పోస్ట్ పెయిడ్ యూజర్ల కోసం సరికొత్త ఫీచర్ ను తీసుకుని వచ్చిన పేటీఎం..!
24-11-202024-11-2020 08:47:41 IST
Updated On 24-11-2020 10:24:20 ISTUpdated On 24-11-20202020-11-24T03:17:41.000Z24-11-2020 2020-11-24T03:17:37.052Z - 2020-11-24T04:54:20.317Z - 24-11-2020

భారత్ లోని లీడింగ్ పేమెంట్ సర్వీసెస్ అయిన పేటీఎం సంస్థ పోస్ట్ పెయిడ్ యూజర్లకు సరికొత్త ఈఎంఐ ఆప్షన్స్ ను తీసుకొని వచ్చింది. ఇకపై యూజర్లు బడ్జెట్ గురించి ఆలోచించకుండా ఎటువంటి వస్తువునైనా కొనుక్కోవచ్చు.. ఆ తర్వాత ఈఎంఐ ద్వారా కట్టుకోవచ్చు. “buy now and pay later” స్కీమ్ ను తీసుకొని వచ్చారు. 5 లక్షలకు పైగా షాపుల్లోనూ, వెబ్ సైట్లలోనూ ఈ స్కీమ్ ను వాడుకోవచ్చని కంపెనీ ప్రతినిధులు చెబుతూ ఉన్నారు. పేటీఎం సీఈవో భావేశ్ గుప్తా మాట్లాడుతూ 'ఈ పోస్ట్ పెయిడ్ సర్వీస్ అన్నది చాలా మందికి ఉపయోగపడుతుంది. ముఖ్యంగా పండుగల సీజన్ లో ఇది బాగా సహాయం చేస్తుంది. ఈ సర్వీసు 7 మిలియన్ల మంది యూజర్లకు ఉపయోగపడుతుంది.' అని తెలిపారు. ఈ కొత్త సర్వీసు ద్వారా పేటీఎం యూజర్లు తాము కొన్న వస్తువును ఈఎంఐగా కన్వర్ట్ చేసుకోవచ్చు. మొదటి వారం రోజుల్లో ఏ వస్తువునైనా ఈఎంఐగా మార్చుకునే అవకాశం ఉంది. ప్రస్తుతానికి 1 లక్ష రూపాయల లిమిట్ ఇస్తున్నట్లు సంస్థ తెలిపింది. సమయానికి ఈఎంఐలు చెల్లిస్తూ వస్తే.. లిమిట్ ను మరింత పెంచే అవకాశం ఉందని తెలిపారు. పేటీఎం ద్వారా ఎన్నో వస్తువులను కొనొచ్చు.. అలా బిల్ కాస్త ఎక్కువగా ఉంటే దాన్ని ఈఎంఐలలోకి మార్చుకోవచ్చు. ఈఎంఐకు తగ్గట్టుగా వడ్డీని కూడా కట్టాల్సి ఉంటుంది. పోస్ట్ పెయిడ్ ఫీచర్ అన్నది మూడు భాగాలుగా విభజించారు. లైట్, డిలైట్, ఎలైట్.. లైట్ ఫీచర్ ద్వారా 20000 రూపాయల లిమిట్ వరకు ఇస్తుంటే.. డిలైట్, ఎలైట్ ఫీచర్ ద్వారా లక్ష రూపాయల వరకూ అవకాశం ఉందని పేటీఎం తన స్టేట్మెంట్ లో చెప్పుకొచ్చింది. ఇది చదవండి: గూగుల్ పే వాడితే డబ్బులు గోవిందా...

ఆ సమయంలో యుపీఐ లావాదేవీలు చేయకండి..!
22-01-2021

ఆ టెక్నాలజీని కనుక్కుంటే 730కోట్లు ఇస్తానంటూ ఓపెన్ ఆఫర్ ఇచ్చిన ఎలాన్ మస్క్
22-01-2021

వాట్సప్ కు భారత్ వార్నింగ్
19-01-2021

ఫ్లిప్ కార్ట్ సూపర్ కాయిన్స్ ను ఇకపై అలా కూడా వాడుకోవచ్చట..!
18-01-2021

ఫేస్బుక్, ట్విట్టర్‌కు పార్లమెంటరీ ప్యానెల్ పిలుపు
18-01-2021

వాట్సాప్ యూటర్న్.. మే 15 వరకు కొత్త ప్రైవసీ విధానం లేదు
17-01-2021

వాట్సాప్.. వెనకడుగు వేయకతప్పలేదు
17-01-2021

వాట్సాప్ గోప్యత మార్పుతో సిగ్నల్, టెలిగ్రాం పంట పండినట్లే
15-01-2021

ఎయిర్ పోడ్స్ ఛార్జింగ్ కోసం సరికొత్త మొబైల్ కేస్ ను తీసుకుని రానున్న యాపిల్
14-01-2021

వాట్సాప్‌కు ప్రత్యామ్నాయంగా 21 బెస్ట్ యాప్‌లు
13-01-2021
ఇంకా