newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

05-04-202105-04-2021 18:07:14 IST
2021-04-05T12:37:14.037Z05-04-2021 2021-04-05T05:41:04.061Z - - 11-04-2021

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

ఎల్.జీ. సంస్థ..  దక్షిణ కొరియాకు చెందిన ఈ కంపెనీ ఎన్నో ఎలెక్ట్రానిక్ పరికరాలను రూపొందిస్తూ ఉంది. ఒకప్పుడు మొబైల్ ఫోన్ రంగంలో కూడా మంచి ఫలితాలను సొంతం చేసుకుంది. అయితే ఇప్పుడు పరిస్థితులు చాలా మారిపోయాయి. మొబైల్ ఫోన్స్ రంగంలో చాలా వరకూ ఇతర కంపెనీలు దూకుడుగా వ్యవహరిస్తూ ఉండడంతో ఎల్.జీ. పెద్దగా రాణించడం లేదు. మొబైల్ ఫోన్ వినియోగదారులను ఆకట్టుకునే తీరులో ఫోన్లను విడుదల చేయడంలో కూడా ఎల్.జీ. విఫలమైంది. దీంతో మొబైల్ ఫోన్ వ్యాపారానికి గుడ్ బై చెప్పడమే బెటర్ అని  ఎలక్ట్రానిక్స్  దిగ్గజం ఎల్‌జీ సంచలనం నిర్ణయం తీసుకుంది. 

మొబైల్ ఫోన్ వ్యాపారానికి స్వస్తి పలకాలని నిర్ణయించామని.. భారీ నష్టాలకారణంగా  స్మార్ట్‌ఫోన్‌ డివిజన్ ఉత్పత్తి అమ్మకాలను ముగించనున్నట్లు తెలిపింది. ఆరు సంవత్సరాలుగా తీవ్ర నష్టాలతో కొట్టిమిట్టాడుతోంది ఎల్.జీ...! అటు వినియోగదారులు వావ్ అనేలా మొబైల్ ఫోన్ ను కూడా విడుదల చేయలేకపోయింది. ఇక తన ఫోన్ వ్యాపారాన్ని జర్మనీకి చెందిన వోక్స్ వాగన్ ఏజీ, వియత్నాం కంపెనీ విన్‌గ్రూప్ జెఎస్‌సీ సహా రెండు బడా కంపెనీలకు అమ్మాలని అనుకుని ప్రణాళికలు రచించగా.. అది కూడా బెడిసికొట్టడంతో ఇక ఎల్.జీ. సంస్థ స్మార్ట్ ఫోన్స్ విభాగంలో పెట్టే బేడా సర్దుకోవాలని అనుకుంది. తాజాగా ఈ సంచలన నిర్ణయం తీసుకుంది. మార్కెట్ నుండి పూర్తిగా వైదొలిగిన మొట్టమొదటి ప్రధాన స్మార్ట్‌ఫోన్‌ బ్రాండ్‌గా ఎల్.జీ. నిలిచింది. 

ఒకప్పుడు ఎల్.జీ. సంస్థ మంచి మంచి ఫీచర్లు ఉన్న మొబైల్ ఫోన్స్ ను విడుదల చేసింది. ఎల్‌జీ అల్ట్రా-వైడ్ యాంగిల్ కెమెరాలతో సహా అనేక మోడల్స్ సెల్ ఫోన్లు బాగా హిట్ అయ్యాయి. 2013లో  ఆపిల్‌, శాంసంగ్‌ తరువాత  ప్రపంచంలో మూడవ అతిపెద్ద స్మార్ట్‌ఫోన్ తయారీదారుగా నిలిచింది. కానీ ఆ తరువాత  తీవ్రపోటీకి తోడు,  సాఫ్ట్‌వేర్ ,హార్డ్‌వేర్ ప్రమాదాల వివాదంలో పడింది. గత ఐదేళ్లలో ఎల్‌జీ దాదాపు 4.5 బిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో రూ. 32,856 కోట్లు) మేర నష్టాలను చవిచూసింది. ఈ కారణంగానే మొబైల్ బిజినెస్ నుంచి వైదొలగాలని కంపెనీ నిర్ణయించుకుంది.

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

   12 hours ago

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

   07-04-2021

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

   06-04-2021

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

   01-04-2021

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

   25-03-2021

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

   24-03-2021

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

   22-03-2021

టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

   20-03-2021

దేశీ రోబోను సృష్టించిన ఐఐటీ ప్రొఫెసర్.. స్పెషాలిటీ ఏమిటంటే

దేశీ రోబోను సృష్టించిన ఐఐటీ ప్రొఫెసర్.. స్పెషాలిటీ ఏమిటంటే

   16-03-2021

నెట్ ఫ్లిక్స్ పాస్ వర్డ్స్ ను పంచుకుంటున్నారా.. రాబోయే రోజుల్లో కష్టమే..!

నెట్ ఫ్లిక్స్ పాస్ వర్డ్స్ ను పంచుకుంటున్నారా.. రాబోయే రోజుల్లో కష్టమే..!

   13-03-2021

ఇంకా

Naresh

 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle