newssting
Radio
BITING NEWS :
భారత ప్రభుత్వం ప్రత్యర్థుల ఫోన్లపై నిఘా పెట్టడానికి ఇజ్రాయెల్‌కు చెందిన పెగసస్‌ స్‌పైవేర్‌ను ఉపయోగిస్తోందంటూ వెలువడ్డ వార్తలపై పాకిస్తాన్‌ ప్రభుత్వం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. పాకిస్తాన్‌ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ ఖాన్‌తోపాటు పలువురు విదేశీ ప్రముఖులు పేర్లు ఈ జాబితాలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయని గుర్తుచేసింది. ఈ వ్యవహారంలో ఐక్యరాజ్య సమితి వెంటనే జోక్యం చేసుకోవాలని, సమగ్ర దర్యాప్తు జరిపించాలని కోరింది. * ప్రతిపక్ష నేతల ఫోన్లను హ్యాకింగ్‌ చేస్తున్నారంటూ కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ కొనసాగిస్తున్న ఆరోపణల పరంపరంపై బీజేపీ అధికార ప్రతినిధి రాజ్యవర్దన్‌ రాథోడ్‌ ఘాటుగా స్పందించారు. ఫోన్‌ నిజంగా హ్యాకింగ్‌ అయ్యిందని రాహుల్‌ గాంధీ భావిస్తే దర్యాప్తు కోసం అదే ఫోన్‌ను సమర్పించే దమ్ముందా? అని సవాలు విసిరారు. * కోవిడ్‌ విపత్కర పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత సమర్థవంతంగా పని చేసిందని రాష్ట్ర గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ పేర్కొన్నారు. యుద్ద ప్రాతిపదికన ఆస్పత్రుల్లో పడకలు, మందులు, ఆక్సిజన్‌ నిల్వలు ఇతర మౌలిక సదుపాయాలను పెంపొందించిందని చెప్పారు. రాష్ట్ర గవర్నర్‌గా రెండేళ్లు పూర్తయిన సందర్భంగా శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. * రాష్ట్రంలో వరద ముంపునకు గురైన వారిని ఆదుకోవాలని ఇండియన్‌ రెడ్‌ క్రాస్‌ సొసై టీ (ఐఆర్‌సీఎస్‌) ప్రతి నిధులను గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ కోరారు. రాజ్‌భవన్‌ అధికారులు కూడా ప్రభుత్వ అధికారులతో సమన్వయం చేసుకుని రెడ్‌క్రాస్‌ సొసైటీ ద్వారా బాధితులకు సాయం అందేలా కృషి చేయాలని ఆమె ఆదేశించారు. * కంగ్రాట్స్, నారప్ప చిత్రాన్ని ఇప్పుడే చూశా. నటన పరంగా ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేసినట్టుంది. సినిమా చూస్తున్నంత సేపు ఎక్కడా వెంకటేష్ కనబడలేదు, నారప్పే కనిపించాడు. మొత్తానికి ఈ చిత్రంలో కొత్త వెంకటేష్ను చూపించావు. పాత్రను ఎంతగానో అర్థం చేసుకొన్నావ్‌, అందుకే అంతగా ఆ రోల్‌లో లీనమై నటించావు. నీలో ఉండే నటుడు ఎప్పుడూ ఒక తపన తో, తాపత్రయం తో ఉంటాడు. అలాంటి వాటికి ఈ చిత్రం మంచి ఉదాహరణ అని మెగాస్టార్‌ తెలిపారు.

వాట్సాప్ గోప్యత మార్పుతో సిగ్నల్, టెలిగ్రాం పంట పండినట్లే

15-01-202115-01-2021 08:56:33 IST
2021-01-15T03:26:33.453Z15-01-2021 2021-01-15T03:25:39.221Z - - 25-07-2021

వాట్సాప్ గోప్యత మార్పుతో సిగ్నల్, టెలిగ్రాం పంట పండినట్లే
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
వాట్సాప్ ప్రకటనతో భగ్గుమన్న భారత వినియోగదారులు లక్షల సంఖ్యలో వాట్సాప్ మెసేజింగ్ యాప్ నుంచి వైదొలిగుతుండటంతో ప్రత్యామ్నాయ యాప్‌లైన సిగ్నల్, టెలిగ్రామ్‌ల పంట పండుతోంది. భారత్‌లోని 40 కోట్లమంది వాట్సాప్ వినియోగదారులు కొత్తగా సంస్థ రూపొందించిన నూతన గోప్యతా విధానాలను తప్పకుండా ఆమోదించాలని, అలా ఆమోదించనివారి వాట్సాప్ ఖాతాలు ఫిబ్రవరి 8 నుంచి తొలగించబడతాయని వాట్సాప్ యాజమాన్యం చేసిన అహంభావ ప్రకటన ప్రపంచ వ్యాప్తంగా దాని పునాదినే పెకలించివేస్తోంది. 

గోప్యతా నిబంధనల్లో మార్పుల పేరిట వాట్సాప్ తీసుకొచ్చిన కొత్త విధానాలు ఇప్పటికే కొద్ది రోజుల వ్యవధిలోనే ప్రపంచవ్యాప్తంగా కోట్లమంది వినియోగదారులు వాట్సాప్‌నుంచి బయటపడేలా చేసాయి. గత కొన్ని రోజుల్లోనే ఒక్క భారత దేశంలోనే 40 లక్షలమంది వాట్సాప్ యూజర్లు సిగ్నల్, టెలిగ్రామ్ వంటి కొత్త మెసేజింగ్ యాప్‌లకు మళ్లిపోయారు. 

దీంతో బెంబేలెత్తిపోయిన వాట్సాప్ యూజర్ల గోప్యతకు ఎట్టిపరిస్థితుల్లోనూ భంగం కలిగించబోమని వాట్సాప్ యాజమాన్యం అదరాబాదరా ప్రకటన చేసినప్పటికీ యూజర్లలో నమ్మకం కుదరటం లేదు. వాట్సాప్‌ కొత్త పోకడలు నచ్చని యూజర్లు ఎకాయెకిన ఇతర మెసేజింగ్‌ యాప్స్‌ వైపు మళ్లుతున్నారు. దీంతో .. సిగ్నల్, టెలిగ్రాం యాప్‌లకు డిమాండ్‌ గణనీయంగా పెరిగింది. 

వాట్సాప్‌ వివాదాస్పద మార్పులు ప్రకటించిన గత కొద్ది రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా తమ యాప్‌ డౌన్‌లోడ్లు లక్షల సంఖ్యలో పెరిగాయని సిగ్నల్‌ సహ వ్యవస్థాపకుడు బ్రయాన్‌ యాక్టన్‌ వెల్లడించారు. ఇక భారత మార్కెట్లో తమకు అంచనాలు మించిన ఆదరణ లభిస్తోందని ఆయన పేర్కొన్నారు. గడిచిన కొద్ది రోజుల్లో ఊహించని స్థాయిలో యూజర్ల చేరిక నమోదైంది. 40 దేశాల్లో ఐవోఎస్‌ యాప్‌ స్టోర్‌లో మాది టాప్‌ యాప్‌గా ఉంది. అలాగే 18 దేశాల్లో గూగుల్‌ ప్లేలో నంబర్‌ వన్‌గా నిల్చింది. ఈ రెండు సిస్టమ్స్‌లో 1 కోటి పైగా డౌన్‌లోడ్స్‌ నమోదయ్యాయి. గడిచిన మూడు, నాలుగు రోజుల్లో అసాధారణ వృద్ధి, యూసేజీ కనిపిస్తోంది. ఇదేమీ ఇప్పట్లో ఆగేట్లు కనిపించడం లేదు అని యాక్టన్‌ తెలిపారు. 

వాస్తవానికి 2009లో వాట్సాప్‌ను జాన్‌ కౌమ్‌తో కలిసి యాక్టన్‌ నెలకొల్పారు. ఆ తర్వాత వాట్సాప్‌ను కొనుగోలు చేసిన సోషల్‌ నెట్‌వర్కింగ్‌ సైట్‌ ఫేస్‌బుక్‌.. దాన్నుంచి ఆదాయాన్ని రాబట్టేందుకు అనుసరించిన విధానాలు నచ్చక యాక్టన్‌ బైటికొచ్చేశారు. మోక్సీ మార్లిన్‌స్పైక్‌తో కలిసి సిగ్నల్‌ను ప్రారంభించారు. వాట్కాప్ వివాదాస్పద ప్రకటన నేపథ్యంలో సిగ్నల్ యాప్ పంట పండుతోందని చెప్పాలి.

50 కోట్లసంఖ్యను దాటిన టెలిగ్రాం యూజర్లు

ప్రపంచవ్యాప్తంగా తమ యూజర్ల సంఖ్య 50 కోట్లు దాటినట్లు టెలిగ్రాం వెల్లడించింది. గడిచిన మూడు రోజుల్లో కొత్తగా 2.5 కోట్ల మంది యూజర్లు చేరినట్లు వివరించింది. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది యూజర్ల సంఖ్య గణనీయంగా పెరుగుతోందని, ఇదే ధోరణి కొనసాగితే సమీప భవిష్యత్తులో త్వరలోనే 100 కోట్ల యూజర్ల మార్కును సాధించగలమని టెలిగ్రాం సీఈవో పావెల్‌ దురోవ్‌ ఇటీవల వ్యాఖ్యానించారు.

ఉచిత సర్వీసుల కోసం తమ ప్రైవసీని పణంగా పెట్టేందుకు యూజర్లు సిద్ధంగా లేరు. ప్రారంభం నుంచీ మేం యూజర్ల వివరాల గోప్యతకు అత్యంత ప్రాధాన్యమిస్తున్నాం. ఇతర యాప్‌లలాగా ఆదాయం కోసం మేం జవాబు చెప్పుకునేందుకు టెలిగ్రాంలో షేర్‌హోల్డర్లు గానీ ప్రకటనకర్తలు గానీ లేరు.  ఇప్పటిదాకా మా యూజర్ల వ్యక్తిగత డేటా ఏదీ కూడా ఎవరికీ వెల్లడించలేదు అని దురోవ్‌ పేర్కొన్నారు.

వాట్సాప్ మాతృసంస్థ ఫేస్‌బుక్ ఇప్పటికే యూజర్ల నుంచి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటూ ఉండటం తెలిసిందే.

JioFiber: కస్టమర్లకు జియో గుడ్ న్యూస్.. కేవలం 199 రూపాయలకే 1000జీబీ డేటా..!

JioFiber: కస్టమర్లకు జియో గుడ్ న్యూస్.. కేవలం 199 రూపాయలకే 1000జీబీ డేటా..!

   22-07-2021


వాట్సాప్ 2 మిలియన్ భారతీయ ఖాతాలను నిషేధించింది, నెటిజన్లు మీమ్స్ తో స్పందిస్తున్నారు

వాట్సాప్ 2 మిలియన్ భారతీయ ఖాతాలను నిషేధించింది, నెటిజన్లు మీమ్స్ తో స్పందిస్తున్నారు

   17-07-2021


ఓలాకి ఇంత డిమాండా.. ఊహించలేకపోయిన కంపెనీ.. బ్లాక్ అయిన వెబ్ సైట్

ఓలాకి ఇంత డిమాండా.. ఊహించలేకపోయిన కంపెనీ.. బ్లాక్ అయిన వెబ్ సైట్

   16-07-2021


డిజిటల్ ఫ్లాట్ ఫామ్ కాపాడటానికి కొత్త ఐటి నియమాలు: కేంద్రం

డిజిటల్ ఫ్లాట్ ఫామ్ కాపాడటానికి కొత్త ఐటి నియమాలు: కేంద్రం

   13-07-2021


అమెజాన్ వెబ్సైట్ లో అంతరాయం.. తీవ్రంగా ఇబ్బంది పడ్డ కస్టమర్లు

అమెజాన్ వెబ్సైట్ లో అంతరాయం.. తీవ్రంగా ఇబ్బంది పడ్డ కస్టమర్లు

   12-07-2021


అంతరిక్షంలోకి మన తెలుగమ్మాయి..

అంతరిక్షంలోకి మన తెలుగమ్మాయి..

   11-07-2021


ఈ బజాజ్ స్కూటర్, ఇంకా మార్కెట్ లోకి రానేలేదు అయినా..

ఈ బజాజ్ స్కూటర్, ఇంకా మార్కెట్ లోకి రానేలేదు అయినా..

   11-07-2021


రూ. 10 వేలకే రియల్‌ మీ 5 జీ మొబైల్స్

రూ. 10 వేలకే రియల్‌ మీ 5 జీ మొబైల్స్

   07-07-2021


అమెజాన్‌ సీఈవో జెఫ్‌ బేజోస్‌ రాజీనామా.. ఆయన స్థానంలో ఆండీ జస్సీ

అమెజాన్‌ సీఈవో జెఫ్‌ బేజోస్‌ రాజీనామా.. ఆయన స్థానంలో ఆండీ జస్సీ

   05-07-2021


సోషల్ మీడియా డే 2021: చరిత్ర మరియు ప్రాముఖ్యతను తెలుసుకోండి

సోషల్ మీడియా డే 2021: చరిత్ర మరియు ప్రాముఖ్యతను తెలుసుకోండి

   30-06-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle