newssting
Radio
BITING NEWS :
* ఏపీ లో వివాదంగా మారిన గీతం వర్సిటీ కట్టడాల కూల్చివేత, అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం జీవీఎంసీ, గీతం వర్సిటీ యాజమాన్యం మధ్య ల్యాండ్ వార్ * హైదరాబాద్: నేపాల్ గ్యాంగ్ ను అరెస్ట్ చేసిన రాచకొండ పోలీసులు, నాచారం లో జరిగిన చోరీ కేసులో నేపాల్ ముఠా అరెస్ట్ * జూరాల ప్రాజెక్ట్ వరద ఉదృతి, 6 గేట్లు ఎత్తివేత ఇన్ ఫ్లో 92,800 క్యూసెక్కులు, అవుట్ ఫ్లో 94,721 క్యూసెక్కులు * ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ కు సిపిఐ నేత రామకృష్ణ లేఖ అమరావతి రైతులపై అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపడం తగదు

పండ్ల‌యందు యాపిల్ ధ‌ర వేరు.. ఫోన్ల‌యందు యాపిల్ ఫోన్ వేరు

15-10-202015-10-2020 10:09:55 IST
Updated On 15-10-2020 10:10:21 ISTUpdated On 15-10-20202020-10-15T04:39:55.204Z15-10-2020 2020-10-15T04:39:53.547Z - 2020-10-15T04:40:21.458Z - 15-10-2020

పండ్ల‌యందు యాపిల్ ధ‌ర వేరు.. ఫోన్ల‌యందు యాపిల్ ఫోన్ వేరు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

మామూలు ల్యాప్ టాప్ లు నాలుగైదు కొనొచ్చు.. యాపిల్ ల్యాప్ టాప్ లు కూడా ఒక‌టో రెండో కొనొచ్చు. అంత రేటుంది యాపిల్ ఫోన్ ధ‌ర‌. ఏకంగా ల‌క్షా 30 వేలు అంటే మాట‌లా చెప్పండి. ఇప్ప‌టి వ‌ర‌కూ యాపిల్ 11 తో బ్రాండెడ్ గా తిరిగిన యాపిల్ ఫ్యాన్స్.. ఇప్పుడు ఐఫోన్ 12 పై కాన్సంట్రేట్ చేశారు. ఎప్పుడెప్పుడు మార్కెట్ లోకి వ‌స్తుందా.. తీసేసుకుందామా అని ఈగ‌ర్ గా వెయిటింగ్.

హాయ్ స్పీడ్ తో ప్రోగ్రామ్ ఏర్పాటు చేసిన యాపిల్.. ఐ ఫోన్ 12 ను లాంచ్ చేసింది. ఈసారి కాస్త సింపుల్ గా లాంచ్ చేసినా.. ఫోన్ ల కెపాసిటీ.. వాటి కాస్ట్ లో మాత్రం యాపిల్ బ్రాండ్ మార్క్ చూపించింది. 11 మోడ‌ల్ వాడే వాళ్లు కూడా టెమ్ట్ అయ్యి కొనేలాంటి ఫీచ‌ర్ల‌తో రెడీ చేసింది. ఐ ఫోన్ 12, ఐ ఫోన్ 12 ప్రో, ఐ ఫోన్ ప్రో మ్యాక్స్, ఐ ఫోన్ 12 మినీను లాంచ్ చేసింది. మ‌న ఇండియా టైం ప్ర‌కారం మంగ‌ళ వారం రాత్రి హాయ్ స్పీడ్ అనే పేరుతో ఈవెంట్ కండ‌క్ట్ చేసి.. ఈ కొత్త ఫోన్ల‌ను ఆవిష్క‌రించింది. ఇప్ప‌టి వ‌ర‌కూ ఉన్న ఐ ఫోన్ డిస్ ప్లే ల‌లో ఐ ఫోన్ 12 అండ్ ఐ ఫోన్ 12 ప్రో డిస్ ప్లే సైజులే ఎక్కువ‌. ఐ ఫోన్ 12 డిస్ ప్లే..6.5 అంగుళాలు కాగా.. ఐ ఫోన్ 12 ప్రో డిస్ ప్లే.. 6.7 అంగుళాలు. 12 మినీ మాత్రం 5.4 అంగుళాలే. అన్ని మోడ‌ళ్లు ఐదు క‌ల‌ర్స్ లో రానున్నాయి. డిస్ ప్లే కూడా ఎక్స్ డీ ఆర్ డిస్ ప్లే తో రెడీ అయ్యాయి. ఫ్రంట్ కెమెరాలో నైట్ మోడ్ కూడా ఉంటుంది. 5 జీ తో ప‌నిచేసే ఈ ఫోన్ల వెనుక‌.. మాగ్ సేఫ్ ఉంటుంది.

ఈ నెల 30 నుంచి ఐ ఫోన్ 12 మినీ 69, 900.. ఐ ఫోన్ 12 ధ‌ర 79, 900.. ఐ ఫోన్ ప్రో ధ‌ర 1,19,900 కాగా.. ఐ ఫోన్ ప్రో మ్యాక్స్ ధ‌ర 1,29,900 రేటుతో అమ్మ‌నున్నారు.

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle