newssting
Radio
BITING NEWS :
కర్ణాటక ముఖ్యమంత్రి మార్పుపై సస్పెన్స్‌కు తెరపడింది. బీఎస్‌ యడియూరప్ప సోమవారం ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఈ సాయంత్రం గవర్నర్‌ను కలిసి రాజీనామాను సమర్పించనున్నారు. రాజీనామాపై ఆయన స్పందిస్తూ.. ‘‘ రాజకీయ జీవితంలో ఎన్నో అగ్నిపరీక్షలు ఎదుర్కొన్నా. కర్ణాటక అభివృద్ధి కోసం చాలా చేశా. 75 ఏళ్లు దాటినా నాకు రెండేళ్ల పాటు అవకాశం ఇచ్చారు. అధిష్టానం నిర్ణయాన్ని గౌరవిస్తా’’ అని అన్నారు. * ఆంధ్ర ప్రదేశ్ వ్యాప్తంగా కరోనా వైరస్‌ వ్యాక్సినేషన్ ప్రత్యేక డ్రైవ్‌లో భాగంగా సోమవారం 2,128 కోవిడ్‌ టీకా కేంద్రాల్లో వ్యాక్సినేషన్‌ అందిస్తున్నారు. ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 15 లక్షల కోవిడ్‌ వ్యాక్సిన్‌లు అందుబాటులో ఉన్నట్లు అధికారులు తెలిపారు. * చరిత్రలోనే మొట్టమొదటిసారి మన తెలుగు సంపద అయిన తెలంగాణ రాష్ట్రానికి చెందిన రామప్ప ఆలయానికి ఐక్యరాజ్య సమితి విద్య, విజ్ఞాన (పరిశోధన), సాంస్కృతిక సంస్థ (యునెస్కో) ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది. రామప్పకు ప్రపంచ వారసత్వ హోదా కోసం 2015లోనే ప్రయత్నాలు మొదలయ్యాయి. * టోక్యో ఒలింపిక్స్‌లో జపాన్‌కి చెందిన మోమిజీ నిషియా సంచలనం సృష్టంచింది. ఒలింపిక్స్‌లో గోల్డ్‌ మెడల్‌ సాధించిన రెండో అతి పిన్న వయస్కురాలిగా రికార్డు క్రియాట్‌ చేసింది. టోక్యో ఒలింపిక్స్‌లో కొత్తగా ప్రవేశపెట్టిన స్కేట్‌బోర్డింగ్ లో నిషియా స్వర్ణ పతకం సాధించింది. * ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్‌ తనయుడు ఆకాశ్‌ పూరి హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘చోర్‌ బజార్‌’’. ‘దళం, జార్జ్‌ రెడ్డి’ చిత్రాల ఫేమ్‌ జీవన్‌ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. గెహనా సిప్పీ హీరోయిన్‌గా నటిస్తున్నారు.

థియేటర్లు లేవు.. మళ్లీ ఓటీటీలదే రాజ్యం

22-04-202122-04-2021 16:50:11 IST
Updated On 22-04-2021 16:10:31 ISTUpdated On 22-04-20212021-04-22T11:20:11.593Z22-04-2021 2021-04-22T10:33:32.376Z - 2021-04-22T10:40:31.794Z - 22-04-2021

థియేటర్లు లేవు.. మళ్లీ ఓటీటీలదే రాజ్యం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఇది వరకు ఎప్పుడో బంద్ లు చేసినప్పుడు సినిమా థియేటర్లు మూసివేసేవారు. అదీ ఒకరోజు లేదా రెండు రోజులు తప్పితే ఒక వారం. తుఫాన్ వచ్చినా, వరదలు వచ్చిన థియేటర్లు మూతపడిన దాఖలాలే లేవు. ఇక థియేటర్లకు పోటీగా ఓటీటీలు వస్తే సినీ పరిశ్రమకు వచ్చే ఆదాయానికి గండి కొడుతున్నారు అంటూ థియేటర్ల వాళ్ళతో కలిసి ప్రొడ్యూసర్లు కూడా పెద్ద గొడవే చేసారు. 2020లో 6 నెలలు థియేటర్లు మూతపడ్డాయి. సినీ కార్మికులు, జూనియర్ ఆర్టిస్టులు, సినీ పరిశ్రమ మొత్తం అతలా కుతలం ఐపోయింది. అప్పులు చేసి డబ్బులు పెట్టి సినిమాలు తీసిన ప్రొడ్యూసర్లు సినిమాలు విడుదల చేసే అవకాశం లేక బిక్కు బిక్కు మంటూ చూసే రోజులలో మొత్తం సినీ పరిశ్రమను ఆదుకున్నది ఓటీటీ ఫ్లాట్ ఫామ్. మొత్తం ఆ ఆరు నెలలు ఆగిపోయిన సినిమాలను ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లు నిర్మాతలకు నష్టం రాకుండా డబ్బులు పెట్టి కొనుక్కుని ఓటీటీలో రిలీజ్ చేసుకున్నాయి.  

కొన్ని నెలల క్రితం థియేటర్లు తెరుచుకోవడంతో ఓటీటీ ఫ్లాట్ ఫామ్ల స్పీడ్ కొంచెం తగ్గింది. మళ్ళీ షూటింగులు మొదలు అయ్యాయి. కొన్ని సినిమాలు థియేటర్లలో రిలీజ్ అయ్యాయి. మొదట సగం థియేటర్ జనం మాత్రమే అని ఆంక్షలు పెట్టినా చివరికి ఆ ఆంక్షలన్నీ సడలిపోయాయి. సినిమా థియేటర్లు హౌసుఫుల్ బోర్డులతో కళకళలాడాయి. అవి చూసి పెద్ద పెద్ద సినిమాలు సైతం షూటింగులు మొదలెట్టేసారు. కానీ  కరోనా సెకండ్ వేవ్ కారణంగా మళ్ళీ థియేటర్లు మూయవలసిన పరిస్థితి వచ్చింది. ఇండియా మొత్తంగా రోజుకు 3 లక్షల పైనే కేసులు నమోదు అవుతుండడంతో థియేటర్లు, త్వరలోనే షూటింగులు ఆపవలసిన పరిస్థితి వచ్చేలా కనిపిస్తుంది. 

ఇక మళ్ళీ సినీ పరిశ్రమకి ఓటీటీల అవసరం వచ్చిందనే చెప్పుకోవచ్చు. డైరెక్ట్ గా చెప్పాలంటే ఇంక ఓటీటీలదే రాజ్యం. హాట్‌స్టార్, అమెజాన్, నెట్ ఫ్లిక్స్ లతో పాటూ జీ5, జియో, ఆహా వంటి మరిన్ని ఫ్లాట్ ఫామ్స్ కి ఇక పండగే. జనాలు నెమ్మదిగా ఓటీటీలకు అలవాటు పడిపోతున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే థియేటర్లకు జనం రావడం కష్టమే, హౌస్ ఫుల్ బోర్డులు పెట్టడం ఇంకా కష్టమే అవుతుంది. ఎప్పటికే పెద్ద పెద్ద సినిమాలు కూడా వారం, పదిరోజులు ఆడే పరిస్థితి వచ్చేసింది. 

JioFiber: కస్టమర్లకు జియో గుడ్ న్యూస్.. కేవలం 199 రూపాయలకే 1000జీబీ డేటా..!

JioFiber: కస్టమర్లకు జియో గుడ్ న్యూస్.. కేవలం 199 రూపాయలకే 1000జీబీ డేటా..!

   22-07-2021


వాట్సాప్ 2 మిలియన్ భారతీయ ఖాతాలను నిషేధించింది, నెటిజన్లు మీమ్స్ తో స్పందిస్తున్నారు

వాట్సాప్ 2 మిలియన్ భారతీయ ఖాతాలను నిషేధించింది, నెటిజన్లు మీమ్స్ తో స్పందిస్తున్నారు

   17-07-2021


ఓలాకి ఇంత డిమాండా.. ఊహించలేకపోయిన కంపెనీ.. బ్లాక్ అయిన వెబ్ సైట్

ఓలాకి ఇంత డిమాండా.. ఊహించలేకపోయిన కంపెనీ.. బ్లాక్ అయిన వెబ్ సైట్

   16-07-2021


డిజిటల్ ఫ్లాట్ ఫామ్ కాపాడటానికి కొత్త ఐటి నియమాలు: కేంద్రం

డిజిటల్ ఫ్లాట్ ఫామ్ కాపాడటానికి కొత్త ఐటి నియమాలు: కేంద్రం

   13-07-2021


అమెజాన్ వెబ్సైట్ లో అంతరాయం.. తీవ్రంగా ఇబ్బంది పడ్డ కస్టమర్లు

అమెజాన్ వెబ్సైట్ లో అంతరాయం.. తీవ్రంగా ఇబ్బంది పడ్డ కస్టమర్లు

   12-07-2021


అంతరిక్షంలోకి మన తెలుగమ్మాయి..

అంతరిక్షంలోకి మన తెలుగమ్మాయి..

   11-07-2021


ఈ బజాజ్ స్కూటర్, ఇంకా మార్కెట్ లోకి రానేలేదు అయినా..

ఈ బజాజ్ స్కూటర్, ఇంకా మార్కెట్ లోకి రానేలేదు అయినా..

   11-07-2021


రూ. 10 వేలకే రియల్‌ మీ 5 జీ మొబైల్స్

రూ. 10 వేలకే రియల్‌ మీ 5 జీ మొబైల్స్

   07-07-2021


అమెజాన్‌ సీఈవో జెఫ్‌ బేజోస్‌ రాజీనామా.. ఆయన స్థానంలో ఆండీ జస్సీ

అమెజాన్‌ సీఈవో జెఫ్‌ బేజోస్‌ రాజీనామా.. ఆయన స్థానంలో ఆండీ జస్సీ

   05-07-2021


సోషల్ మీడియా డే 2021: చరిత్ర మరియు ప్రాముఖ్యతను తెలుసుకోండి

సోషల్ మీడియా డే 2021: చరిత్ర మరియు ప్రాముఖ్యతను తెలుసుకోండి

   30-06-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle