newssting
Radio
BITING NEWS :
ఏలూరు మాజీ ఎంపి మాగంటి బాబు కుమారుడు ఆత్మహత్యాయత్నం. అర్థరాత్రి విజయవాడ ఆంధ్రా ఆస్పత్రికి తరలింపు. ఐసీయూలో వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్న వైద్యులు. బ్రెయిన్ స్ట్రోక్ తో ఆస్పత్రిలో చేర్పించామని చెప్తున్న కుటుంబ సభ్యులు. 24 గంటలు గడిస్తే గానీ ఏమీ చెప్పలేమన్న వైద్యులు. * ఏపీ మునిసిపల్ ఎన్నికల్లో అత్యధిక ఏకగ్రీవాలు చేసిన వైసీపీ. వైసీపీ -570, టీడీపీ -5, బీజేపీ -1, ఇతరులు -2 ఏకగ్రీవాలు. * విశాఖలో కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం. విజయవాడ నుంచి విశాఖకు తరలనున్న కమాండ్ కంట్రోల్ రూమ్. విశాఖలోని ప్రభుత్వ భూమిలో కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు. * నెల్లూరు జాయింట్ కలెక్టర్ కార్యాలయ సిబ్బందిపై కేసు నమోదు. పదోన్నతి కల్పిస్తామని చెప్పి మోసం చేశారని అంగన్ వాడీ కార్యకర్త ఫిర్యాదు. జేసీ సీసీ శ్రీకాంత్, సిబ్బంది దయాకర్, వికాస్ పై కేసు నమోదు. జేసీ భార్య ఇంట్లో పనిచేయించుకుంటున్నారంటూ ఫిర్యాదు. కేసును తప్పుదోవ పట్టిస్తున్నారని ఆందోళన. * రాజకీయాలపై సంచలన ప్రకటన చేసిన జయ నెచ్చెలి శశికళ. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన చిన్నమ్మ. శశికళ ప్రకటనతో నిరాశ చెందిన అభిమానులు. ఇది బీజేపీ స్క్రిప్ట్ అంటున్న శశికళ మద్దతుదారులు. * సీఎం జగన్ కు ఏపీ సీపీఎం కార్యదర్శి రామకృష్ణ లేఖ. రేపటి రాష్ట్ర బంద్ కు సహకరించాలని సీఎంకు వినతి. విశాఖ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా బంద్ కు పిలుపునిచ్చిన సీపీఐ.

నిజమే.. చంద్రుడిపై 4జీ నెట్వర్క్

20-10-202020-10-2020 14:03:22 IST
Updated On 20-10-2020 14:24:27 ISTUpdated On 20-10-20202020-10-20T08:33:22.048Z20-10-2020 2020-10-20T08:33:15.153Z - 2020-10-20T08:54:27.134Z - 20-10-2020

నిజమే.. చంద్రుడిపై 4జీ నెట్వర్క్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

చందమామపై 4జీ సెల్యులార్‌ నెట్‌వర్క్‌ను ఏర్పాటుచేయనున్నట్టు ప్రముఖ మొబైల్‌ ఫోన్ల తయారీ సంస్థ నోకియా ప్రకటించింది. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా) కోసం ఈ నెట్‌వర్క్‌ను సిద్ధం చేస్తున్నట్టు వెల్లడించింది. 

చంద్రుడిపై కనెక్టివిటీనీ పెంచేందుకు ప్రముఖ టెక్ సంస్థ నోకియా, అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా సంయుక్తంగా చంద్రుడిపై 4జీ ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. దీని కోసం నాసా ఏకంగా 14.1 మిలియన్ డాలర్లను కేటాయించింది. 4జీతో ప్రారంభించి ఆ తరువాత 5జీ టెక్నాలజీని కూడా ఏర్పాటు చేయాలనేది నాసా ఆలోచన.  నోకియాకు చెందిన పరిశోధన విభాగం బెల్ ల్యాబ్స్‌ను కీలక భాగస్వామిగా ఎంపిక చేసింది. టిప్పింగ్ పాయింట్ టెక్నాలజీస్ పేరిట చేపడుతున్న ఈ ప్రాజెక్టు  ద్వారా అంతరిక్షంలో సమాచార మార్పిడిని మరింత వేగవంతమవుతుందని నాసా పేర్కొంది. దీనిపై బెల్ ల్యాబ్స్‌ కూడా స్పందించింది. తాము కీలక భాగస్వామిగా ఎంపికైనందుకు సంతోషం వ్యక్తం చేసింది. చంద్రుడిపై మానవాళి సుస్థిర నివాసం ఏర్పాటు చేసేందుకు ఈ ప్రయత్నాలు దోహద పడతాయని తెలిపింది. 

అంగారకుడిపైకి మనుషులను పంపే ప్రయత్నాల్లో ఉన్న నాసా, అందుకు చంద్రుడిని ఒక స్తావరంగా మార్చుకోవాలని ప్రణాళికలు వేస్తోంది. చంద్రుడిపై కొంతకాలం నివాసం ఉండే మనుషులకోసం 4జీ మొబైల్‌ నెట్‌వర్క్‌ ఏర్పాటు చేయనున్నది. భూమిపై పూర్తిగా సిద్ధం చేసిన నెట్‌వర్క్‌ పరికరాలను 2022 సంవత్సరాంతంలో చంద్రుడిపైకి తీసుకెళ్లి అమర్చుతారు. చంద్రుడిపై మనిషి మనుగడకు కమ్యూనికేషన్‌ వ్యవస్థ అవసరమని నోకియా చీఫ్‌ టెక్నాలజీ ఆఫీసర్‌ మార్కస్‌ వెల్డన్‌ అన్నారు. నోకియా తయారుచేస్తున్న 4జీ నెట్‌వర్క్‌లో వ్యోమగాములు ఉండేందుకు స్థావరం, యాంటెన్నాలు ఉన్నాయి. 

ట్రిఫో రోబో వ్యాక్యూమ్ క్లీనర్లు భారత్ లో కూడా అందుబాటులో..!


Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle