newssting
Radio
BITING NEWS :
కర్ణాటకలో నేడు, రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేసిన ఐఎండీ. ఉరుములతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపిన ఐఎండీ * కాంగ్రెస్ సీనియర్ నేత అహ్మద్ పటేల్ కరోనాకు చికిత్స పొందుతూ కన్నుమూశారు. గురుగావ్‌లోని మేదాంత ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. ఈరోజు ఉదయం 3.30 గంటలకు అహ్మద్ పటేల్ మృతి చెందారని ఆయన కుమారుడు ఫైసల్ పటేల్ ట్విటర్‌ ద్వారా తెలియజేశారు. విషయం తెలుసుకున్న ప్రధాని నరేంద్ర మోదీ అహ్మద్ పటేల్ మృతికి సంతాపం వ్యక్తం చేశారు. అహ్మద్ పటేల్ సమాజానికి ఏళ్ల తరబడి సేవలు అందించారని ప్రధాని ట్వీట్ ద్వారా కొనియాడారు. అహ్మద్​ పటేల్​ మరణంపై కాంగ్రెస్‌ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ‘‘అత్యంత విశ్వాసపాత్రుడు, మంచి స్నేహితుడు. ఆయన స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు. గొప్ప కామ్రేడ్‌ను నేను కోల్పోయాను’’ అంటూ ఉద్వేగానికి లోనయ్యారు * తమిళనాడు రాష్ట్రంలో అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల నేపథ్యంలో నేడు తమిళనాడు వ్యాప్తంగా ప్రభుత్వం సెలవు ప్రకటించగా సహాయక చర్యల కోసం ఎన్డీఆర్ఎఫ్‌ బృందాలు రంగంలోకి దిగాయి * ఆఫ్ఘనిస్థాన్ దేశంలోని బమియాన్ నగరంలో రెండు వేర్వేరు చోట్ల జరిగిన పేలుళ్లలో 17 మంది మరణించగా, మరో 50 మంది తీవ్రంగా గాయపడ్డారు. బమియాన్ ప్రావిన్సులోని బమియాన్ నగరంలోని స్థానిక మార్కెట్ లో పేలుళ్లు జరిగాయి * దేశరాజధాని ఢిల్లీలో కరోనా కల్లోలం ఆగడం లేదు. గడచిన 24 గంటల్లో ఢిల్లీలో కొత్తగా 6,224 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇదేసమయంలో 109 మంది మృతి చెందారు. కరోనా కారణంగా ఢిల్లీలో వరుసగా ఐదవ రోజు కూడా100కు పైగా మరణాలు సంభవించాయి * రష్యా వ్యాక్సిన్‌ స్పుత్నిక్‌-వి ఒక్కో డోసు ధర రూ.740 (రెండు డోసులకు రూ.1480) కంటే తక్కువే ఉంటుందని రష్యన్‌ డైరెక్ట్‌ ఇన్వె్‌స్టమెంట్‌ ఫండ్‌ (ఆర్‌డీఐఎఫ్‌) అధిపతి కిరిల్‌ దిమిత్రీవ్‌ ప్రకటన * తెలుగు రాష్ట్రాలకు ‘నివర్’ తుఫాన్ ముప్పు పొంచి ఉంది. తుఫాను ప్రభావం ఇరు రాష్ట్రాలపై ఎక్కువగా ఉండనుంది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు, చిత్తూరు, కర్నూలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తుఫాన్ నేపథ్యంలో నెల్లూరు జిల్లాలోని అన్ని విద్యా సంస్థలకు మూడ్రోజుల పాటు సెలవులు ప్రకటించారు. ఇప్పటికే ఎన్డీఆర్‌ఎఫ్‌, ఎస్డీఆర్‌ఎఫ్‌ బృందాలు జిల్లాకు చేరుకున్నారు. అధికారులు, సిబ్బందికి సెలవుల రద్దు చేశారు. తీర ప్రాంతాల్లో కలెక్టర్‌ పర్యటించారు. కృష్ణపట్నం పోర్టులో రెండవ నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు * హైదరాబాద్ ఎల్బీనగర్ ఫ్లైఓవర్‌ పైనుంచి దూకి యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ప్రమాదంలో రాంపల్లి ప్రవీణ్‌కుమార్‌కు తీవ్రగాయాలయ్యాయి. వెంటనే క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించారు * రాష్ట్రంలో బుధ, గురు వారాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది. బుధవారం ఒకట్రెండు చోట్ల భారీ వర్షం కురుస్తుందని అధికారులు తెలిపారు. బంగాళాఖాతంలోని అల్పపీడనం బుధవారం సాయంత్రం తీరం దాటి తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉన్న ట్లు వాతావరణశాఖ అధికారులు తెలిపారు * ప్రతి ఓటరుకు ఓటరు స్లిప్పును అందజేయాలని, ఈ కార్యక్రమం బుధవారం సాయంత్రానికల్లా పూర్తి కావాలని రాష్ట్ర ఎన్నికల సంఘం(ఎస్‌ఈసీ) ఆదేశించింది. 2009, 2016 ఎన్నికల్లో ఓటింగ్‌ 50 శాతం కూడా దాటకపోవడాన్ని గుర్తు చేసింది.

మారుతి సుజుకి జిమ్ని.. రోడ్డు మీద సవారీ

19-10-202019-10-2020 11:27:23 IST
Updated On 19-10-2020 11:39:58 ISTUpdated On 19-10-20202020-10-19T05:57:23.037Z19-10-2020 2020-10-19T05:57:20.093Z - 2020-10-19T06:09:58.284Z - 19-10-2020

 మారుతి సుజుకి జిమ్ని.. రోడ్డు మీద సవారీ
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

మారుతి సుజుకి జిమ్ని.. భారతీయులు ఎదురు చూస్తున్న కారు మోడల్స్ లో ఇదొకటి. మొదటి సారి మారుతి సుజుకి జిమ్ని సియర్రా ఎస్.యు.వి. వాహనం భారత్ లోని రోడ్లపై సవారీ చేస్తూ కనిపించింది. మనెస్సార్ లోని మారుతి సుజుకి మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీకి దగ్గర్లో కనిపించింది. ఆటో ఎక్స్ పో 2020లో ప్రదర్శనకు ఉంచిన మూడు డోర్ల వెర్షన్ అయిన మారుతి సుజుకి జిమ్ని సియర్రా కనిపించింది. అయితే ఎక్స్ పో లో చూసిన మోడల్ దీని కంటే కాస్త పెద్దదిగా అనిపించింది. ఈ ఎస్.యు.వి. వాహనంలో 3-డోర్ల వెర్షన్ ఉంది. 

రోడ్డు మీద కనిపించిన మారుతి సుజుకి జిమ్ని ఆటో ఎక్స్ పో లో ప్రదర్శించిన వాహనాన్ని పోలి ఉంది. తెలుపు రంగు బాడీ కలర్ తో ఉన్న ఈ వాహనంకు టాల్ బాడీ స్ట్రక్చర్, సర్క్యులర్ హెడ్ లాంప్స్, రౌండ్ ఫాగ్ లైట్స్, సరికొత్త అలాయ్ వీల్ డిజైన్, టైల్ గేట్ మౌంటెడ్ స్పేర్ వీల్, బంపర్స్ ఇంటిగ్రేటెడ్ టైల్ లైట్స్, సైడ్ స్వంగ్ రియర్ డోర్ కూడా ఉన్నాయి. 

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ మొదలైంది.. భారీ ఆఫర్లు వాటి మీదనే..

జిప్సీకి ఉన్న ఫాలోయింగ్ ను దృష్టిలో పెట్టుకుని మారుతి సుజుకి జిమ్నిని మార్కెట్ లోకి వదలాలని సంస్థ భావిస్తోంది. లాంఛింగ్ డేట్ గురించి కూడా ఇంకా క్లారిటీ లేదు. ఇటీవల భారత ఆటో మార్కెట్ లోకి వచ్చిన మహీంద్రా థార్, ఫోర్స్ గుర్ఖా లకు పోటీగా మారుతి సుజుకి జిమ్ని ని తీసుకుని రాబోతున్నారు. ఈ కారు ధర 10 లక్షల లోపు(ఎక్స్-షోరూమ్) ఉండబోతోందని అంటున్నారు. మారుతి నెక్సా రిటైల్ ఛానల్ ద్వారా ఈ కారును అమ్మబోతున్నారు. 

ఇప్పటి వరకూ అందిన సమాచారం ప్రకారం 1.5-litre K15B petrol తో రాబోతోంది. సియాజ్, ఎర్టిగా, ఎక్స్ఎల్ 6 లను తీసుకుని వచ్చిన యూనిట్ అనే చెబుతున్నారు. 5 స్పీడ్ మ్యానువల్ గేర్ బాక్స్ తో పాటూ ఆప్షనల్ 4-స్పీడ్ ఆటోమేటిక్ టార్క్ కన్వర్టర్ ట్రాన్స్మిషన్ తో రాబోతోంది. ఈ వాహనం మీద ఎన్నో అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలను అందుకుంటుందా లేదా అన్నది తెలియాలి.     

మరో 43 యాప్ లపై కొరడా ఝుళిపించిన భారత ప్రభుత్వం

మరో 43 యాప్ లపై కొరడా ఝుళిపించిన భారత ప్రభుత్వం

   17 hours ago


రుణాలు అందించే ఐదు యాప్స్‌ను ప్లే స్టోర్స్ నుండి డిలీట్.. చేసిన తప్పేమిటంటే

రుణాలు అందించే ఐదు యాప్స్‌ను ప్లే స్టోర్స్ నుండి డిలీట్.. చేసిన తప్పేమిటంటే

   24-11-2020


ట్రూ కాలర్ లాంటి యాప్ ను గూగుల్ తీసుకుని రాబోతోందా..?

ట్రూ కాలర్ లాంటి యాప్ ను గూగుల్ తీసుకుని రాబోతోందా..?

   24-11-2020


పోస్ట్ పెయిడ్ యూజర్ల కోసం సరికొత్త ఫీచర్ ను తీసుకుని వచ్చిన పేటీఎం..!

పోస్ట్ పెయిడ్ యూజర్ల కోసం సరికొత్త ఫీచర్ ను తీసుకుని వచ్చిన పేటీఎం..!

   24-11-2020


తప్పు ఒప్పుకున్న ట్విట్టర్.. భారత ప్రభుత్వం క్షమిస్తుందా..?

తప్పు ఒప్పుకున్న ట్విట్టర్.. భారత ప్రభుత్వం క్షమిస్తుందా..?

   19-11-2020


క్విక్ రియాక్షన్ సర్ఫేస్ టూ ఎయిర్ మిసైల్ సిస్టమ్ సక్సెస్

క్విక్ రియాక్షన్ సర్ఫేస్ టూ ఎయిర్ మిసైల్ సిస్టమ్ సక్సెస్

   18-11-2020


4 యాప్స్ తీసిన  గూగుల్ ప్లేస్టోర్.. ఉంటే మీరూ తీసేయండి.. లేదంటే డ‌బ్బు మాయం..!

4 యాప్స్ తీసిన గూగుల్ ప్లేస్టోర్.. ఉంటే మీరూ తీసేయండి.. లేదంటే డ‌బ్బు మాయం..!

   18-11-2020


ఐఫోన్ 12 మినీలో సమస్యలు ఉన్నాయంటున్న యూజర్లు

ఐఫోన్ 12 మినీలో సమస్యలు ఉన్నాయంటున్న యూజర్లు

   16-11-2020


యాపిల్ ఐఫోన్ 12 మినీ, 12 ప్రొ మ్యాక్స్ ఫోన్ల విక్రయాలు మొదలయ్యాయి

యాపిల్ ఐఫోన్ 12 మినీ, 12 ప్రొ మ్యాక్స్ ఫోన్ల విక్రయాలు మొదలయ్యాయి

   15-11-2020


వన్ ప్లస్ 9 లీక్స్.. ఆ విషయం స్పష్టంగా తెలుస్తోంది

వన్ ప్లస్ 9 లీక్స్.. ఆ విషయం స్పష్టంగా తెలుస్తోంది

   15-11-2020


ఇంకా

Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle