newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

అంతరిక్షంలో ముల్లంగిని పండించేశారుగా..!

10-03-202110-03-2021 17:03:37 IST
2021-03-10T11:33:37.444Z10-03-2021 2021-03-10T11:12:25.730Z - - 20-04-2021

అంతరిక్షంలో ముల్లంగిని పండించేశారుగా..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

మనిషి చాలా విషయాల్లో ఎదుగుతూ వెళుతున్నాడు.. ఆ విషయం తెలిసిందే..! అంతరిక్షంలో కూడా ఎన్నో అద్భుతాలను సృష్టిస్తూ వెళుతున్నాం. ఇక అంతరిక్షంలో పంటలు పండించడంపై కూడా ఎన్నో రకాల అధ్యయనాలు చేస్తూనే ఉన్నారు. ఎందుకంటే అంతరిక్షంలో ఉండే వ్యోమగాములు వారికి కావాల్సిన పదార్థాలను కింద నుండే తీసుకొని వెల్తూ ఉంటారు. కానీ అంతరిక్షంలో సొంతంగా పండించుకోవడం అనే అంశంపై చాలా చర్చనే నడుస్తూ ఉండగా.. తాజాగా ఆ కీలక ఘట్టాన్ని ఆవిష్కరించేశారు. 

అమెరికా స్పేస్ రీసెర్చ్ సెంటర్... నాసా అంత‌రిక్షంలో ప‌ర్యటించే వ్యోమగాముల ఆక‌లి తీర్చడానికి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ముల్లంగిని పెంచుతున్నట్లు తెలిపింది. ఈ వార్త ఎంతో మందికి ఆసక్తిని రేకెత్తించింది. అంతరిక్షంలో వ్యోమగాములు తీసుకునే ఆహారం చాలా ప్రత్యేకమైన పద్ధతుల్లో తయారవుతుందని తెలిసిందే..! ముఖ్యంగా వీటిలో నీటి శాతాన్ని చాలా వరకూ తగ్గించి వీలైనంత ఎక్కువ కాలం అవి నిల్వ ఉండేలా చేస్తారు. అంతరిక్షానికి వెళ్లినప్పుడు స్పేస్ షటిల్లో వంట గది ఉన్నా.. వారికి అక్కడ వండుకోవడానికి తాజా కూరగాయలు దొరకవు కాబట్టి ఈ మొక్కల పెంపకంపై నాసా దృష్టి పెట్టింది. దీనివల్ల వారు తాజా ఆహారం తినే వీలు కలుగుతుందని అధికారులు చెబుతూ ఉన్నారు. ఇక భ‌విష్యత్తులో మనిషి అంత‌రిక్షం లోతుల్లో అన్వేష‌ణ చేయాల‌నే (డీప్ స్పేస్ హ్యూమ‌న్ ఎక్స్‌ప్లొరేష‌న్) ల‌క్ష్యం వైపు నాసా అడుగులు వేస్తోంది. అంత‌రిక్షంలో ఆస్ట్రోనాట్‌లు జీవించ‌డానికి అవ‌స‌ర‌మైన ఆహార వ‌న‌రుల్ని స‌మ‌కూర్చడానికి శాస్త్రవేత్తలు కృషి చేస్తున్నారు. తాజాగా నాసా శాస్త్రవేత్తలు అంత‌రిక్షంలో ముల్లంగిని పెంచే ప‌నిలో విజ‌యం సాధించారు

సెల్ఫ్-కంటైన్ట్ గ్రోత్ ఛాంబ‌ర్‌లో మైక్రోగ్రావిటీ లో మొక్కల‌ను పెంచ‌డానికి ఇంట‌ర్నేష‌న‌ల్ స్పేస్ స్టేష‌న్‌కి వెళ్లిన శాస్త్రవేత్తలు అడ్వాన్స్డ్ ప్లాంట్ హాబిటాట్ ను ఏర్పాటు చేశారు. ఇది మొక్కలు సొంత‌గా పెర‌గ‌డానికి అనువుగా ఉన్న గ్రోత్ ఛాంబ‌ర్‌. భూమ్యాక‌ర్షణ శ‌క్తి లేన‌ప్పటికీ ఈ గ్రోత్ ఛాంబ‌ర్ మొక్కలు పెర‌గ‌డానికి అనువుగా ఉంటుంది. ఈ ఛాంబ‌ర్‌లో ఎల్ఈడి లైట్లు ఉంటాయి. 180 సెన్సార్‌లు, కెమెరాలు ఉంటాయి. బంక‌మట్టి ఉంటుంది. సెన్సార్లు, కెమెరాలు మొక్క పెరుగుద‌ల‌ను అంచ‌నా వేస్తాయి. శాస్త్రవేత్తలు అక్కడి ప‌రిస్థితుల‌ను మొక్కలకు అనుగుణంగా మార్చడంలో భాగంగా నీరు, ఎరువు పంపిణీని, ఉష్ణోగ్రత‌ల స్థాయిల‌ను నియంత్రిస్తుంటారు. ఈ ప‌రిశోధ‌న‌లో ఎరుపు, నీలం రంగు లైట్లకు మొక్కలు మెరుగ్గా స్పందిస్తున్నాయ‌ని తెలుసుకున్నారు. అలా ముల్లంగిని పెంచి సరికొత్త ఆవిష్కరణకు నాంది పలికారు శాస్త్రవేత్తలు. 

వాట్సాప్ పింక్ లో కూడా వస్తుందా.. వస్తే మీరు ట్రాప్ లో పడ్డట్టే

వాట్సాప్ పింక్ లో కూడా వస్తుందా.. వస్తే మీరు ట్రాప్ లో పడ్డట్టే

   17-04-2021


గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

   12-04-2021


ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

   10-04-2021


మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

   07-04-2021


కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

   06-04-2021


ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

   05-04-2021


పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

   01-04-2021


రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

   25-03-2021


వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

   24-03-2021


ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

   22-03-2021


ఇంకా

Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle