newssting
Radio
BITING NEWS :
బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల తొలి దశలో 55.69 శాతం పోలింగ్‌ నమోదైనట్టు తెలిపిన ఎన్నికల కమిషన్‌. కరోనా వైరస్‌ భయాలు ఉన్నప్పటికీ పోలింగ్‌ మాత్రం ఇంతకు ముందుకన్నా ఎక్కువే నమోదైనట్టు తెలుస్తోంది. తొలి దశలో 16 జిల్లాల్లో విస్తరించిన 71 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరిగగా సంబంధిత నియోజకవర్గాల్లో గతంలోకంటే ఈసారి పోలింగ్ శాతం అధికంగా నమోదు * తమ పార్టీ తరఫున బరిలో నిలిచిన రాంజీ గౌతమ్‌ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్న ఏడుగురు ఎమ్మెల్యేలను బీఎస్పీ అధినేత్రి మాయావతి గురువారం పార్టీ నుంచి సస్పెండ్‌ చేశారు. కీలకమైన రాజ్యసభ ఎన్నికల సమయంలో ఎస్పీ తీర్థం పుచ్చుకోవడానికి వీరు ప్రయత్నిస్తున్నట్టు తెలియగానే ఆమె ఈ నిర్ణయం తీసుకొన్నారు * కార్మిక నాయకుడు, మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి ముఖ్య సహచరుడు ఎస్‌.బీ మోహన్‌రెడ్డి(78) గురువారం తెల్లవారుజామున మరణించారు. ఆరునెలల నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న మోహన్‌ రెడ్డి ఆరోగ్యం విషమించగా ఆంధ్రమహిళా సభ దవాఖానలో చేర్పించగా చికిత్స పొందుతూ మృతి చెందారు * జమ్ముకశ్మీర్‌లోని కుల్గాం జిల్లాలోని వైకే పొరా ప్రాంతంలో గురువారం సాయంత్రం ఉగ్రవాదులు కాల్పులు జరిపి ముగ్గురు స్థానిక బీజేపీ నేతల ప్రాణాలు తీశారు. పాకిస్థాన్‌ ఇంటెలిజన్స్‌ ఏజెన్సీ మద్దతున్న రెసిస్టంట్‌ ఫ్రంట్‌ ఉగ్రవాద సంస్థ ఈ దాడికి బాధ్యతవహిస్తూ ప్రకటన చేసిందని పోలీసులు చెప్పారు * తూర్పుగోదావరి జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. గోకవరం మండలం తంటికొండ వెంకటేశ్వర ఆలయం ఘాట్‌ రోడ్డులో శుక్రవారం తెల్లవారుజామున పెళ్లి బృందానికి చెందిన మినీ వ్యాన్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు * డోసుల కొరత కారణంగా.. స్పుత్నిక్‌-వి టీకా మూడో దశ ట్రయల్స్‌ను రష్యా తాత్కాలికంగా నిలిపివేసింది. నవంబరు 10వ తేదీ నుంచి ట్రయల్స్‌ను పునరుద్ధరించనున్నారు. గమలేయా రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌, రష్యన్‌ రక్షణ మంత్రిత్వ శాఖ అభివృద్ధి చేసిన స్పుత్నిక్‌-వి టీకాను రష్యా ఆగస్టు నెలలో నమోదు చేసింది * మద్యం ధరలను క్రమబద్ధీకరిస్తూ ఏపీ ప్రభుత్వం గురువారం ఆదేశాలు జారీ చేసింది. సవరించిన ధరలు ప్రీమియం, మీడియం బ్రాండ్లకు వర్తించేలా ఉత్తర్వులిచ్చింది. ఇవి శుక్రవారం నుంచి అమల్లోకి వస్తాయని ఆదేశాల్లో పేర్కొంది * మిలాద్‌ ఉన్‌ నబీ ఉత్సవాలు, ర్యాలీ సందర్భంగా పాతబస్తీలో పోలీసులు బందోబస్తు చర్యలు చేపట్టారు. ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు.

ఇంస్టాగ్రామ్ లో బగ్.. ఆ ఫోటోను క్లిక్ చేస్తే అంతే సంగతులు..!

26-09-202026-09-2020 18:23:15 IST
2020-09-26T12:53:15.865Z26-09-2020 2020-09-26T12:52:46.202Z - - 30-10-2020

ఇంస్టాగ్రామ్ లో బగ్.. ఆ ఫోటోను క్లిక్ చేస్తే అంతే సంగతులు..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

ఇటీవలి కాలంలో  ప్రముఖ ఫోటో షేరింగ్ యాప్ ఇన్ స్టాగ్రామ్ ను వాడుతున్న వారే చాలా ఎక్కువగా ఉన్నారు. జస్ట్ ఫోటోలు, వీడియోలు అప్లోడ్ చేసుకుంటూ.. అవసరమైన సెలెబ్రిటీలని ఫాలో చేస్తూ.. మీమ్స్ చదువుకుంటూ గడిపేయొచ్చు అని అనుకుంటూ ఉంటారు. అందుకే విపరీతామైన ఆదరణ ఇంస్టాగ్రామ్ కు పెరిగిపోయింది. అలాగే ఇంస్టాగ్రామ్ మీద హ్యాకర్లు కూడా ఎక్కువగానే దృష్టి పెట్టారు. అకౌంట్స్ ను హ్యాక్ చేయడమే పనిగా పెట్టుకున్న వాళ్లు కూడా ఉన్నారు. తాజాగా అందులో  సరికొత్త బగ్ ప్రవేశించింది. 

సైబర్ సెక్యూరిటీ నిపుణులు అంచనా ప్రకారం ఈ బగ్ సాయంతో ప్రపంచంలో ఎక్కడ్నించి అయినా ఇన్ స్టాగ్రామ్ లోని అకౌంట్లలో అనుమతి లేకుండా ప్రవేశించవచ్చట. అలా జేపీఈజీ ఫార్మాట్ లో వచ్చిన ఫోటో మీద ఒక సారి క్లిక్ చేసి.. మళ్ళీ ఇంస్టాగ్రామ్ ను ఓపెన్ చేస్తే రిమోట్ యాక్సెస్ టూల్ అన్నది మొబైల్ లోకి చేరిపోయినట్లు..! 

నెటిజన్ల పర్సనల్ మెసేజ్ లు చదవడంతో పాటు, యూజర్ల టైమ్ లైన్ లో ఏదైనా పోస్టు చేసే అవకాశం ఉంది. వారి కాల్ లిస్టు, కెమెరా, లొకేషన్ సమాచారం ఈ బగ్ అధీనంలోకి వెళ్లనున్నాయి. హ్యాకర్లు ముందుగా జేపీఈజీ ఫార్మాట్ లో ఉన్న ఓ ఇమేజ్ పంపుతారు. ఆ ఇమేజ్ ను ఎవరైనా డౌన్ లోడ్ చేసుకున్నారంటే  బగ్ ఎంట్రీ ఇచ్చెసినట్లే..! హ్యాకర్లు ఏదైనా చేసే అవకాశం ఉంటుంది. ఈ విషయమై సైబర్ నిపుణులు ఇన్ స్టాగ్రామ్ మాతృసంస్థ ఫేస్ బుక్ ను అప్రమత్తం చేయడంతో బగ్ నివారణకు అవసరమైన చర్యలు తీసుకుంది. సైబర్ అటాక్స్ జరుగుతూనే ఉంటాయని.. సంస్థలు మాత్రమే కాదు, యూజర్లు కూడా చాలా అప్రమత్తంగా ఉండాలని నిపుణులు చెబుతూ ఉన్నారు. 


Shivakrishna D


Senior Video Editor, Shivakrishna Devasani has been working with major media houses for the last decade and half. He has been chosen as a special editor for senior journalist Satish Babu's signature program- 'Journalist Diary'. He specialises with feature programmes on current affairs and politics. Over the years, he has trained many budding video editors with many of them working now in electronic media.
 skd@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle