గూగుల్ కు షాక్ ఇచ్చేలా ఇస్రో మ్యాప్స్
13-02-202113-02-2021 17:55:34 IST
Updated On 13-02-2021 18:08:49 ISTUpdated On 13-02-20212021-02-13T12:25:34.196Z13-02-2021 2021-02-13T12:24:59.667Z - 2021-02-13T12:38:49.495Z - 13-02-2021

మనం ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్లాలని అనుకుంటే ఒకప్పుడు ఊర్లో ఉన్న వాళ్ళను అడుగుతూ వెళ్లే వాళ్ళం..! కానీ ఇప్పుడంతా గూగుల్ యాప్స్ మీదనే ఆధారపడుతూ ఉంటున్నాం. గూగుల్ కు ప్రత్యామ్నాయంగా భారత్ స్వదేశీ పరిజ్ఞానంతో మ్యాప్స్ ను తీసుకుని రావడానికి చాలా రోజులుగా ప్రయత్నిస్తూ ఉంది. తాజాగా ఇస్రో ఆ విషయంలో గుడ్ న్యూస్ చెప్పింది. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో), మ్యాప్ మై ఇండియాలు కలిసి దేశీ మ్యాప్స్ యాప్ ను తీసుకురాబోతున్నాయి. ఇందుకు సంబంధించిన ఒప్పందం రెండు సంస్థల మధ్య జరిగిందని మ్యాప్ మై ఇండియా సీఈవో, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రోహన్ వర్మ తెలిపారు. మ్యాపింగ్ సైట్, భూమికి సంబంధించిన సేవలను అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. ఆత్మనిర్భర్ భారత్ ను ఇది మరింత ముందుకు తీసుకెళ్తుందని అంటున్నారు. భవిష్యత్ లో విదేశీ యాప్ లపై ఆధారపడాల్సిన అవసరం రాదని.. గూగుల్ మ్యాప్స్, గూగుల్ ఎర్త్ వంటి వాటిని వదిలేసి దేశీ యాప్స్ ను వాడుకునే వెసులుబాటు వస్తుందని రోహన్ వర్మ భరోసా ఇచ్చారు. మ్యాప్ మై ఇండియా మాతృ సంస్థ అయిన సీఈ ఇన్ఫోసిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ తో ఇస్రో శుక్రవారం ఒప్పందం చేసుకుంది. ఒప్పందంలో భాగంగా ఇస్రో నావిక్, మ్యాప్ మై ఇండియాకు చెందిన వెబ్ సర్వీసెస్ అండ్ అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ ఫేస్, భువన్, వేదాస్, మోస్దాక్ వంటి భూ పరిశీలనా సమాచార వ్యవస్థ ద్వారా అధునాతన మ్యాప్ లను తయారు చేస్తామని ఇస్రో తెలిపింది. డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ (డీవోఎస్), మ్యాప్ మై ఇండియా మాతృసంస్థ సీఈ ఇన్ఫో సిస్టమ్స్‌తో గురువారం ఒప్పందం కుదిరినట్టు ఇస్రో వెల్లడించింది. అనేక కంపెనీలు గూగుల్ సహకారంతో మనం ఉన్న లొకేషన్‌ను బట్టి ప్రకటనలు గుప్పిస్తున్నాయి. ప్రకటనల ఆదాయం కోసం గూగుల్ మన సమాచారాన్ని కంపెనీలకు ఇస్తోంది. ఇది వ్యక్తిగత సమాచార భద్రతకు ఎంతో ముప్పుగా మారనుంది. అందుకే గూగుల్ మ్యాప్స్‌కు ప్రత్యామ్నాయంగా, పూర్తి స్వదేశీ సాంకేతికతతో భారతీయులకు నావిగేషన్, మ్యాప్స్ సేవలను అందించేందకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ, మ్యాప్ మై ఇండియా ఒక్కటయ్యాయి.

స్పెక్ట్రమ్ వేలంలో భారీ బిడ్లు.. టాప్ బయ్యర్‌గా రిలయెన్స్
03-03-2021

ఐదేళ్ల తర్వాత టెలికాం స్పెక్ట్రమ్ వేలం.. జియో దూకుడు..!
03-03-2021

గూగుల్ మెసేజీలకు షెడ్యూల్ పెట్టుకునే అవకాశం కూడా..!
02-03-2021

పీఎస్ఎల్వీ సీ51.. భారత్ ఖ్యాతిని మరింత పెంచుతూ..!
28-02-2021

రెండేళ్లు ఫ్రీ కాల్స్, ఇంటర్నెట్.. జియో సంచలన ఆఫర్
27-02-2021

ఓటీటీల విషయంలో క్లారిటీ ఇచ్చిన కేంద్రం..!
26-02-2021

ఒకే ఒక్క ట్వీట్ లక్ష కోట్లు ఆవిరయ్యేలా చేసింది..!
23-02-2021

చంద్రయాన్-3 వాయిదా
22-02-2021

వాట్సాప్ కు పోటీగా సందేశ్.. క్లిక్ అయ్యేనా..?
19-02-2021

మార్స్ గ్రహంపై నాసా రోవర్.. ఆపరేషన్ లీడ్‌గా స్వాతి మోహన్
19-02-2021
ఇంకా