newssting
Radio
BITING NEWS :
రెండ్రోజుల్లో రామతీర్థానికి రానున్న విగ్రహాలు. టీటీడీ ఆధ్వర్యంలో సుందరంగా తయారవుతున్న విగ్రహాలు. * చెన్నైలోని క్రైస్తవ ప్రచారకుడి ఇంటిపై ఐటీ దాడులు. పాల్ దినకరన్ ఇళ్లు, ఆఫీసుల్లో సోదాలు చేస్తున్న అధికారులు. చెన్నై కోయంబత్తూర్ సహా 28 చోట్ల ఐటీ అధికారుల తనిఖీలు. * అమెరికా అధ్యక్షుడి స్థానంలో చివరిసారిగా ప్రసంగించిన ట్రంప్. రాజకీయ హింసను అమెరికా విలువలపై జరిగిన దాడిగా చూడాలన్న ట్రంప్. ప్రజలకు చెప్పిన దానికన్నా ఎక్కువే చేశానని పేర్కొన్న ట్రంప్. * అమెరికా 46వ అధ్యక్షుడిగా నేడు జో బైడెన్ ప్రమాణ స్వీకారం. ఉపాధ్యక్షురాలిగా అచ్చమైన భారతీయ వనితగా ప్రమాణ స్వీకారం చేయనున్న కమలా హారిస్. * అమరావతి ఉద్యమం చేపట్టి 400 రోజులు అయిన సందర్భంగా గొల్లపూడిలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద దీక్షకు సిద్ధమైన దేవినేని ఉమా. గొల్లపూడిలో సభలు, దీక్షలకు అనుమతి లేదన్న పోలీసులు. * అయోధ్య రామమందిర నిర్మాణం కోసం నేటి నుంచి ఫిబ్రవరి 10 వరకూ విరాళాల సేకరణ. విరాళాల సేకరణ కోసం మిగతా కార్యక్రమాలన్నింటినీ వాయిదా వేసుకున్న బీజేపీ నేతలు. బోరబండ నుంచి విరాళాల సేకరణ ప్రారంభించిన బండి సంజయ్.

ఓలా.. టెక్నాలజీలో ముందుకు అలా..!

23-12-202023-12-2020 19:24:02 IST
Updated On 24-12-2020 11:15:13 ISTUpdated On 24-12-20202020-12-23T13:54:02.644Z23-12-2020 2020-12-23T13:52:09.041Z - 2020-12-24T05:45:13.679Z - 24-12-2020

ఓలా.. టెక్నాలజీలో ముందుకు అలా..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
టెక్నాలజీ పరంగా ఎంతగానో దూసుకుని వెళుతున్న ఈ ప్రపంచంలో త్వరలోనే ఎలక్ట్రిక్ వాహనాల విషయంలో సరైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే చాలా దేశాల్లో ఎలెక్రిక్ వాహనాలు రోడ్ల మీద సందడి చేస్తూ ఉన్నాయి. ఈ ఎలెక్ట్రిక్ వాహనాలకు ముఖ్యమైన సమస్య ఏమిటంటే పెట్రోల్ బంకుల లాగా.. ఛార్జింగ్ పాయింట్లు లేకుండా ఉండడం. చాలా దేశాల్లో ఛార్జింగ్ పాయింట్ల ఏర్పాట్ల కోసం ప్రయత్నాలను మొదలుపెట్టేస్తూ ఉన్నారు. పలు కంపెనీలు ఛార్జింగ్ పాయింట్లను తీసుకుని వచ్చే విధంగా ఏర్పాట్లు చేస్తూ ఉన్నాయి. ఎలెక్ట్రిక్ వాహనాలు పెరిగే కొద్దీ ఛార్జింగ్ స్టేషన్ల సంఖ్య కూడా ఎక్కువగా పెరగాల్సి ఉంది.

రాబోయే కాలంలో పెట్రోల్, డీజిల్ కార్లు రోడ్ల మీద కనిపించే అవకాశాలు చాలా తక్కువే..! పర్యావరణానికి హాని చేయని ఎలెక్ట్రిక్ వాహనాల కోసం చార్జింగ్‌ స్టేషన్లను ఏర్పాటు చేయాలని ఇప్పటికే చాలా దేశాలు ప్రయత్నాలను ముమ్మరం చేశాయి. అందుకు సంబంధించి పలు కంపెనీలు పనిలో నిమగ్నమయ్యాయి. ఈ పనుల్లో ఓలా కంపెనీ కూడా దూసుకుపోతోంది. ఓలా మెట్రో నగరాల్లో ఎంతో మందిని గమ్యస్థానాలకు చేరుస్తూ ఉండగా.. ఇప్పుడు ఎలక్ట్రిక్‌ టూ వీలర్స్‌ కోసం ఛార్జింగ్‌ స్టేషన్ల విషయంలో కూడా కీలక చర్యలను తీసుకోనుంది.   

భారతదేశంలో దేశవ్యాప్తంగా 50 నగరాల్లో ఎలక్ట్రిక్‌ టూ వీలర్స్‌ కోసం ఛార్జింగ్‌ స్టేషన్లను ఏర్పాటు చేయాలని అలా ప్రణాళికలను రూపొందిస్తోంది. ఎలక్ట్రిక్‌ స్కూటర్ల తయారీ ప్లాంటు స్థాపించేందుకు ఇటీవలే తమిళనాడు ప్రభుత్వంతో ఓలా ఒప్పందం కుదుర్చుకుంది. ఏడాది సమయంలో ప్లాంటు తయారుకానుంది. ఈ కేంద్రం కోసం సంస్థ రూ.2,400 కోట్లు పెట్టుబడి పెడుతోంది. ఈ ఫ్యాక్టరీ అందుబాటులోకి వస్తే 10,000 మందికి ఉద్యోగాలు రానున్నాయి. ఎలెక్ట్రిక్ స్కూటర్ల తయారీలో ప్రపంచంలో ఇదే అతిపెద్ద కేంద్రంగా నిలవనుంది. ఏటా 20 లక్షల యూనిట్ల సామర్థ్యంతో  ప్లాంట్ లో పనులను పూర్తీ చేయనున్నారు.

ఎలెక్ట్రిక్ విమానాన్ని తీసుకుని వస్తోన్న రోల్స్ రాయిస్

యూరప్, ఆసియా, లాటిన్‌ అమెరికా దేశాలకు తమిళనాడు నుంచి స్కూటర్లను ఎగుమతి చేస్తారు. ఎలక్ట్రిక్‌ వాహన రంగంలో ఇంజనీరింగ్, డిజైన్‌ సామర్థ్యాలను పెంచుకోవడం కోసం అమ్‌స్టర్‌డ్యామ్‌కు చెందిన ఇటెర్గో బీవీ అనే కంపెనీని ఓలా ఎలక్ట్రిక్‌ ఈ ఏడాది మే నెలలో కొనుగోలు చేసింది. ఎలక్ట్రిక్‌ విభాగం కోసం 2,000 మందిని నియమించుకోనున్నట్టు కంపెనీ ప్రకటించింది. ఎలెక్ట్రిక్ వాహనాలు వినియోగంలోకి వస్తే ఛార్జింగ్ పాయింట్లు ఎక్కడ అన్నది కూడా భారత్ లో పెద్ద ప్రశ్నగా మారింది. అందుకోసమే ఛార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేయడంలో పలు కంపెనీలు నిమగ్నమయ్యాయి. యూరప్‌లోనూ ఇటువంటి నెట్‌వర్క్ కోసం కావాల్సిన స్థలం కోసం వెతుకుతోంది ఓలా సంస్థ.  

వాట్సప్ కు భారత్ వార్నింగ్

వాట్సప్ కు భారత్ వార్నింగ్

   16 hours ago


ఫ్లిప్ కార్ట్ సూపర్ కాయిన్స్ ను ఇకపై అలా కూడా వాడుకోవచ్చట..!

ఫ్లిప్ కార్ట్ సూపర్ కాయిన్స్ ను ఇకపై అలా కూడా వాడుకోవచ్చట..!

   18-01-2021


ఫేస్‌బుక్, ట్విట్టర్‌కు పార్లమెంటరీ ప్యానెల్ పిలుపు

ఫేస్‌బుక్, ట్విట్టర్‌కు పార్లమెంటరీ ప్యానెల్ పిలుపు

   18-01-2021


వాట్సాప్ యూటర్న్.. మే 15 వరకు కొత్త ప్రైవసీ విధానం లేదు

వాట్సాప్ యూటర్న్.. మే 15 వరకు కొత్త ప్రైవసీ విధానం లేదు

   17-01-2021


వాట్సాప్.. వెనకడుగు వేయకతప్పలేదు

వాట్సాప్.. వెనకడుగు వేయకతప్పలేదు

   17-01-2021


వాట్సాప్ గోప్యత మార్పుతో సిగ్నల్, టెలిగ్రాం పంట పండినట్లే

వాట్సాప్ గోప్యత మార్పుతో సిగ్నల్, టెలిగ్రాం పంట పండినట్లే

   15-01-2021


ఎయిర్ పోడ్స్ ఛార్జింగ్ కోసం సరికొత్త మొబైల్ కేస్ ను తీసుకుని రానున్న యాపిల్

ఎయిర్ పోడ్స్ ఛార్జింగ్ కోసం సరికొత్త మొబైల్ కేస్ ను తీసుకుని రానున్న యాపిల్

   14-01-2021


వాట్సాప్‌కు ప్రత్యామ్నాయంగా 21 బెస్ట్ యాప్‌లు

వాట్సాప్‌కు ప్రత్యామ్నాయంగా 21 బెస్ట్ యాప్‌లు

   13-01-2021


యూట్యూబ్ నుంచి కూడా ట్రంప్ ఔట్

యూట్యూబ్ నుంచి కూడా ట్రంప్ ఔట్

   13-01-2021


ప్రాణం పోవడానికి కారణం అయిన గూగుల్ మ్యాప్స్..?

ప్రాణం పోవడానికి కారణం అయిన గూగుల్ మ్యాప్స్..?

   13-01-2021


ఇంకా

Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle