళ్ల ధరలు 2 నుంచి 5 శాతం వరకు ధరలు పెరిగే అవకాశం ఉంది. ఉత్పాదక కేంద్రంగా ఎదగడానికి ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ మంత్రిత్వశాఖ, తన ఉత్పత్తి లింక్‌ ప్రోత్సాహక పథకం దేశంలో దుకాణాలను ఏర్పాటు చేయడానికి అంతర్జాతీయ ఫోన్ల తయారీదారులను ఆకర్షిస్తోంది. స్మార్ట్‌ ఫోన్‌ ధరలను పెరిగితే సామాన్యుడికి మరింత భారం పడనుంది.

సాధారణంగా పండుగ సీజన్ లలో మొబైల్ ఫోన్ లను ఎక్కువగా కొంటూ ఉంటారు. తమ సన్నిహితులకు గిఫ్ట్ లు ఇవ్వడం వంటివి చేస్తూ ఉంటారు.. ఇక ఎలాగూ ఓ మొబైల్ ఫోన్ ను వాడి వాడి అలసిపోయాక కొత్తది కొనాలని అనుకుంటూ ఉంటారు.. ఇప్పుడు ఈ పెరుగుతున్న స్మార్ట్ ఫోన్ ధరలు ఈ పండగ సీజన్‌లో కొనుగోళ్లు దెబ్బతినేలా చేస్తాయని మార్కెట్‌ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మొబైల్ ఫోన్ కంపెనీలు ఈ విషయంపై ఎలాంటి ప్రకటన చేస్తాయో చూడాలి. 


Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle