అతి తక్కువ ధరకు నోకియా 2.4 మొబైల్ ఫోన్
30-12-202030-12-2020 16:58:15 IST
Updated On 31-12-2020 10:01:39 ISTUpdated On 31-12-20202020-12-30T11:28:15.335Z30-12-2020 2020-12-30T11:28:08.897Z - 2020-12-31T04:31:39.448Z - 31-12-2020

నోకియా 2.4 మొబైల్ ఫోన్ భారత్ లో ఇటీవలే లాంఛ్ చేశారు. 10399 పరుగులకు ఈ మొబైల్ ఫోన్ ను తీసుకుని వచ్చారు. ధర అందుబాటులో ఉన్నప్పటికీ రియల్ మీ, రెడ్ మీ మొబైల్ ఫోన్లలో ఇదే ధరకు మంచి ఫీచర్లు లభిస్తూ ఉన్నాయని పెదవి విరిచేవారు ఎక్కువగా ఉన్నాయి. ఈ మొబైల్ ఫోన్ ధర భారీగా తగ్గింది. నోకియా 2.4 మొబైల్ ఫోన్ మీద 1399 డిస్కౌంట్ ను పేటీఎం ఇవ్వనుంది. ఇక క్యాష్ బ్యాక్ ఆఫర్లు కూడా ఉండడంతో 7000 రూపాయలకే ఈ మొబైల్ ఫోన్ లభించనుంది. ప్రస్తుతం నోకియా 2.4 మొబైల్ ఫోన్ లాంఛ్ చేసిన ధర 10399 రూపాయలు. కానీ పేటీఎంలో 9999 రూపాయలకు అందుబాటులో ఉంది. ఎస్.బి.ఐ. డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డులను ఉపయోగించడం వలన 10 శాతం డిస్కౌంట్ లభించనుంది. అంటే 999 రూపాయలు ఈ మొబైల్ ఫోన్ విషయంలో డిస్కౌంట్ ఇవ్వనున్నారు. కాబట్టి 9000 రూపాయలకు మొబైల్ లభించనుంది. ఇక ఇంతకంటే తక్కువ ధరకు మనకు మొబైల్ ఫోన్ దక్కాలంటే FESTIVESHOPNOW అనే ప్రోమో కోడ్ ను ఉపయోగించాల్సి ఉంటుంది. పేటీఎం క్యాష్ 1000 రూపాయలు వెనక్కు రానుంది. 1000 రూపాయల విలువగల పేటీఎం మాల్ ఓచర్ లభిస్తుంది. అలా చూస్తే మొబైల్ ఫోన్ 7000 రూపాయలకు లభించనున్నట్లే..! నోకియా 2.4 మొబైల్ ఫోన్ అతి తక్కువ ధరకు మీరు సొంతం చేసుకోవచ్చు. నోకియా 2.4 లో 6.5 ఇంచ్ డిస్ప్లే కలదు. మీడియాటెక్ హీలియో పి22 ప్రాసెసర్ ఉంది. బడ్జెట్ ఫోన్ కు తగ్గట్టుగా మొబైల్ ఫోన్ డిజైన్ కూడా ఉంది. వాటర్ డ్రాప్ స్టైల్ నాట్చ్ డిస్ప్లే ఉంది. 3 జీబీ ర్యామ్ తో ఈ మొబైల్ ఫోన్ లభించనుంది. 64జీబీ మెమరీతో వచ్చిన ఈ మొబైల్ ఫోన్ మెమరీని మైక్రో ఎస్.డీ. కార్డు సహాయంతో పెంచుకోవచ్చు. 13 మెగా పిక్సెల్ మెయిన్ సెన్సార్ తో పాటూ 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ ఉంది. సెల్ఫీల కోసం 5 మెగా పిక్సెల్ కెమెరా ఉంది. 4500 ఎంఏహెచ్ బ్యాటరీతో ఈ మొబైల్ ఫోన్ పని చేయనుంది.

రెండేళ్లు ఫ్రీ కాల్స్, ఇంటర్నెట్.. జియో సంచలన ఆఫర్
an hour ago

ఓటీటీల విషయంలో క్లారిటీ ఇచ్చిన కేంద్రం..!
13 hours ago

ఒకే ఒక్క ట్వీట్ లక్ష కోట్లు ఆవిరయ్యేలా చేసింది..!
23-02-2021

చంద్రయాన్-3 వాయిదా
22-02-2021

వాట్సాప్ కు పోటీగా సందేశ్.. క్లిక్ అయ్యేనా..?
19-02-2021

మార్స్ గ్రహంపై నాసా రోవర్.. ఆపరేషన్ లీడ్‌గా స్వాతి మోహన్
19-02-2021

వార్తలు షేర్ చేయకుండా ఫేస్ బుక్ సంచలన నిర్ణయం
18-02-2021

సంచలన ఆఫర్ ను తీసుకుని వచ్చిన వీఐ
18-02-2021

పౌరుల గోప్యత అంటే అంత చిన్నచూపా.. వాట్సాప్‌పై సుప్రీంకోర్టు ధ్వజం
17-02-2021

వాట్సాప్ ను వెంటాడుతూ ఉన్న ప్రైవసీ వివాదాలు
16-02-2021
ఇంకా