newssting
Radio
BITING NEWS :
అమెరికాలోని కుంబా ప్రాంతంలో తుపాకులతో దాడులు. పాఠశాలపై దాడులకు పాల్పడిన దుండగులు. 8 మంది చిన్నారులు దుర్మరణం. ఇంతవరకూ దాడికి గల కారణాలపై నో క్లారిటీ. వేర్పాటువాదుల పనైఉంటుందని అనుమానిస్తున్న పోలీసులు. * ఇంద్రకీలాద్రిపై ఘనంగా దసరా ఉత్సవాలు. ఆఖరిరోజు శ్రీ రాజరాజేశ్వరీ దేవి అలంకరణలో దర్శనమిస్తున్న దుర్గమ్మవారు. అమ్మవారి దర్శనం కోసం బారులు తీరిన భక్తులు. * దుర్గమ్మను దర్శించుకున్న కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. దసరా సందర్భంగా విజయవాడలో బీజేపీ కార్యాలయాన్ని ప్రారంభించిన కిషన్ రెడ్డి. రాష్ట్రంలో బీజేపీ బలపడుతుందన్న కేంద్ర మంత్రి. * రానున్న 4 రోజుల్లో ఏపీకి భారీ వర్షాలు. * సికింద్రాబాద్ ముత్యాలమ్మ ఆలయం వద్ద పేలుడు. ఆలయం సమీపంలోని చెత్తకుప్పలో పేలిన పెయింట్ డబ్బా, వ్యక్తికి గాయాలు. * వనపర్తి జిల్లా గోపాల్ పేట మండలం బుద్దారం గ్రామంలో విషాదం. భారీ వర్షాలకు నానిపోయిన ఇంటి పై కప్పు కూలి ఐదుగురు దుర్మరణం, ఇద్దరికి తీవ్రగాయాలు. * తెలంగాణ రాష్ట్ర ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్.

వన్ ప్లస్ నార్డ్ సిరీస్ లో మరో కొత్త ఫోన్

29-09-202029-09-2020 12:08:35 IST
Updated On 29-09-2020 12:24:46 ISTUpdated On 29-09-20202020-09-29T06:38:35.196Z29-09-2020 2020-09-29T06:38:31.339Z - 2020-09-29T06:54:46.233Z - 29-09-2020

వన్ ప్లస్ నార్డ్ సిరీస్ లో మరో కొత్త ఫోన్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

వన్ ప్లస్ నార్డ్ సిరీస్ లో మరో కొత్త మొబైల్ ఫోన్ రానుంది. వన్ ప్లస్ సంస్థ ఇప్పటికే నార్డ్ సిరీస్ లో భాగంగా మరో మొబైల్ ఫోన్ రాబోతోందని ఇంస్టాగ్రామ్ ద్వారా వెల్లడించింది. రెండు నెలల కిందట వన్ ప్లస్ నార్డ్ సిరీస్ ను లాంఛ్ చేశారు.. ఆ సమయంలోనే నార్డ్ సిరీస్ లో భాగంగా మరిన్ని మొబైల్ ఫోన్స్ రానున్నాయని స్పష్టమైంది. తాజాగా సరికొత్త నార్డ్ సిరీస్ లో రాబోయే మొబైల్ ఫోన్ కు సంబంధించిన టీజర్ ను వన్ ప్లస్ సంస్థ విడుదల చేసింది. కొత్త టీజర్ ద్వారా వన్ ప్లస్ నార్డ్ కొత్త మొబైల్ కోసం ఎక్కువ రోజులు ఎదురు చూడాల్సిన అవసరం కూడా లేదు. వన్ ప్లస్ నార్డ్ ఎన్10 5జీ ఫోన్ ఇటీవలే లీక్ అయింది. కంపెనీ కూడా అదే స్మార్ట్ ఫోన్ ను తీసుకుని వచ్చేందుకు సన్నాహాలను మొదలు పెట్టింది.  

వన్ ప్లస్ సంస్థ తమ ఇంస్టాగ్రామ్ లో నార్డ్ సిరీస్ లో భాగంగా ఇంకో మొబైల్ ఫోన్ రాబోతోందని హింట్ ఇచ్చింది. ఆ టీజర్ లో ఫోన్ కు సంబంధించిన ఎటువంటి ఫోటోలను చూపించలేదు కానీ.. మొబైల్ ఫోన్ స్కెచ్ ను.. వన్ ప్లస్ లోగోను అందులో ఉంచింది. ఇంకొద్ది రోజుల్లో ఈ మొబైల్ కు సంబంధించిన మరింత సమాచారాన్ని వినియోగదారులతో పంచుకోనుంది వన్ ప్లస్ సంస్థ.  

వన్ ప్లస్ నార్డ్ ఎన్10 స్పెసిఫికేషన్స్: 

వన్ ప్లస్ నార్డ్ ఎన్10 మొబైల్ లో 5జీ ఫీచర్ ఉంది. 6.49 ఇంచీల ఫుల్ హెచ్.డి. ప్లస్ డిస్ప్లే ఉండనుంది. 90hz  రీఫ్రెష్ రేట్ ఈ మొబైల్ సొంతమని చెబుతూ ఉన్నారు. స్నాప్ డ్రాగన్ 690 ఎస్ఓసి తో పాటూ 6జీబీ ర్యామ్ ఉండవచ్చని చెబుతూ ఉన్నారు. 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీని కూడా ఎక్స్ పెక్ట్ చేయొచ్చు. వన్ ప్లస్ నార్డ్ ఎన్10 లో క్వార్డ్ కెమెరా సెటప్ ఉండవచ్చు. అలాగే 64 మెగా పిక్సెల్ మెయిన్ కెమెరా.. 8 మెగా పిక్సెల్ వైడ్ యాంగిల్ షూటర్.. 2 మెగా పిక్సెల్ షూటర్ కెమెరాలు వుండవచ్చ. 30000 రూపాయలకు దగ్గరగా ఫోన్ ధర ఉండవచ్చునని చెబుతూ ఉన్నారు.   


Shivakrishna D


Senior Video Editor, Shivakrishna Devasani has been working with major media houses for the last decade and half. He has been chosen as a special editor for senior journalist Satish Babu's signature program- 'Journalist Diary'. He specialises with feature programmes on current affairs and politics. Over the years, he has trained many budding video editors with many of them working now in electronic media.
 skd@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle