newssting
Radio
BITING NEWS :
విజయవాడలో కన్నకూతురిని అమ్మకానికి పెట్టిన తాగుబోతు తండ్రి. విషయం తెలిసి తండ్రిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చిన చైల్డ్ లైన్ అధికారులు. అనంతరం చిన్నారిని తల్లిదండ్రులకు అప్పగించిన పోలీసులు. * తెలుగు రాష్ట్రాల్లో రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో 11 మంది దుర్మరణం. రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో ఇన్నోవా - బోర్ వెల్ లారీ ఢీ. ప్రమాదంలో ఆరుగురు మృతి, ముగ్గురికి తీవ్రగాయాలు. ప్రమాద సమయంలో ఇన్నోవాలో 11 మంది ప్రయాణికులు. మృతులంతా హైదరాబాద్ లోని తాడ్ బన్ కు చెందినవారుగా గుర్తించిన పోలీసులు. * కర్నూల్ జిల్లా గూడూరు వద్ద బైక్ ను ఢీ కొట్టిన ట్రాక్టర్. ముగ్గురు దుర్మరణం, మృతులంతా బ్రాహ్మణదొడ్డికి చెందినవారుగా గుర్తించిన పోలీసులు. * ఖమ్మం జిల్లా కామేపల్లి వద్ద టిప్పర్ - స్కూటీ ఢీ, ఇద్దరు మృతి. * మూడోరోజు ప్రారంభమైన ఏపీ అసెంబ్లీ సమావేశాలు. రాష్ట్రంలో ఇసుక సమస్యపై అసెంబ్లీలో టీడీపీ వాయిదా తీర్మానం.

లీకైన శాంసంగ్ గెలాక్సీ ఎస్21 సిరీస్ ఫీచర్లు..!

22-10-202022-10-2020 11:07:11 IST
Updated On 22-10-2020 11:17:07 ISTUpdated On 22-10-20202020-10-22T05:37:11.287Z22-10-2020 2020-10-22T05:37:03.010Z - 2020-10-22T05:47:07.308Z - 22-10-2020

లీకైన శాంసంగ్ గెలాక్సీ ఎస్21 సిరీస్ ఫీచర్లు..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

శాంసంగ్ గెలాక్సీ ఎస్21 మొబైల్ ఫోన్ సిరీస్ ను వచ్చే ఏడాది మార్కెట్ లోకి తీసుకుని రానున్నారు. ఈ మొబైల్ ఫోన్ చైనాకు చెందిన 3C వెరిఫికేషన్ ను పాస్ అయ్యింది. ఈ సిరీస్ లో భాగంగా మూడు మొబైల్ ఫోన్లు రాబోతూ ఉన్నాయని తెలుస్తోంది. శాంసంగ్ గెలాక్సీ ఎస్21 సిరీస్ మొబైల్స్ కు చెందిన బ్యాటరీ డీటెయిల్స్ లీక్ అయ్యాయి. శాంసంగ్ గెలాక్సీ ఎస్21 సిరీస్ లో భాగంగా మూడు మొబైల్స్ రాబోతున్నాయని అంటున్నారు. శాంసంగ్ గెలాక్సీ ఎస్21, శాంసంగ్ గెలాక్సీ ఎస్21 ప్లస్ , శాంసంగ్ గెలాక్సీ ఎస్21 అల్ట్రా గా చెబుతూ ఉన్నారు. 

3C సెర్టిఫికేషన్ సమయంలో శాంసంగ్ గెలాక్సీ ఎస్21 సిరీస్ మొబైల్స్ కనిపించాయని టిప్స్టర్ సంస్థ చెబుతోంది. SM-G9910 అనే మోడల్ నెంబర్ తో శాంసంగ్ గెలాక్సీ ఎస్21 తీసుకుని వచ్చారు. 3,880mAh బ్యాటరీతో ఈ మొబైల్ ఫోన్ రాబోతోంది. అలాగే 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉందట. శాంసంగ్ గెలాక్సీ ఎస్21 ప్లస్ కు SM-G9960 మోడల్ నెంబర్ ఇచ్చారు. దీని బ్యాటరీ కెపాసిటీ 4,660mAh గా చెబుతూ ఉన్నారు. శాంసంగ్ గెలాక్సీ ఎస్21 అల్ట్రా కు SM-G9980 మోడల్ నెంబర్ ఇచ్చారు. 4,800mAh బ్యాటరీ సపోర్టుతో ఈ మొబైల్ ఫోన్ రానుంది. 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో ఈ మొబైల్ ఫోన్ రన్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు చెబుతూ ఉన్నారు. Qualcomm Snapdragon 875 SoC ను ఈ మొబైల్ ఫోన్స్ లో భాగంగా తీసుకుని రాబోతున్నారు.    

శాంసంగ్ గెలాక్సీ ఎస్21 సిరీస్ డిస్ప్లే కు సంబంధించిన సమాచారాన్ని కూడా లీక్ చేశారు. శాంసంగ్ గెలాక్సీ ఎస్21, శాంసంగ్ గెలాక్సీ ఎస్21 ప్లస్ మొబైల్స్ 2డి స్క్రీన్స్ తో రాబోతూ ఉన్నాయి.. దీన్ని బట్టి కర్వ్డ్ డిస్ప్లే వస్తుందనే ఆశలను వదిలేయాల్సిందే. శాంసంగ్ గెలాక్సీ ఎస్21 అల్ట్రాలో కర్వ్డ్ ఎడ్జెస్ ఉండనున్నాయి. ఈ మొబైల్ ఫోన్స్ 2021 జనవరిలో వచ్చే అవకాశం ఉందని భావిస్తూ ఉన్నారు.  


Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle