newssting
Radio
BITING NEWS :
హైదరాబాద్ వాసులను వెంటాడుతున్న వరద భయం. రానున్న మూడ్రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం. ఏ క్షణాన వరద ముంచెత్తుతుందోనని కంటిమీద కునుకులేకుండా బిక్కుబిక్కుమంటూ గడుపుతున్న లోతట్టు ప్రాంతాల ప్రజలు. * హైదరాబాద్ ను ఆదుకునేందుకు కదిలిన టాలీవుడ్ తారాగణం. సీఎం రిలీఫ్ ఫండ్ కు చిరంజీవి, పవన్ కల్యాణ్, మహేష్ కోటి రూపాయల విరాళం. చెరో 50 లక్షలు ఇచ్చిన ఎన్టీఆర్, రామ్ చరణ్. * విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో ఘనంగా పోలీస్ సంస్మరణ దినోత్సవ వేడుకలు. కరోనాతో మృతి చెందిన పోలీసుల కుటుంబాలకు రూ.50 లక్షలు ఎక్స్ గ్రేషియా ప్రకటించిన సీఎం. పోలీసులకు వీక్లీ ఆఫ్ ఇచ్చిన ఏకైక ప్రభుత్వం వైసీపీనే అన్న మంత్రి సుచరిత. * ఏపీ - తెలంగాణ ప్రభుత్వాల మధ్య ఇంకా కుదరని ఆర్టీసీ ఒప్పందం. ప్రభుత్వాల మొండి వైఖరితో ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు. ఆర్టీసీ అలసత్వాన్ని క్యాష్ చేసుకుంటున్న ప్రైవేట్ ట్రావెల్స్. ఇష్టారాజ్యంగా ఛార్జీలు పెంచిన ప్రైవేట్ బస్సులు. ప్రతి ఏటా ఆర్టీసీకి లాభాలు తెచ్చిపెడుతున్న దసరా. * స్కందమాతగా దర్శనమిస్తోన్న బాసర సరస్వతీ దేవి. * పూర్తిగా నిండిన గండిపేట చెరువు. ఏ క్షణంలోనైనా గేట్లు ఎత్తి నీరు విడుదల చేసే అవకాశం. లోతట్టుప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసిన అధికారులు.

చైనాకు పాకిస్థాన్ కూడా షాక్ ఇచ్చిందండోయ్..!

10-10-202010-10-2020 13:15:59 IST
Updated On 10-10-2020 13:36:58 ISTUpdated On 10-10-20202020-10-10T07:45:59.339Z10-10-2020 2020-10-10T07:45:54.998Z - 2020-10-10T08:06:58.058Z - 10-10-2020

చైనాకు పాకిస్థాన్ కూడా షాక్ ఇచ్చిందండోయ్..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
రక్షణ పరంగా ఎన్నో సమస్యలు వస్తాయన్న ఉద్దేశ్యంతో భారత్ చైనాకు చెందిన పలు యాప్స్ ను బ్యాన్ చేసిన సంగతి తెలిసిందే..! దీంతో చైనాకు ఆర్థికపరంగా పెద్ద షాక్ ఇచ్చినట్లే..! అందరి మొబైల్స్ లోనూ చొచ్చుకుపోయిన టిక్ టాక్ ను కూడా భారత్ బ్యాన్ చేసేసింది. తాజాగా పాకిస్థాన్ కూడా చైనాకు ఊహించని షాక్ ఇచ్చింది. చైనాకు ఎప్పుడు చూసినా వెన్నుదన్నుగా ఉంటున్న పాక్ టిక్ టాక్ యాప్ విషయంలో షాకింగ్ నిర్ణయాన్ని తీసుకుంది. పాకిస్థాన్ కు ఎన్నో సహాయాలు చేస్తూ వచ్చిన చైనా.. పాక్ ఇలా షాక్ ఇస్తుందని ఊహించలేదు. వెన్నుపోటుకు కేరాఫ్ అడ్రెస్ ఏ దేశమంటే పాకిస్థాన్ అనే అంటారు.. అలాంటిది చైనాకు పాక్ ఇలా యాప్ బ్యాన్ చేసి వెన్నుపోటు రుచి చూపించింది.  

మిత్రదేశమైన చైనాకు పాక్ షాకిచ్చింది. చైనాకు చెందిన టిక్ టాక్ యాప్ కార్యకలాపాలను తమ దేశంలో రద్దు చేసింది. చట్టవ్యతిరేకమైన ఆన్ లైన్ కంటెంట్ విస్తృతస్థాయిలో వ్యాప్తి చెందకుండా నిరోధించడంలో టిక్ టాక్ విఫలమైందంటూ పాకిస్థాన్ టెలికమ్యూనికేషన్ అథారిటీ (పీటీఏ) స్పష్టం చేసింది. టిక్ టాక్ ను బ్యాన్ చేస్తూ ఉన్నామంటూ అధికారిక ప్రకటనను ఇచ్చింది.

టిక్ టాక్ యాప్ లో అనైతిక, అసభ్య కంటెంట్ ఉందంటూ వివిధ రంగాల నుంచి వచ్చిన అసంఖ్యాక ఫిర్యాదుల నేపథ్యంలోనే పీటీఏ ఈ కఠిన నిర్ణయం తీసుకుంది. టిక్ టాక్ లో అశ్లీలత ఉంటోందన్న కోణంలో ఫిర్యాదులు వస్తూనే ఉన్నాయని, దాంతో టిక్ టాక్ కు ఆఖరిగా నోటీసులు పంపించామని పీటీఏ వివరించింది. తమ నోటీసులపై స్పందించేందుకు తగిన సమయం కూడా ఇచ్చామని పేర్కొంది.

టిక్ టాక్ మాత్రం తమ నిబంధనావళిని సంతృప్తి పరిచేలా వ్యవహరించలేకపోయిందని, అందుకే ఆ యాప్ కార్యకలాపాలను అడ్డుకుంటున్నామని పీటీఏ తెలిపింది. ఇప్పటికే టిక్ టాక్ పై భారత్, అమెరికా నిషేధం విధించాయి. ఈ వరుసలో పాక్ కూడా చేరింది. భారత్, అమెరికా దేశాలకు చైనా తీరు నచ్చకపోవడం కూడా ఇలా యాప్స్ బ్యాన్ కు కారణమైంది. ఇప్పుడు పాక్ కూడా అదే తరహాలో నిర్ణయం తీసుకోవడంతో చైనా షాక్ తింది. 


Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle