నెట్ ఫ్లిక్స్ పాస్ వర్డ్స్ ను పంచుకుంటున్నారా.. రాబోయే రోజుల్లో కష్టమే..!
13-03-202113-03-2021 17:08:46 IST
Updated On 13-03-2021 17:11:54 ISTUpdated On 13-03-20212021-03-13T11:38:46.546Z13-03-2021 2021-03-13T07:23:45.570Z - 2021-03-13T11:41:54.515Z - 13-03-2021

ఓటీటీల విషయంలో పాస్ వర్డ్స్ ను షేర్ చేసుకుంటూ ఉంటారు. ఒక్కరు డబ్బులు ఖర్చు పెట్టి నలుగురు వాడుకుంటూ ఉండడం.. ఫ్రెండ్స్ సర్కిల్ మొత్తం ఒకటే అకౌంట్ ను వాడుకుంటూ ఉండడం జరుగుతూ ఉంటాయి. ఇక భారత్ లో ఓటీటీల హవా భారీగా మొదలైంది. ప్రస్తుతం ఉన్న ఓటీటీలలో సంవత్సరానికి ప్యాక్ అంటూ లేకుండా ఉన్నది నెట్ ఫ్లిక్స్ అని చెప్పొచ్చు. ముఖ్యంగా అందులో ఉండే కంటెంట్ కూడా మిగిలిన ఓటీటీలతో పోలిస్తే చాలా బెటర్ అనే చెప్పొచ్చు. తక్కువలో తక్కువ ఒక నెల వాడుకోవాలి అనుకున్నా కూడా 200 రూపాయలు నెట్ ఫ్లిక్స్ కోసం ఖర్చు పెట్టాల్సిందే..! ఇక ఎక్కువ మంది యూజర్లు వాడుకోడానికి కూడా ఇంకాస్త ఎక్కువగానే చెల్లించాల్సి ఉంటుంది. కానీ చాలా మంది పాస్ వర్డ్స్ ను షేర్ చేసుకుంటూ ఉన్నారు. దీనిపై నెట్ ఫ్లిక్స్ సంస్థ కూడా కన్నేసింది. ఆదాయానికి గండి పడుతోందని భావించిన నెట్ ఫ్లిక్స్ సంస్థ పాస్ వర్డ్స్ విషయంలో ఎక్కువ షేరింగ్ జరగకుండా కొత్త ఫీచర్ ను పరిశీలిస్తోంది. పాస్ వర్డ్స్ షేరింగ్ ద్వారా తమ సంస్థ నష్టపోకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ ప్రతినిధులు చెబుతూ ఉన్నారు. నెట్‌ఫ్లిక్స్ కూడా ఒక అకౌంట్, పాస్వర్డ్ ద్వారా ఎక్కువ మంది యూజర్లు లాగిన్ అయ్యే అవకాశం కల్పించినప్పటికీ రాబోయే రోజుల్లో పాస్వర్డ్ షేరింగ్ నియమాలను కఠినతరం చేస్తోంది. దీనికి సంబంధించిన కొత్త ఫీచర్‌ను నెట్‌ఫ్లిక్స్ పరీక్షిస్తోంది. ఇప్పుడు యూజర్లు.. సంబంధిత అకౌంట్ ద్వారా నెట్ ఫ్లిక్స్‌కు లాగిన్ అయ్యే అధికారం తమకు ఉందని ధ్రువీకరించాల్సి ఉంటుంది. యూజర్ల కుటుంబ సభ్యులు కాకుండా ఇతర వ్యక్తులు పాస్వర్డ్ షేరింగ్ ద్వారా లబ్ధిపొందడం కుదరదని సంస్థ చెబుతోంది. ఈ వివరాలన్నీ సర్వీస్ రూల్స్‌లో ఉన్నాయని సంస్థ స్పష్టం చేసింది. కొంతమంది యూజర్లు షేర్డ్ నెట్‌ఫ్లిక్స్ అకౌంట్లో తమ ప్రొఫైల్‌ను ఎంచుకున్నప్పుడు ఒక నోటిఫికేషన్ కనిపిస్తోంది. అకౌంట్‌ను వెరిఫికేషన్ చేయాలని, అకౌంట్ హోల్డర్‌కు పంపిన మెసేజ్ లేదా ఈమెయిల్ ద్వారా వివరాలను ధ్రువీకరించాలని నోటిఫికేషన్ లో ఉంది. కస్టమర్లు వెరిఫికేషన్‌ను వాయిదా వేసే ఆప్షన్ కూడా ఉంది. కానీ వారికి నిర్ణీత సమయంలో మళ్లీ నోటిఫికేషన్ కనిపిస్తుంది. తాము అధికారిక వినియోగదారులమని యూజర్లు ధ్రువీకరించకపోతే.. నెట్‌ఫ్లిక్స్ వాడేందుకు కొత్త అకౌంట్ ద్వారా లాగిన్ కావాల్సి ఉంటుంది. ఈ కొత్త ఫీచర్ టెస్టింగ్ దశలోనే ఉంది. రాబోయే రోజుల్లో అన్నిటికీ అందుబాటులోకి వచ్చేయబోతోంది. ఇకపై పాస్ వర్డ్స్ ను షేర్ చేసుకోవడం కూడా కష్టమే..!

వాట్సాప్ పింక్ లో కూడా వస్తుందా.. వస్తే మీరు ట్రాప్ లో పడ్డట్టే
17-04-2021

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?
12-04-2021

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్
10-04-2021

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!
07-04-2021

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు
06-04-2021

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!
05-04-2021

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!
01-04-2021

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్
25-03-2021

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు
24-03-2021

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?
22-03-2021
ఇంకా