newssting
Radio
BITING NEWS :
అమెరికాలోని కుంబా ప్రాంతంలో తుపాకులతో దాడులు. పాఠశాలపై దాడులకు పాల్పడిన దుండగులు. 8 మంది చిన్నారులు దుర్మరణం. ఇంతవరకూ దాడికి గల కారణాలపై నో క్లారిటీ. వేర్పాటువాదుల పనైఉంటుందని అనుమానిస్తున్న పోలీసులు. * ఇంద్రకీలాద్రిపై ఘనంగా దసరా ఉత్సవాలు. ఆఖరిరోజు శ్రీ రాజరాజేశ్వరీ దేవి అలంకరణలో దర్శనమిస్తున్న దుర్గమ్మవారు. అమ్మవారి దర్శనం కోసం బారులు తీరిన భక్తులు. * దుర్గమ్మను దర్శించుకున్న కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. దసరా సందర్భంగా విజయవాడలో బీజేపీ కార్యాలయాన్ని ప్రారంభించిన కిషన్ రెడ్డి. రాష్ట్రంలో బీజేపీ బలపడుతుందన్న కేంద్ర మంత్రి. * రానున్న 4 రోజుల్లో ఏపీకి భారీ వర్షాలు. * సికింద్రాబాద్ ముత్యాలమ్మ ఆలయం వద్ద పేలుడు. ఆలయం సమీపంలోని చెత్తకుప్పలో పేలిన పెయింట్ డబ్బా, వ్యక్తికి గాయాలు. * వనపర్తి జిల్లా గోపాల్ పేట మండలం బుద్దారం గ్రామంలో విషాదం. భారీ వర్షాలకు నానిపోయిన ఇంటి పై కప్పు కూలి ఐదుగురు దుర్మరణం, ఇద్దరికి తీవ్రగాయాలు. * తెలంగాణ రాష్ట్ర ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్.

యాపిల్ ఐఫోన్ 12 సిరీస్ ఆగయా.. ధర భారీగానే

14-10-202014-10-2020 19:23:09 IST
2020-10-14T13:53:09.008Z14-10-2020 2020-10-14T13:49:55.717Z - - 26-10-2020

యాపిల్ ఐఫోన్ 12 సిరీస్ ఆగయా.. ధర భారీగానే
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

యాపిల్ ఈవెంట్ ఈ ఏడాది ఆన్ లైన్ లోనే నిర్వహించారు. ముఖ్యంగా యాపిల్ విడుదల చేసే ఐఫోన్ 12 సిరీస్ మీదనే మొబైల్ ఫోన్ వినియోగదారుల కళ్లు ఉన్నాయి.  ఐఫోన్ 12 సిరీస్‌లో నాలుగు 5 జీ ఆధారిత ఫోన్లను  విడుదల చేశారు.  ఐఫోన్ 12, ఐఫోన్ 12 మినీ, ఐఫోన్ 12 ప్రొ, ఐఫోన్ 12 ప్రొ మ్యాక్స్ మోడల్స్ కోసం ఐఫోన్ అభిమానులు కళ్లు కాయలు కాసేలా ఎదురుచూశారు. 

ఐఫోన్ 12, ఐఫోన్ 12 మినీ 64 జీబీ, 128 జీబీ, 256 జీబీ వేరియంట్స్‌లలో, బ్లూ, గ్రీన్, బ్లాక్, వైట్, ప్రొడక్ట్ (రెడ్) రంగుల్లో అందుబాటులో ఉన్నాయి.  వీటి ప్రారంభ ధర రూ. వరుసగా 79,900, రూ. 69,900గా పేర్కొంది. ఐఫోన్ 12 ప్రొ, ఐఫోన్ 12 ప్రొ మ్యాక్స్‌లు 128 జీబీ, 256 జీబీ, 512 జీబీ అంతర్గత మెమొరీతో గ్రాఫైట్, సిల్వర్, గోల్డ్, పసిఫిక్ బ్లూ రంగుల్లో అందుబాటులో ఉన్నాయి. వీటి ప్రారంభ ధర వరుసగా రూ. 1,19,900, రూ. 1,29,900. ఈ మొబైల్స్ లో యాపిల్ సరికొత్త ఏ14 బయానిక్‌ చిప్‌ను అమర్చారు. ఐఫోన్ మినీలో 5.4 అంగుళాల సూపర్ రెటీనా ఎక్స్‌డీఆర్ డిస్‌ప్లే ఉపయోగించగా, ఐఫోన్ 12లో 6.1 అంగుళాల డిస్‌ప్లే అమర్చారు. ప్రొ మోడల్‌ ఫోన్లలో 6.1 అంగుళాల స్క్రీన్, ప్రొ మ్యాక్స్‌లో 6.7 అంగుళాల రెటీనా డిస్‌ప్లే ఉంది. 12 ప్రొలో 12 ఎంపీ అల్ట్రావైడ్, 12 వైడ్ యాంగిల్ లెన్స్ 12 టెలిఫొటో లెన్స్ అమర్చారు. ఈ రెండు ఫోన్లు డీప్ ఫ్యూజన్ కెమెరా ఫీచర్‌తో వస్తున్నాయి. ఐఫోన్ 12 ప్రొలో మరింత అధునాతన కెమెరాలు ఉపయోగించారు. ఐఫోన్ 12 ప్రొ ఫోన్‌తో డాల్బీ విజన్ హెచ్‌డీఆర్ వీడియోలను రికార్డు చేసుకోవచ్చు.  

ధరల వివరాలు: ఐఫోన్ 12 మినీ 64 జీబీ స్టోరేజీ వేరియంట్ ధర రూ. 69,900 కాగా, 128 జీబీ ఆప్షన్ ధర రూ. 74,900, 256 జీబీ వేరియంట్ ధర రూ. 84,900 మాత్రమే. ఐఫోన్ 12 64 జీబీ స్టోరేజీ వేరియంట్ ధర రై. 79,900 కాగా, 128 జీబీ స్టోరేజీ ఆప్షన్ ధర రూ. 84,900. 256 జీబీ వేరియంట్ ధర రూ. 94,900. ఐఫోన్ 12 ప్రొ 128 జీబీ స్టోరేజీ ఫోన్ ధర రూ. 1,19,900, ఐఫోన్ 12 ప్రొ 256 స్టోరేజీ వేరియంట్ ధర రూ. 1,29,900, ఐఫోన్ 12 ప్రొ 512 జీబీ స్టోరేజీ ఆప్షన్ ధర రూ. 1,49,900గా పేర్కొంది. ఐఫోన్ 12 ప్రొ మ్యాక్స్ 128 జీబీ స్టోరేజీ వేరియంట్ ధర రూ. 1,29,900 కాగా, 256 జీబీ ఆప్షన్ ధర రూ. 1,39,900, 512జీబీ స్టోరేజీ ఆప్షన్ ధర రూ. 1,59,900.

భారత్‌లోని వినియోగదారులకు ఈ నెల 30 నుంచి ఇవి అందుబాటులోకి రానున్నాయి. వీటితోపాటు రూ. 9,900 ధరతో హోంపాడ్ ‌ను కూడా యాపిల్ ప్రకటించింది. స్మార్ట్ స్పీకర్స్ యుద్ధం లోకి హోంపాడ్ ద్వారా యాపిల్ ప్రవేశించింది.  

 


Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle