newssting
Radio
BITING NEWS :
భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు. 200 పాయింట్లకు పైగా నష్టపోయి 14,883 వద్ద ట్రేడ్ అవుతున్న నిఫ్టీ. * కరోనా విజృంభణ నేపథ్యంలో మహారాష్ట్ర - ఛత్తీస్ ఘడ్ సరిహద్దులో హై అలర్ట్. తెలంగాణ సరిహద్దుల్లో కరోనా నియంత్రణకు కఠిన నిబంధనలు అమలు. ములుగు జిల్లాకు వచ్చే వలస కూలీల విషయంలో అప్రమత్తమైన అధికారులు. పని ప్రదేశాల్లో మాస్క్ లేని కూలీలకు నో ఎంట్రీ. * ఎస్వీబీసీ ట్రస్ట్ కు భారీ విరాళం. రూ.9 కోట్ల విరాళం ఇచ్చిన పోస్కో గ్రూప్ అధినేత సంజయ్ పస్సి. టీటీడీ అడిషనల్ ఈఓ ధర్మారెడ్డికి డీడీ అందజేత. * జూబ్లీహిల్స్ లో ట్రాఫిక్ పోలీసులపై యువకుడి దాడి. అధిక శబ్దం చేస్తూ వెళ్తున్న బైక్ ను అడ్డుకున్న పోలీసులు. బైక్ ను ఆపినందుకు స్నేహితులతో కలిసి ట్రాఫిక్ సీఐ ముత్తు, సిబ్బందిపై దాడి. నిందితుడు దర్వేజ్ సహా ముగ్గురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. * మాదాపూర్ కు చెందిన వ్యాపారిని కిడ్నాప్. చెన్నైకి చెందిన ఆర్టిస్టులు అమర్నాథ్ ను కిడ్నాప్ చేసినట్లు సమాచారం. కిడ్నాప్ అనంతరం అమర్నాథ్ భార్యకు ఫోన్ చేసి రూ.4 లక్షలు డిమాండ్ చేసిన కిడ్నాపర్లు. అనంతరం 80 ఫోన్ కాల్స్ చేసిన గ్యాంగ్. చెన్నైకి చెందిన ఆర్టిస్టులు అరెస్ట్. * ఏపీలో రేపట్నుంచి ఎస్ఈసీ నిమ్మగడ్డ పర్యటన. మున్సిపల్ ఎన్నికలపై సమీక్ష నిర్వహించనున్న నిమ్మగడ్డ.

కేఆర్ఐడిఎన్ బైక్.. టాప్ స్పీడ్ 95 కిలోమీటర్లు

28-12-202028-12-2020 17:36:05 IST
2020-12-28T12:06:05.165Z28-12-2020 2020-12-28T12:06:00.230Z - - 27-02-2021

కేఆర్ఐడిఎన్ బైక్.. టాప్ స్పీడ్ 95 కిలోమీటర్లు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

వాతావరణ కాలుష్యాన్ని తగ్గించాలంటే ఎలెక్ట్రిక్ వాహనాలను తప్పకుండా వాడాల్సి ఉంటుంది. రాబోయే కాలంలో ప్రభుత్వాలే డీజిల్, పెట్రోల్ వాహనాలను బంద్ చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎన్నో కంపెనీలు ప్రస్తుతం ఎలెక్ట్రిక్ వాహనాల ఉత్పత్తిలో బిజీగా ఉన్నాయి. ఇప్పటికే 'టెస్లా' కంపెనీ సృష్టిస్తున్న సంచలనాల గురించి ప్రపంచం మొత్తం మాట్లాడుకుంటూ ఉంది. మరిన్ని ప్రముఖ కంపెనీలు కూడా ఎలెక్ట్రిక్ వాహనాలను తీసుకుని వచ్చాయి. 

ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన స్టార్టప్ కంపెనీ అయిన వన్ ఎలక్ట్రిక్ తన 'కేఆర్ఐడిఎన్' ఎలక్ట్రిక్ మోటారు సైకిల్ లను మార్కెట్ లోకి తీసుకొచ్చింది. ప్రస్తుతం హైదరాబాద్, బెంగళూరులో డెలివరీలను ప్రారంభించారు. 2021 జనవరి చివరి నాటికి తమిళనాడు, కేరళలో ఎలక్ట్రిక్ వెహికల్ ని అందుబాటులోకి తీసుకుని రావడానికి ప్రయత్నిస్తోంది. ఈ బైక్ కేవలం 8 సెకన్లలో 0 నుండి 60 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుందని సంస్థ చెబుతోంది.  ఈ బైక్ టాప్ స్పీడ్ 95 కెఎంపిహెచ్. ఈ ఎలక్ట్రిక్ మోటారు సైకిల్ ను ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే ఎకో మోడ్‌లో 110 కిలోమీటర్లు, సాధారణ మోడ్‌లో 80 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చు.  మోటారు సైకిల్‌కు డిజిటల్ ఓడోమీటర్‌తో పాటు జి‌పి‌ఎస్, బ్లూటూత్ కనెక్టివిటీ ఉంది. 5.5 కిలోవాట్ లేదా 7.4 బీహెచ్ పీతో వస్తుంది. 

80/100 17 అంగుళాల ట్యూబ్ లెస్ ఫ్రంట్ వీల్, 120/80 16 అంగుళాల ట్యూబ్ లెస్ రియర్ వీల్ ఉండనుంది. ఈ బైక్ 240 మిమీ డిస్క్, వెనుకవైపు 220 ఎంఎం డిస్క్ తో పాటు కంబైన్డ్ బ్రేకింగ్ సిస్టం కూడా ఉంది. ఫ్రంట్ లో బైక్ టెలిస్కోపిక్ ఫోర్క్స్ , వెనుక భాగంలో డ్యూయల్ షాక్ అబ్జార్బర్స్ ఉన్నాయి. 

మహారాష్ట్ర, ఢిల్లీ లో డెలివరీల కోసం సంస్థ ప్రయత్నాలు చేస్తోంది. ఈ మోటారు సైకిల్ ధర1.29 లక్షలు(ఎక్స్-షోరూమ్). సంస్కృతంలో కేఆర్ఐడిఎన్ అంటే 'ఆడటం' అని అర్థం. ఎలెక్ట్రిక్ బైక్ లను కొనాలి అనుకుంటున్న వాళ్లకు ఈ బైక్ మంచి ఆప్షన్ అని ఆటో మొబైల్ నిపుణులు చెబుతూ ఉన్నారు. 


Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle