newssting
Radio
BITING NEWS :
ఓ ఆసుపత్రిలో మహిళా రోగిపై ఉద్యోగి అత్యాచారం. గురుగ్రామ్ నగరంలో వెలుగుచూసిన దారుణం. ప్రైవేటు ఆసుపత్రిలోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో 21 ఏళ్ల యువతి క్షయ వ్యాధితో చికిత్స కోసం చేరగా వెంటిలేటరుపై చికిత్స పొందుతూ స్పృహ లేని స్థితిలో ఉన్నపుడు ఆసుపత్రి ఉద్యోగి ఒకరు తనపై అత్యాచారం చేశాడని తన చేత్తో రాసిన నోట్ ద్వారా తండ్రికి తెలిపిన బాధితురాలు * నలుగురు ఆమ్ ఆద్మీ పార్టీ శాసనసభ్యులపై కేసులు నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు. ఢిల్లీలో పారిశుద్ధ్య పనుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమించిన నలుగురు ఆప్ ఎమ్మెల్యేలపై పోలీసులు కేసులు. పారిశుద్ధ్య పనుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆప్ నాయకుడు దుర్గేష్ పాథక్ 1500మంది ప్రజలతో పౌరకేంద్రం ముందు నిరసన కార్యక్రమం చేపట్టగా..అనుమతి లేకుండా నిరసన చేపట్టారని కేసులు నమోదు * 317వ రోజుకు చేరుకున్న అమరావతి రైతు నిరసనలు. రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ రైతులు, మహిళలు చేపట్టిన నిరసనలు. అమరావతి గ్రామాల్లోని శిబిరాల్లో కొనసాగుతున్న రైతుల ఆందోళనలు. కరోనా సూచనలు పాటిస్తూ సాగుతున్న అమరావతి ఉద్యమం * ఉత్తర తమిళనాడుకు ఆనుకుని నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం. రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమల్లో చెదురుమదురుగా వర్షాలు కురుస్తాయని, మిగిలినచోట్ల పొడి వాతావరణం కొనసాగుతుందని తెలిపిన వాతావరణ శాఖ. కాగా ఈశాన్య గాలులు ప్రారంభం కావడంతో అనేకచోట్ల, ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో కురుస్తున్న మంచు. పగటిపూట మాత్రం కొనసాగుతున్న ఎండ * గ్రేటర్‌ ఎన్నికలకు పడిన మరో ముందడుగు. వార్డుల వారీగా రిటర్నింగ్‌, అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ అధికారులను నియమిస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ. గ్రేటర్‌లో 150 వార్డులకు తహసీల్దార్‌, ఎంపీడీఓ తదితర కేడర్‌ అధికారులను రిటర్నింగ్‌, అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ ఆఫీసర్లుగా జీహెచ్‌ఎంసీ సూచించిన వారిని నియమిస్తున్నట్లుగా రాష్ట్ర ఎన్నికల సంఘం ఆమోదం * బేగంపేట మెట్రో స్టేషన్‌ పై నుంచి పడి యువకుడు మృతి. ఈ నెల 26న జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన. చార్టెడ్‌ అకౌంటెన్సీ కోర్స్‌ చేస్తున్న కర్నూల్‌ జిల్లా మంత్రాలయం రామచంద్రనగర్‌కు చెందిన జీ మంజునాథ్‌ (23) ఈ నెల 14న నగరానికి రాగా ఆత్మహత్య చేసుకున్నట్లుగా సీసీ కెమెరాలలో రికార్డు * గురువారం నుంచి అందుబాటులోకి వచ్చిన తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొస్తున్న ధరణి ఫోర్టల్‌ సేవలు. మేడ్చల్‌ జిల్లా మూడుచింతలపల్లిలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రారంభం. ధరణి సేవలు మొదలైతే తాసిల్దార్‌ కార్యాలయాల్లో రోజుకు16 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ చేసే వెసులుబాటు * చెన్నై నగరాన్ని అతలాకుతలం చేస్తున్న భారీ వర్షాలు. గత రాత్రి నుంచి మహానగరంలో ఎడతెరపిలేకుండా కురుస్తున్న భారీ వర్షాలు. తిరువాన్మియూర్, మైలాపూర్, రాయపెట్ట, అడయార్‌లలో వర్షాలు కురుస్తున్నాయి. కుండపోతగా కురుస్తున్న వర్షాలకు పలు కాలనీలు నీట మునిగగా వర్షపు నీటిని తొలగించడానికి అధికారులు అన్ని చర్యలు చేపట్టారు * మంచిర్యాల జిల్లాలోని హజీపూర్ మండలం నర్సింగ పూర్ శివారులో పెద్ద పులి సంచారం . ఎల్లంపల్లి ప్రాజెక్టు దిగువన పులి సంచారాన్ని గుర్తించిన గ్రామస్థులు. విషయం తెలిసిన అటవీ శాఖ అధికారులు అక్కడకు చేరుకుని అడుగుల ద్వారా పులి సంచారాన్ని నిర్ధారించారు. దీంతో సమీప అటవీ ప్రాంతాలకు ప్రజలు వెళ్ళొద్దని అధికారులు సూచనలు జారీ.

ఐఫోన్ ను ట్రోల్ చేసిన శాంసంగ్.. ఫోన్ కొంటే ఛార్జర్ ఇవ్వకపోవడమేంటండి

16-10-202016-10-2020 10:56:49 IST
Updated On 16-10-2020 11:11:32 ISTUpdated On 16-10-20202020-10-16T05:26:49.283Z16-10-2020 2020-10-16T05:26:42.705Z - 2020-10-16T05:41:32.187Z - 16-10-2020

ఐఫోన్ ను ట్రోల్ చేసిన శాంసంగ్.. ఫోన్ కొంటే ఛార్జర్ ఇవ్వకపోవడమేంటండి
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఐఫోన్ 12 సిరీస్ ను ఇటీవలే యాపిల్ సంస్థ ప్రకటించిన సంగతి తెలిసిందే.. ధరలు ఎప్పటిలాగే ఆకాశాన్ని తాకాయి. అయితే ఓ విషయంపై మాత్రం సామాజిక మాధ్యమాల్లో తీవ్ర చర్చకు దారి తీసింది. అదేమిటంటే ఐఫోన్ 12 సిరీస్ మొబైల్ ఫోన్ ను కొన్నవారికి ఛార్జర్ ఇవ్వకపోవడమే..! లక్ష రూపాయలు మొబైల్ ఫోన్ కొన్నా.. మళ్లీ ఛార్జర్ కొండమేమిటని నెటిజన్లు యాపిల్ సంస్థను ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇక సోషల్ మీడియాలో యాపిల్ ను ట్రోల్ చేస్తున్న వాళ్లు ఎంతో మంది ఉన్నారు. 

శాంసంగ్.. యాపిల్ సంస్థకు రైవల్ అన్న సంగతి తెలిసిందే.. తన తాజా పోస్టులో యాపిల్ కంపెనీని ట్రోల్ చేస్తూ పోస్టు పెట్టింది. 'మీ గెలాక్సీ.. మీరు ఏది కోరుకుంటున్నారో అది ఇస్తుంది.. ఛార్జర్, బెస్ట్ కెమెరా, బ్యాటరీ, పెర్ఫార్మన్స్, 120 హెడ్జెస్ స్క్రీన్' అంటూ ఫేస్ బుక్ లో పోస్టు చేసింది. ముఖ్యంగా నలుపు రంగు ఉన్న ఛార్జర్ ఫోటోను పోస్టు చేసి తాము ఛార్జర్ ఇస్తామని తెలిపింది.        

ఈ పోస్టు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. 70వేలకు పైగా రియాక్షన్లు వచ్చాయి, 10000కు పైగా కామెంట్లు చేశారు. 

ఇటీవలే ఐఫోన్ 12 సిరీస్‌లో నాలుగు 5 జీ ఆధారిత ఫోన్లను  విడుదల చేశారు. ఐఫోన్ 12 మినీ 64 జీబీ స్టోరేజీ వేరియంట్ ధర రూ. 69,900 కాగా, 128 జీబీ ఆప్షన్ ధర రూ. 74,900, 256 జీబీ వేరియంట్ ధర రూ. 84,900 మాత్రమే. ఐఫోన్ 12 64 జీబీ స్టోరేజీ వేరియంట్ ధర రై. 79,900 కాగా, 128 జీబీ స్టోరేజీ ఆప్షన్ ధర రూ. 84,900. 256 జీబీ వేరియంట్ ధర రూ. 94,900. ఐఫోన్ 12 ప్రొ 128 జీబీ స్టోరేజీ ఫోన్ ధర రూ. 1,19,900, ఐఫోన్ 12 ప్రొ 256 స్టోరేజీ వేరియంట్ ధర రూ. 1,29,900, ఐఫోన్ 12 ప్రొ 512 జీబీ స్టోరేజీ ఆప్షన్ ధర రూ. 1,49,900గా పేర్కొంది. ఐఫోన్ 12 ప్రొ మ్యాక్స్ 128 జీబీ స్టోరేజీ వేరియంట్ ధర రూ. 1,29,900 కాగా, 256 జీబీ ఆప్షన్ ధర రూ. 1,39,900, 512జీబీ స్టోరేజీ ఆప్షన్ ధర రూ. 1,59,900.


Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle