newssting
Radio
BITING NEWS :
ఇంద్రకీలాద్రిపై వైభవంగా జరుగుతున్న దసరా శరన్నవరాత్రోత్సవాలు. నాల్గవరోజు అన్నపూర్ణాదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిస్తోన్న దుర్గమ్మ. * పెచ్చులూడుతోన్న బెజవాడ కనకదుర్గా ఫ్లై ఓవర్. సోమవారం రాత్రి ఏపీఎస్పీ బెటాలియన్ కానిస్టేబుల్ రాంబాబుపై పడిన ఫ్లై ఓవర్ పెచ్చులు. తీవ్రగాయాలు కావడంతో రాంబాబును ఆస్పత్రికి తరలించిన సిబ్బంది. భారీ వర్షాల కారణంగానే ఇలా జరిగి ఉంటుందంటున్న అధికారులు. * తెలంగాణలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,486 కేసులు, ఏడుగురు మృతి. యాక్టివ్ గా ఉన్న 20,686 కేసులు. * తెలంగాణ ప్రయాణికులకు సర్కార్ శుభవార్త. దసరా సందర్భంగా ఈ నెల 24 వరకూ రాష్ట్రంలో వివిధ జిల్లాలకు 3000 స్పెషల్ బస్సులు. ఎంజీబీఎస్, జేబీఎస్, కూకట్‌పల్లి, ఎస్సార్ నగర్, అమీర్‌పేట, ఈసీఐఎల్, ఉప్పల్ క్రాస్ రోడ్డు, ఎల్బీనగర్ తదితర ప్రాంతాల నుంచి నడవనున్న స్పెషల్ బస్సులు. * మహబూబాబాద్ వీడియో జర్నలిస్ట్ కొడుకు కిడ్నాప్. రూ.45 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్న కిడ్నాపర్లు. పోలీసులకు ఫిర్యాదు చేసిన జర్నలిస్ట్. * ఏపీకి భారీ వర్షసూచన. నేడు కృష్ణా, గుంటూరు, తూ.గో., ప.గో జిల్లాలో భారీ వర్షాలు పడే అవకాశం.

పేటియం కేవైసీ.. అప్‌డేట్ అంటూ అడ్డంగా దోచేస్తారు..!

13-10-202013-10-2020 16:48:09 IST
2020-10-13T11:18:09.262Z13-10-2020 2020-10-13T11:18:05.716Z - - 21-10-2020

పేటియం కేవైసీ.. అప్‌డేట్ అంటూ అడ్డంగా దోచేస్తారు..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

పేటియం కేవైసీ అప్‌డేట్.. ఇలాంటి మెసేజీ యాప్ ను వాడుకునే వారికి వస్తూ ఉంటుంది. చాలా సింపుల్ ప్రాసెస్ ఇది. కానీ కొందరు మాత్రం దీన్ని మోసాలకు వాడుకుంటూ ఉన్నారు. అమాయకుల దగ్గర నుండి లక్షల్లో కొట్టేస్తూ ఉన్నారు. పేటీఎం కేవైసీ అప్‌డేట్ ‌ పేరుతో మోసాలకు పాల్పడుతున్న ఓ ముఠాను సైబరాబాద్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. పేటియం యాప్ అప్‌డేట్‌ పేరుతో డెబిట్ లేదా క్రెడిట్ కార్డుల నుంచి ఒక్క రూపాయి డిపాజిట్ చేయ్యాలని ఈ కేటుగాళ్లు కోరుతారట. ఆ తరవాత ఖాతా వివరాలను సేకరించి రిమోట్ యాక్సెస్‌తో లక్షల రూపాయలు కొట్టేస్తారు. ఇలా ఎంతో మంది నగరంలో అకౌంట్ లో నుండి డబ్బులను కోల్పోయారు. 

ఈ మోసాలకు సంబంధించిన ఫిర్యాదులు హైదరాబాద్ పోలీసులకు అందాయి.నిఘా వర్గాల ద్వారా విచారణ జరపగా మోసం బయటపడినట్లు సీపీ సజ్జనార్‌  వెల్లడించారు. హైదరాబాద్‌ నగరానికి చెందిన వినయ్ శర్మ అనే బాధితుడి నుంచి 4లక్షల 29 వేలు కొట్టేశారని నిందితులను మంగళవారం మీడియా ముందు ప్రవేశపెట్టారు. 

ఈ మోసాలకు మూలం జార్ఖండ్‌లోని జంతార జిల్లా.. అని తేల్చారు అధికారులు. అక్కడి నుండే ఈ మోసాలు జరుగుతున్నట్లు గుర్తించామని సజ్జనార్‌ వెల్లడించారు. జార్ఖండ్ చెందిన నంకు మండల్ అలియాస్ రాహుల్, రాజేష్ మండల్, శివశక్తి కుమార్ అలియాస్ అమిత్ బర్నల్, గౌరవ్ అరుణ్, దిల్ ఖుష్ కుమార్ సింగ్ లను అరెస్ట్ చేశామని తెలిపారు. నిందితుల నుంచి 1లక్ష 47 వేల నగదు మొబైల్ ఫోన్లు డెబిట్,క్రెడిట్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు.  పేటీఎం అప్‌డేట్‌ పేరుతో గుర్తుతెలియని వ్యక్తులు వ్యక్తిగత వివరాలను అడిగితే ఎవరికీ ఇవ్వొద్దని పోలీసులు సూచించారు.

నోకియా వైర్ లెస్ హెడ్ ఫోన్స్ వచ్చేశాయి.. ధర ఎంతంటే

నోకియా వైర్ లెస్ హెడ్ ఫోన్స్ వచ్చేశాయి.. ధర ఎంతంటే

   11 hours ago


4జీ తో రాబోతున్న నోకియా ఫోన్లు ఇవే.. ధర ఎంతంటే..!

4జీ తో రాబోతున్న నోకియా ఫోన్లు ఇవే.. ధర ఎంతంటే..!

   12 hours ago


నిజమే.. చంద్రుడిపై 4జీ నెట్వర్క్

నిజమే.. చంద్రుడిపై 4జీ నెట్వర్క్

   14 hours ago


 ఆండ్రాయిడ్ ఫోన్లలోకి వచ్చేసిన గూగుల్ అసిస్టెంట్ డ్రైవింగ్ మోడ్..!

ఆండ్రాయిడ్ ఫోన్లలోకి వచ్చేసిన గూగుల్ అసిస్టెంట్ డ్రైవింగ్ మోడ్..!

   19-10-2020


19 నిమిషాల్లో 4000 ఎంఏహెచ్ బ్యాటరీ ఫుల్.. షియోమీ వైర్ లెస్ ఛార్జింగ్

19 నిమిషాల్లో 4000 ఎంఏహెచ్ బ్యాటరీ ఫుల్.. షియోమీ వైర్ లెస్ ఛార్జింగ్

   19-10-2020


 మారుతి సుజుకి జిమ్ని.. రోడ్డు మీద సవారీ

మారుతి సుజుకి జిమ్ని.. రోడ్డు మీద సవారీ

   19-10-2020


2 వేల 500 కే బ్రాండెడ్ 5 జీ ‌స్మార్ట్ ఫోన్

2 వేల 500 కే బ్రాండెడ్ 5 జీ ‌స్మార్ట్ ఫోన్

   18-10-2020


మరోసారి మొబైల్ రంగంలో 'మైక్రోమ్యాక్స్' మెరుపులు చూస్తామా..?

మరోసారి మొబైల్ రంగంలో 'మైక్రోమ్యాక్స్' మెరుపులు చూస్తామా..?

   17-10-2020


అమెజాన్, ఫ్లిప్ కార్ట్ తప్పు చేశాయా..?

అమెజాన్, ఫ్లిప్ కార్ట్ తప్పు చేశాయా..?

   17-10-2020


అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ మొదలైంది.. భారీ ఆఫర్లు వాటి మీదనే..!

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ మొదలైంది.. భారీ ఆఫర్లు వాటి మీదనే..!

   17-10-2020


ఇంకా

Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle