newssting
Radio
BITING NEWS :
ఓ ఆసుపత్రిలో మహిళా రోగిపై ఉద్యోగి అత్యాచారం. గురుగ్రామ్ నగరంలో వెలుగుచూసిన దారుణం. ప్రైవేటు ఆసుపత్రిలోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో 21 ఏళ్ల యువతి క్షయ వ్యాధితో చికిత్స కోసం చేరగా వెంటిలేటరుపై చికిత్స పొందుతూ స్పృహ లేని స్థితిలో ఉన్నపుడు ఆసుపత్రి ఉద్యోగి ఒకరు తనపై అత్యాచారం చేశాడని తన చేత్తో రాసిన నోట్ ద్వారా తండ్రికి తెలిపిన బాధితురాలు * నలుగురు ఆమ్ ఆద్మీ పార్టీ శాసనసభ్యులపై కేసులు నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు. ఢిల్లీలో పారిశుద్ధ్య పనుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమించిన నలుగురు ఆప్ ఎమ్మెల్యేలపై పోలీసులు కేసులు. పారిశుద్ధ్య పనుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆప్ నాయకుడు దుర్గేష్ పాథక్ 1500మంది ప్రజలతో పౌరకేంద్రం ముందు నిరసన కార్యక్రమం చేపట్టగా..అనుమతి లేకుండా నిరసన చేపట్టారని కేసులు నమోదు * 317వ రోజుకు చేరుకున్న అమరావతి రైతు నిరసనలు. రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ రైతులు, మహిళలు చేపట్టిన నిరసనలు. అమరావతి గ్రామాల్లోని శిబిరాల్లో కొనసాగుతున్న రైతుల ఆందోళనలు. కరోనా సూచనలు పాటిస్తూ సాగుతున్న అమరావతి ఉద్యమం * ఉత్తర తమిళనాడుకు ఆనుకుని నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం. రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమల్లో చెదురుమదురుగా వర్షాలు కురుస్తాయని, మిగిలినచోట్ల పొడి వాతావరణం కొనసాగుతుందని తెలిపిన వాతావరణ శాఖ. కాగా ఈశాన్య గాలులు ప్రారంభం కావడంతో అనేకచోట్ల, ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో కురుస్తున్న మంచు. పగటిపూట మాత్రం కొనసాగుతున్న ఎండ * గ్రేటర్‌ ఎన్నికలకు పడిన మరో ముందడుగు. వార్డుల వారీగా రిటర్నింగ్‌, అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ అధికారులను నియమిస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ. గ్రేటర్‌లో 150 వార్డులకు తహసీల్దార్‌, ఎంపీడీఓ తదితర కేడర్‌ అధికారులను రిటర్నింగ్‌, అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ ఆఫీసర్లుగా జీహెచ్‌ఎంసీ సూచించిన వారిని నియమిస్తున్నట్లుగా రాష్ట్ర ఎన్నికల సంఘం ఆమోదం * బేగంపేట మెట్రో స్టేషన్‌ పై నుంచి పడి యువకుడు మృతి. ఈ నెల 26న జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన. చార్టెడ్‌ అకౌంటెన్సీ కోర్స్‌ చేస్తున్న కర్నూల్‌ జిల్లా మంత్రాలయం రామచంద్రనగర్‌కు చెందిన జీ మంజునాథ్‌ (23) ఈ నెల 14న నగరానికి రాగా ఆత్మహత్య చేసుకున్నట్లుగా సీసీ కెమెరాలలో రికార్డు * గురువారం నుంచి అందుబాటులోకి వచ్చిన తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొస్తున్న ధరణి ఫోర్టల్‌ సేవలు. మేడ్చల్‌ జిల్లా మూడుచింతలపల్లిలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రారంభం. ధరణి సేవలు మొదలైతే తాసిల్దార్‌ కార్యాలయాల్లో రోజుకు16 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ చేసే వెసులుబాటు * చెన్నై నగరాన్ని అతలాకుతలం చేస్తున్న భారీ వర్షాలు. గత రాత్రి నుంచి మహానగరంలో ఎడతెరపిలేకుండా కురుస్తున్న భారీ వర్షాలు. తిరువాన్మియూర్, మైలాపూర్, రాయపెట్ట, అడయార్‌లలో వర్షాలు కురుస్తున్నాయి. కుండపోతగా కురుస్తున్న వర్షాలకు పలు కాలనీలు నీట మునిగగా వర్షపు నీటిని తొలగించడానికి అధికారులు అన్ని చర్యలు చేపట్టారు * మంచిర్యాల జిల్లాలోని హజీపూర్ మండలం నర్సింగ పూర్ శివారులో పెద్ద పులి సంచారం . ఎల్లంపల్లి ప్రాజెక్టు దిగువన పులి సంచారాన్ని గుర్తించిన గ్రామస్థులు. విషయం తెలిసిన అటవీ శాఖ అధికారులు అక్కడకు చేరుకుని అడుగుల ద్వారా పులి సంచారాన్ని నిర్ధారించారు. దీంతో సమీప అటవీ ప్రాంతాలకు ప్రజలు వెళ్ళొద్దని అధికారులు సూచనలు జారీ.

మరోసారి మొబైల్ రంగంలో 'మైక్రోమ్యాక్స్' మెరుపులు చూస్తామా..?

17-10-202017-10-2020 16:26:55 IST
Updated On 17-10-2020 16:59:03 ISTUpdated On 17-10-20202020-10-17T10:56:55.116Z17-10-2020 2020-10-17T10:56:51.061Z - 2020-10-17T11:29:03.585Z - 17-10-2020

మరోసారి మొబైల్ రంగంలో 'మైక్రోమ్యాక్స్' మెరుపులు చూస్తామా..?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

మైక్రోమ్యాక్స్ ఒకప్పుడు మొబైల్స్ రంగంలో మంచి పేరు సంపాదించుకుంది. తక్కువ ధరకే మొబైల్స్ అందిస్తూ.. ప్రజల మనసులను దోచుకుంది. ఈ దేశీయ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ మైక్రోమాక్స్ మళ్లీ తన పూర్వ వైభవాన్ని పొందేందుకు  సిద్ధపడుతోంది.  చైనా ఉత్పత్తులపై పెరుగుతున్న వ్యతిరేకత నేపథ్యంలో  మైక్రోమాక్స్ సరికొత్త వ్యూహాలతో   మార్కెట్లోకి రీఎంట్రీ  ఇవ్వనుంది. ఈమేరకు మైక్రోమాక్స్ సీఈవో రాహుల్ శర్మ ఒక వీడియోను ట్విటర్ లో పోస్ట్ చేశారు. ప్రపంచంలో టాప్ 10 బ్రాండ్స్ లో ఒకటిగా నిలిచిన  మైక్రోమాక్స్ జర్నీని తెలియజేశారు. కొన్ని పొరపాట్లు జరిగినా,  తాను ఓడిపోకపోయినా, సాధించిన దానితో సంతృప్తి చెందానని.. కానీ సరిహద్దు వద్ద ఏమి జరిగిందో అది సరైనది కాదన్నారు.

ఈసారి ఏం చేసిన దేశం కోసం మాత్రమే చేస్తానని రాహుల్ ప్రకటించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆత్మనిభర్ భారత్ పిలుపులో భాగంగా ఇండియా కోసం మైక్రోమాక్స్ 'ఇన్' అనే కొత్త స్మార్ట్‌ఫోన్‌ బ్రాండ్‌తో తిరిగి వస్తోందని చెప్పుకొచ్చారు. భారతదేశంలో కొత్త ఇన్-సిరీస్ స్మార్ట్‌ఫోన్‌ను విడుదలకు సూచికగా బ్లూ బాక్స్ ను  కూడా  వీడియోలో షేర్ చేశారు. 7-15 వేల రూపాయల ధరల మధ్య ఉత్పత్తులను మైక్రోమాక్స్ లాంచ్ చేయనుందని భావిస్తున్నారు. నవంబర్ లో స్మార్ట్‌ఫోన్‌లను బడ్జెట్ ధరలో ఆవిష్కరించనుంది. మునుపటి లాగా మైక్రోమ్యాక్స్ గతంలో లాగా మొబైల్ రంగంలో టాప్ పొజిషన్ కు వెళ్లబోతుందా లేదా అన్నది కాలమే నిర్ణయిస్తుంది. 


Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle