newssting
Radio
BITING NEWS :
విజయవాడలో కన్నకూతురిని అమ్మకానికి పెట్టిన తాగుబోతు తండ్రి. విషయం తెలిసి తండ్రిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చిన చైల్డ్ లైన్ అధికారులు. అనంతరం చిన్నారిని తల్లిదండ్రులకు అప్పగించిన పోలీసులు. * తెలుగు రాష్ట్రాల్లో రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో 11 మంది దుర్మరణం. రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో ఇన్నోవా - బోర్ వెల్ లారీ ఢీ. ప్రమాదంలో ఆరుగురు మృతి, ముగ్గురికి తీవ్రగాయాలు. ప్రమాద సమయంలో ఇన్నోవాలో 11 మంది ప్రయాణికులు. మృతులంతా హైదరాబాద్ లోని తాడ్ బన్ కు చెందినవారుగా గుర్తించిన పోలీసులు. * కర్నూల్ జిల్లా గూడూరు వద్ద బైక్ ను ఢీ కొట్టిన ట్రాక్టర్. ముగ్గురు దుర్మరణం, మృతులంతా బ్రాహ్మణదొడ్డికి చెందినవారుగా గుర్తించిన పోలీసులు. * ఖమ్మం జిల్లా కామేపల్లి వద్ద టిప్పర్ - స్కూటీ ఢీ, ఇద్దరు మృతి. * మూడోరోజు ప్రారంభమైన ఏపీ అసెంబ్లీ సమావేశాలు. రాష్ట్రంలో ఇసుక సమస్యపై అసెంబ్లీలో టీడీపీ వాయిదా తీర్మానం.

రియల్ మీ వాచ్ ఎస్ లాంఛ్ కన్ఫర్మ్ అయింది..!

25-10-202025-10-2020 15:47:34 IST
Updated On 25-10-2020 17:42:28 ISTUpdated On 25-10-20202020-10-25T10:17:34.792Z25-10-2020 2020-10-25T10:17:30.372Z - 2020-10-25T12:12:28.782Z - 25-10-2020

రియల్ మీ వాచ్ ఎస్ లాంఛ్ కన్ఫర్మ్ అయింది..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
రియల్ మీ నుండి ఇప్పటికే వాచ్ వచ్చింది. అతి త్వరలోనే మరో వాచ్ ను విడుదల చేయనున్నారు. నవంబర్ 2వ తేదీన 'రియల్ మీ వాచ్ ఎస్' ను లాంఛ్ చేయనున్నారు. ఇంతకు ముందు వచ్చిన రియల్ మీ వాచ్ చతురస్రం ఆకారంలో రాగా.. ఇప్పుడు తీసుకుని వస్తున్న రియల్ మీ వాచ్ ఎస్ గుండ్రపు ఆకారంలో రానుంది. రియల్ మీ వాచ్ ఎస్ ను లాంఛ్ చేసిన తర్వాత రియల్ మీ వాచ్ ఎస్ ప్రో ను మార్కెట్ లోకి తీసుకుని రానున్నారు. రియల్ మీ వాచ్ ఎస్ ప్రో ను ఎప్పుడు లాంఛ్ చేస్తారో డేట్ చెప్పలేదు.. కానీ ఈ ఏడాది ముగిసే సమాయానికి తీసుకుని రాబోతున్నట్లు తెలుస్తోంది. రియల్ మీ వాచ్ ఎస్ కు సంబంధించిన డీటైల్స్ ఇటీవలే బయటకు వచ్చాయి. రియల్ మీ వాచ్ ఎస్ కు సంబంధించిన ఫోటోను పోస్టు చేశారు.. అందులో వాచ్ కు సంబంధించిన డయల్ తో పాటూ.. స్ట్రాప్స్ కూడా ఉన్నాయి. 

రియల్ మీ వాచ్ ఎస్ కు 1.3 ఇంచీల ఆటో బ్రైట్నెస్ సర్క్యులర్ డిస్ప్లే ఉంది. బ్యాటరీని ఒక్క సారి పూర్తిగా ఛార్జింగ్ పెడితే 15 రోజుల పాటూ వాడుకోవచ్చట. 16 స్పోర్ట్ మోడ్స్ ఈ వాచ్ లో ఉన్నాయి. హార్ట్ రేట్ తో పాటూ, ఆక్సిజన్ లెవెల్స్ కూడా తెలుసుకోవచ్చు. ఇటీవలే యాపిల్ లాంఛ్ చేసిన యాపిల్ వాచ్ సిరీస్ 6 లో ఈ సదుపాయం ఉంది. మరిన్ని డీటైల్స్ తెలుసుకోవాలంటే నవంబర్ 2 లాంఛ్ వరకూ ఎదురుచూడాల్సిందే..! రియల్ మీ వాచ్ ఎస్ యాపిల్, ఫిట్ బిట్ కంపెనీలకు మంచి పోటీ ఇవ్వనుంది.   


Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle