రిలయన్స్ జియో.. అలా మంచి ఆఫర్ తో..!
31-12-202031-12-2020 19:10:08 IST
Updated On 01-01-2021 10:20:10 ISTUpdated On 01-01-20212020-12-31T13:40:08.072Z31-12-2020 2020-12-31T13:39:57.730Z - 2021-01-01T04:50:10.652Z - 01-01-2021

ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ జియో సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. డేటా వినియోగదారులను టార్గెట్ చేసుకుని మార్కెట్ లోకి వచ్చిన జియో సంచలన ఆఫర్లతో భారత్ టెలీకాం రంగంలో దూసుకుపోతోంది. తాజాగా జియో మరోసారి కీలక నిర్ణయం తీసుకుంది. తన వినియోగదారుల కోసం ఇతర్ నెట్‌వర్క్‌కు ఫ్రీ వాయిల్స్ కాల్స్‌ను తిరిగి అందించనివ్వనుంది. జనవరి 1, 2021 నుండి జియో మరోసారి తన నెట్‌వర్క్‌లో ఆఫ్-నెట్ డొమెస్టిక్ వాయిస్ కాల్స్‌ను ఉచితంగా అందిస్తామని తాజాగా ప్రకటించింది. టెలికాం రెగ్యులేటర్ ఆదేశాల ప్రకారం, జనవరి 1, 2021 నుండి దేశంలో 'బిల్ అండ్ కీప్' విధానం అమల్లోకి వస్తుండడంతో జియో ఈ నిర్ణయం తీసుకుంది. ఇకపై జియో చందారులు దేశంలోని ఏమొబైల్ నెట్‌వర్క్‌కైనా ఉచిత వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు. ఇప్పటివరకూ నిమిషానికి 6 పైసలు వసూలు చేసేది. జియో టు జియో ఉచిత కాలింగ్ సదుపాయాలను అందిస్తున్న రిలయన్స్ జియో గత ఏడాది దేశీయంగా ఇతర నెట్వర్క్ వాయిస్ కాల్స్‌కు ఇంటర్‌కనెక్ట్ యూజ్ ఛార్జీలు వసూలు చేస్తూ వచ్చింది. ఇంటర్నెట్ ను ఎక్కువగా వాడే వారికోసం విఐ(వోడాఫోన్ ఐడియా) కూడా ప్రీపెయిడ్ చందాదారుల కోసం వార్షిక రూ.1,499 ప్లాన్‌తో 50 జీబీ అదనపు డేటాను అందిస్తోంది. ఈ అదనపు డేటా అనేది ఎంపిక చేసిన సర్కిల్లలోని వినియోగదారులకు లభిస్తుంది అని విఐ పేర్కొంది. ఈ డేటా తమకు వర్తిస్తుందో లేదో తెలుసుకోవడానికి వోడాఫోన్ ఐడియా యూజర్లు విఐ యొక్క అధికారిక వెబ్ సైట్ లేదా యాప్ ని సందర్శించాలని తెలిపింది. వోడాఫోన్ ఐడియా రూ.1,499 వార్షిక ప్రణాళిక కింద 24జీబీ హై-స్పీడ్ డేటా మాత్రమే లభిస్తుంది. ఇప్పుడు ఎంపిక చేసిన యూజర్లకు 50జీబీ డేటా కలుపుకొని మొత్తం 75జీబీ లభిస్తుంది. ఈ ప్లాన్ కింద అపరిమిత కాల్స్, 3,600 ఎస్ఎంఎస్ లను పొందవచ్చు. అలాగే పాపులర్ వెబ్ సిరీస్, టీవీ షోలు, సినిమాలు, లైవ్ టీవీ ఛానళ్లకు ఉచిత యాక్సెస్ కూడా పొందవచ్చు. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 365 రోజులు.

వాట్సప్ కు భారత్ వార్నింగ్
17 hours ago

ఫ్లిప్ కార్ట్ సూపర్ కాయిన్స్ ను ఇకపై అలా కూడా వాడుకోవచ్చట..!
18-01-2021

ఫేస్బుక్, ట్విట్టర్‌కు పార్లమెంటరీ ప్యానెల్ పిలుపు
18-01-2021

వాట్సాప్ యూటర్న్.. మే 15 వరకు కొత్త ప్రైవసీ విధానం లేదు
17-01-2021

వాట్సాప్.. వెనకడుగు వేయకతప్పలేదు
17-01-2021

వాట్సాప్ గోప్యత మార్పుతో సిగ్నల్, టెలిగ్రాం పంట పండినట్లే
15-01-2021

ఎయిర్ పోడ్స్ ఛార్జింగ్ కోసం సరికొత్త మొబైల్ కేస్ ను తీసుకుని రానున్న యాపిల్
14-01-2021

వాట్సాప్‌కు ప్రత్యామ్నాయంగా 21 బెస్ట్ యాప్‌లు
13-01-2021

యూట్యూబ్ నుంచి కూడా ట్రంప్ ఔట్
13-01-2021

ప్రాణం పోవడానికి కారణం అయిన గూగుల్ మ్యాప్స్..?
13-01-2021
ఇంకా