newssting
Radio
BITING NEWS :
ఏపీలో జరుగుతున్న విగ్రహాల విధ్వంసాల వెనుక బీజేపీ నేతల ప్రమేయం ఉన్నట్లు ప్రకటించిన డీజీపీ గౌతమ్ సవాంగ్. డీజీపీ వ్యాఖ్యలపై సోము వీర్రాజు అభ్యంతరం, వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్. పోలీసుల నుంచి స్పందన లేకపోవడంతో ఆందోళనకు సిద్ధమైన బీజేపీ నేతలు. 200 మంది బీజేపీ కార్యకర్తలు అరెస్ట్, మంగళగిరి పీఎస్ కు తరలింపు. * కృష్ణాజిల్లా కంచికచర్లలో హవాలా నగదు కలకలం. సరైన పత్రాలు లేకుండా హైదరాబాద్ నుంచి విజయవాడ తరలిస్తున్న కోటి రూపాయల నగదు స్వాధీనం, ఒకరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. * తిరుపతిలో టీడీపీ ధర్మపరిరక్షణ యాత్రకు అనుమతి రద్దు. ర్యాలీకి నిబంధనలు పాటించలేదని అనుమతి రద్దు చేసిన పోలీసులు. విజయసాయిరెడ్డిని ఏ చట్టం కింద రామతీర్థానికి అనుమతించారని ప్రశ్నించిన చంద్రబాబు. * హాలీవుడ్ నటుడు టామ్ హాంక్స్ ఆధ్వర్యంలో సెలబ్రేటింగ్ అమెరికా కార్యక్రమం ప్రారంభం. * కూకట్ పల్లిలో దారుణం. టీవీ చూస్తున్న కన్నకొడుకుని దారుణంగా హతమార్చిన తండ్రి. ఈ నెల 18న కొడుకు చరణ్ కు నిప్పుపెట్టిన తండ్రి. తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చికిత్సపొందుతూ గురువారం ఉదయం చరణ్ మృతి. * హుజూరాబాద్ లో కుటుంబ కలహాల నేపథ్యంలో భార్య, కూతురిని హతమార్చిన భర్త. పరారీలో ఉన్న నిందితుడు వెంకటేష్.

వర్క్ ఫ్రం హోంతో జియోకు లాభాల పంట

03-01-202103-01-2021 15:46:17 IST
Updated On 03-01-2021 19:44:12 ISTUpdated On 03-01-20212021-01-03T10:16:17.040Z03-01-2021 2021-01-03T10:01:26.254Z - 2021-01-03T14:14:12.303Z - 03-01-2021

వర్క్ ఫ్రం హోంతో జియోకు లాభాల పంట
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కరోనా నేపథ్యంలో వర్క్ ప్రమ్ హోమ్ పనివిధానం అటు కంపెనీలకు, ఇటు ఉద్యోగులకు కూడా ఉభయతారకంగా ఉన్నట్లు వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే బ్రాడ్ బ్యాండ్ సేవలు అందిస్తున్న కంపెనీలు ఈ వర్క్ ప్రమ్ హోమ్ ద్వారా లాభాల పంటను పోగు చేసుకుంటున్నట్లు తాజా సమాచారం. దీంట్లో కూడా గరిష్ట లాభం పొందుతోంది జియో బ్రాడ్ బ్యాండ్ మాత్రమేనని కొత్తగా తెలియవచ్చింది. 

తక్కిన ప్రపంచంతోపాటు భారత దేశంలోను గత 10 నెలలుగా వర్క్ ఫ్రం హోం సంప్రదాయం నడుస్తోంది. కరోనా భయంతో అధిక శాతం మంది ఉద్యోగులు ఇంటి నుంచే విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ క్రమంలో కేబుల్ బ్రాడ్‌బ్యాండ్‌కు డిమాండ్ భారీగా పెరిగింది. అయితే.. దీని కారణంగా అత్యధికంగా లాభపడ్డది మాత్రం జియో బ్రాడ్‌బ్యాండేనని ట్రాయ్ గణాంకాలు చెబుతున్నాయి. 

గత ఆరు నెలల్లో జియో బ్రాడ్ బ్యాండ్ సంస్థ ఏకంగా 8 లక్షల మంది కేబుల్ బ్రాడ్‌బ్యాండ్ కస్టమర్లను చేర్చుకుందని తాజాగా వెల్లడైంది. జియోకు ప్రధాన పోటీదారైన ఎయిర్‌టెల్ మాత్రం కేవలం 2.30 లక్షల మంది కొత్త సబ్‌స్క్రైబర్లనే చేర్చుకోగలిగింది. మరో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే..ప్రభుత్వ రంగం సంస్థ బీఎస్ఎన్ఎల్ కూడా ఎయిర్ టెల్‌కు సమానంగా దాదాపు 2.20 లక్షల కొత్త వినియోగదారులను పొందింది. 

ట్రాయ్ గణాంకాల ప్రకారం..ఏప్రిల్‌లో జియో కేబుల్ బ్రాడ్ బ్యాండ్ సబ్‌స్క్రైబర్ల సంఖ్య 0.90 మిలియన్లు కాగా.. ఆక్టోబర్ నాటికి ఈ సంఖ్య అమాంతం 1.10 మిలియన్లకు చేరుకుంది. అతి తక్కువ ధరల్లో జియో అందిస్తున్న ప్యాకేజీలే ఈ దూకుడుకు కారణమని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 

ప్రస్తుతం భారత్‌లో కనిపిస్తున్న ఇంటర్నెట్ విప్లవం అధిక శాతం మొబైల్ ఫోన్ల వినియోగం ద్వారానే జరుగుతోంది. దేశంలో కేబుల్ బ్రాడ్ బ్యాండ్ సబ్‌స్క్రైబర్ల సంఖ్య కేవలం 2.1 కోట్లే. మొబైల్ కనెక్షన్ల సంఖ్య మాత్రం ఏకంగా 70 కోట్లు. అయితే..ప్రస్తుత మున్న వర్క్ ఫ్రం హోం సంప్రదాయం కారణంగా కేబుల్ బ్రాడ్ బ్యాండ్ వినియోగదారుల సంఖ్య వేగంగా పెరుగుతోందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.

 

వాట్సప్ కు భారత్ వార్నింగ్

వాట్సప్ కు భారత్ వార్నింగ్

   19-01-2021


ఫ్లిప్ కార్ట్ సూపర్ కాయిన్స్ ను ఇకపై అలా కూడా వాడుకోవచ్చట..!

ఫ్లిప్ కార్ట్ సూపర్ కాయిన్స్ ను ఇకపై అలా కూడా వాడుకోవచ్చట..!

   18-01-2021


ఫేస్‌బుక్, ట్విట్టర్‌కు పార్లమెంటరీ ప్యానెల్ పిలుపు

ఫేస్‌బుక్, ట్విట్టర్‌కు పార్లమెంటరీ ప్యానెల్ పిలుపు

   18-01-2021


వాట్సాప్ యూటర్న్.. మే 15 వరకు కొత్త ప్రైవసీ విధానం లేదు

వాట్సాప్ యూటర్న్.. మే 15 వరకు కొత్త ప్రైవసీ విధానం లేదు

   17-01-2021


వాట్సాప్.. వెనకడుగు వేయకతప్పలేదు

వాట్సాప్.. వెనకడుగు వేయకతప్పలేదు

   17-01-2021


వాట్సాప్ గోప్యత మార్పుతో సిగ్నల్, టెలిగ్రాం పంట పండినట్లే

వాట్సాప్ గోప్యత మార్పుతో సిగ్నల్, టెలిగ్రాం పంట పండినట్లే

   15-01-2021


ఎయిర్ పోడ్స్ ఛార్జింగ్ కోసం సరికొత్త మొబైల్ కేస్ ను తీసుకుని రానున్న యాపిల్

ఎయిర్ పోడ్స్ ఛార్జింగ్ కోసం సరికొత్త మొబైల్ కేస్ ను తీసుకుని రానున్న యాపిల్

   14-01-2021


వాట్సాప్‌కు ప్రత్యామ్నాయంగా 21 బెస్ట్ యాప్‌లు

వాట్సాప్‌కు ప్రత్యామ్నాయంగా 21 బెస్ట్ యాప్‌లు

   13-01-2021


యూట్యూబ్ నుంచి కూడా ట్రంప్ ఔట్

యూట్యూబ్ నుంచి కూడా ట్రంప్ ఔట్

   13-01-2021


ప్రాణం పోవడానికి కారణం అయిన గూగుల్ మ్యాప్స్..?

ప్రాణం పోవడానికి కారణం అయిన గూగుల్ మ్యాప్స్..?

   13-01-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle