newssting
Radio
BITING NEWS :
విజయవాడలో కన్నకూతురిని అమ్మకానికి పెట్టిన తాగుబోతు తండ్రి. విషయం తెలిసి తండ్రిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చిన చైల్డ్ లైన్ అధికారులు. అనంతరం చిన్నారిని తల్లిదండ్రులకు అప్పగించిన పోలీసులు. * తెలుగు రాష్ట్రాల్లో రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో 11 మంది దుర్మరణం. రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో ఇన్నోవా - బోర్ వెల్ లారీ ఢీ. ప్రమాదంలో ఆరుగురు మృతి, ముగ్గురికి తీవ్రగాయాలు. ప్రమాద సమయంలో ఇన్నోవాలో 11 మంది ప్రయాణికులు. మృతులంతా హైదరాబాద్ లోని తాడ్ బన్ కు చెందినవారుగా గుర్తించిన పోలీసులు. * కర్నూల్ జిల్లా గూడూరు వద్ద బైక్ ను ఢీ కొట్టిన ట్రాక్టర్. ముగ్గురు దుర్మరణం, మృతులంతా బ్రాహ్మణదొడ్డికి చెందినవారుగా గుర్తించిన పోలీసులు. * ఖమ్మం జిల్లా కామేపల్లి వద్ద టిప్పర్ - స్కూటీ ఢీ, ఇద్దరు మృతి. * మూడోరోజు ప్రారంభమైన ఏపీ అసెంబ్లీ సమావేశాలు. రాష్ట్రంలో ఇసుక సమస్యపై అసెంబ్లీలో టీడీపీ వాయిదా తీర్మానం.

శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ చైర్మన్ లీ కున్ హీ కన్నుమూత

25-10-202025-10-2020 12:20:26 IST
2020-10-25T06:50:26.729Z25-10-2020 2020-10-25T06:49:50.166Z - - 03-12-2020

శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ చైర్మన్ లీ కున్ హీ కన్నుమూత
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ చైర్మన్ లీ కున్ హీ (78) కన్నుమూశారు. గత ఆరు సంవత్సరాలుగా హృద్రోగ సమస్యలతో బాధపడుతున్నారు ఆయన. ఆరోగ్యం క్షీణించడంతో తుదిశ్వాస విడిచినట్టు శాంసంగ్ సంస్థ తెలిపింది. లీ సారథ్యంలోని శాంసంగ్ ప్రపంచంలోనే అత్యధిక స్మార్ట్‌ఫోన్లు, మెమొరీ చిప్స్‌ను ఉత్పత్తి చేసే కంపెనీగా అవతరించింది. శాంసంగ్ ఎదగడానికి ముఖ్య కారణం లీ అనే చెబుతారు. శాంసంగ్ టర్నోవర్ దక్షిణ కొరియా మొత్తం జీడీపీలోని ఐదో వంతుతో సమానం.. సంస్థ అంతగా ఎదగడానికి కారణం లీ తీసుకున్న నిర్ణయాలే అని చెబుతూ ఉంటారు.  లీ 2014లో తొలిసారి గుండెపోటుకు గురైనప్పటి నుండి హృద్రోగ సమస్యలతో బాధపడుతూనే ఉన్నారు. కొరియాలోని డేగులో 9 జనవరి 1942లో లీ జన్మించారు. శాంసంగ్ వ్యవస్థాపకుడైన తండ్రి లీ బైంగ్ చుల్ మరణం తర్వాత 1987లో లీ శాంసంగ్ బాధ్యతలను చేపట్టి స్మార్ట్‌ఫోన్లు, టీవీలు, కంప్యూటర్ చిప్స్, ఇతర ఎలక్ట్రానిక్ ఉపకరణాల తయారీలో అగ్రగామి సంస్థగా శాంసంగ్‌ను తీర్చిదిద్దారు.

చైర్మన్ కున్ హీ మృతి బాధాకరమని కంపెనీ తెలిపింది. లీ మరణంపై కంపెనీ విచారం వ్యక్తం చేస్తూ చైర్మన్‌ లీ నిజమైన దార్శనికుడని, శామ్‌సాంగ్‌ను దక్షిణ కొరియా నుంచి గ్లోబల్‌ టెక్‌ కంపెనీగా, పారిశ్రామిక శక్తి కేంద్రంగా మార్చాడని సంస్థ కొనియాడింది. ‘అతని వారసత్వం శాశ్వతమైంది’ అని తెలిపింది.కంపెనీకి ప్రస్తుతం లీ కున్‌-హీ తనయుడు లీ జే-యోగ్‌ వైస్‌ చైర్మన్‌గా కొనసాగుతున్నారు. 


Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle