ట్విటర్ నీ చాప్టర్ క్లోజ్.. 'కూ' యాప్‌కు కంగనా స్వాగతం
11-02-202111-02-2021 11:45:25 IST
2021-02-11T06:15:25.739Z11-02-2021 2021-02-11T05:46:31.250Z - - 27-02-2021

మైక్రో బ్లాగింగ్ ప్లాట్ ఫామ్ అయిన ట్విట్టర్నుంటి ఇటీవల బహిష్కరణకు గురైన బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ దేశీయ యాప్ కూ (Koo) లో చేరిపోయారు. సరికొత్త యాప్‌లో చేరిన కాస్సేపటికి కంగనా నేరుగా ట్విట్టర్‌కి కౌంటర్ ఇచ్చేసింది. దేశీయ యాప్ కూ ఆగమనంతో ఇక ట్విట్టర్ పనైపోయిందని తేల్చేసింది. మై డియర్ ట్విట్టర్.. ఇక నీ సమయం ముగిసిపోయింది. దేశీయ యాప్ కూ కి హాయ్ చే్ప్పే సమయం వచ్చింది. త్వరలో నా కొత్త అకౌంట్ వివరాలు తెలియజేస్తాను. అయినా దేశీయంగా అభివృద్ది చెందిన యాప్ ఓపెన్ చేసినందుకు ఎంతో థ్రిల్లింగ్‌గా ఉంది అని కంగనా సంతోషం వ్యక్తం చేసింది. అసలు విషయం ఏమిటంటే ఖాతాల తొలగింపు.. లేదా పోస్టుల డిలీట్ వంటి అంశాలతో ట్విట్టర్‌పై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. వస్తున్నాయి. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మొదలుకుని భారత్‌లో కంగనా వంటి సెలబ్రిటీలు, రాజకీయనేతలు, సాధారణ వ్యక్తుల వరకు ట్విట్టర్‌ని విపరీతంగా వాడుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా అత్యధికంగా వినియోగించే సామాజిక మాధ్యమం ట్విట్టర్ ఇటీవల వరస వివాదాల పాలవుతోంది. దానిపై తీవ్ర ఆరోపణలు కూడా వస్తున్నాయి. ఎన్నికల అనంతరం కేపిటల్ హిల్‌పై దాడికి ప్రేరేపించారని ఆరోపిస్తూ అప్పటికి అమెరికా అధ్యక్షుడిగా ఉన్న డొనాల్డ్ ట్రంప్ ఖాతానే ట్విట్టర్ స్తంభింపజేయడంతో ట్విట్టర్ అధికారంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. దీంతో ట్విట్టర్‌కు ప్రత్యామ్నాయంగా పలు దేశాలు తమ తమ సొంత యాప్‌లను రూపొందించుకుంటున్నాయి. భారత్‌లో కూడా ట్విట్టర్‌కు ప్రత్యామ్నాయంగా కూ అనే యాప్ అందుబాటులోకి వచ్చింది. ఈ దేశీయ యాప్‌ను ప్రముఖులు వినియోగించడం మొదలుపెట్టారు. ఇప్పటికే కేంద్ర మంత్రులు రవిశంకర్ ప్రసాద్, పీయూశ్ గోయల్ వంటి వారు కూలో చేరారు. బాలీవుడ్ క్వీన్ కంగనా కూడా బుధవారమే కూ యాప్ లో చేరింది. ఆ సంతోషంతో ట్విట్టర్ పని క్లోజ్ అవుతుందని సంతోషం వ్యక్తం చేసింది. ఈ విధంగా కూ యాప్ వినియోగం భారతదేశంలో పెరుగుతోంది. ట్విటర్‌కే కాదు వాట్సప్‌కు ప్రత్యామ్నాయంగా దేశంలో దేశీయ యాప్స్ రూపొందిస్తున్నారు. చైనా మాదిరి అన్ని స్వదేశీ సామాజిక మాధ్యమాలు రూపొందించేందుకు కేంద్రం ప్రభుత్వం ప్రోత్సాహం కూడా కల్పిస్తున్న విషయం తెలిసిందే. ట్విటర్‌కు ప్రత్యామ్నాయం ‘కూ’ రాగా, వాట్సాప్‌కు పోటీగా సందేశ్ అనే యాప్‌ను రూపొందించారు. టెలిగ్రామ్ కూడా. ప్రస్తుతం వీటి వినియోగం పెరిగింది. తాజాగా ఇటీవల ట్విటర్లో తన ట్వీట్ల తొలగింపునకు గురయిన బాలీవుడ్ నటి కంగనా రనౌత్ కూలో చేరింది. సరికొత్త యాప్‌లో చేరిన కొద్దిసేపటికే ట్విటర్‌కు కౌంటర్ ఇచ్చింది. ట్విటర్ పనైపోయిందని తెలిపింది. ట్విట్టర్ వ్యవహారశైలిపై ప్రభుత్వంతో పాటు కొంత మంది నెటిజెన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీరంతా ప్రస్తుతం ఈ కొత్త యాప్‌కు మారిపోతున్నారు. ఆ విషయాన్ని ట్విట్టర్లో ‘కూ’త పెట్టి మరీ చెబుతున్నారు. దీంతో ట్విట్టర్ ఇండియా ట్రెండిండ్‌లో కొత్త యాప్ కూత మొదటి స్థానంలో ఉంది. అచ్చం ట్విట్టర్ మాదిరిగానే ఉండే ఈ యాప్.. నెటిజెన్లను బాగానే ఆకర్షిస్తోంది. కేంద్రమంత్రి పీయూష్ గోయల్ తాను సోషల్ మీడియా ప్లాట్ఫారం ‘కూ’లో అకౌంట్ తెరిచినట్టు ప్రకటించారు. ఇది ఒక మేక్ ఇన్ ఇండియా యాప్ అని, దీనికి అధికారిక ట్విట్టర్‌తో పాటు మద్దతు పలికేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు. బీజేపీ నేత సంబిత్ పాత్రా, రిపబ్లిక్ చానల్ లాంటి ప్రముఖ ఖాతాలు ‘కూ’ యాప్‌లో తెరవడంతో నెటిజెన్లు బాగానే పోటెత్తుతున్నారు. ‘కూ’ అనే కొత్త యాప్ ప్రస్తుతం నిజంగానే హల్చల్ చేస్తోంది.

రెండేళ్లు ఫ్రీ కాల్స్, ఇంటర్నెట్.. జియో సంచలన ఆఫర్
2 hours ago

ఓటీటీల విషయంలో క్లారిటీ ఇచ్చిన కేంద్రం..!
14 hours ago

ఒకే ఒక్క ట్వీట్ లక్ష కోట్లు ఆవిరయ్యేలా చేసింది..!
23-02-2021

చంద్రయాన్-3 వాయిదా
22-02-2021

వాట్సాప్ కు పోటీగా సందేశ్.. క్లిక్ అయ్యేనా..?
19-02-2021

మార్స్ గ్రహంపై నాసా రోవర్.. ఆపరేషన్ లీడ్‌గా స్వాతి మోహన్
19-02-2021

వార్తలు షేర్ చేయకుండా ఫేస్ బుక్ సంచలన నిర్ణయం
18-02-2021

సంచలన ఆఫర్ ను తీసుకుని వచ్చిన వీఐ
18-02-2021

పౌరుల గోప్యత అంటే అంత చిన్నచూపా.. వాట్సాప్‌పై సుప్రీంకోర్టు ధ్వజం
17-02-2021

వాట్సాప్ ను వెంటాడుతూ ఉన్న ప్రైవసీ వివాదాలు
16-02-2021
ఇంకా