మరో 43 యాప్ లపై కొరడా ఝుళిపించిన భారత ప్రభుత్వం
25-11-202025-11-2020 07:31:36 IST
Updated On 25-11-2020 08:06:41 ISTUpdated On 25-11-20202020-11-25T02:01:36.993Z25-11-2020 2020-11-25T02:01:32.500Z - 2020-11-25T02:36:41.662Z - 25-11-2020

పౌరుల వ్యక్తిగత సమాచార భద్రత, దేశ సార్వభౌమత్వం, సమగ్రతలకు భంగం వాటిల్లితే ఎలాంటి చర్యలకైనా దిగుతామని కేంద్రం ఇప్పటికే స్పష్టం చేసింది. అయినా కూడా కొన్ని చైనా యాప్స్ భారతీయుల సమాచారాన్ని దొంగిలిస్తూ ఉన్నాయి. ఇప్పటికే పలు యాప్స్ ను నిషేధించిన కేంద్ర ప్రభుత్వం తాజగా మరో 43 చైనా మొబైల్ యాప్స్‌పై నిషేధం విధించింది. భారత ప్రభుత్వం బ్యాన్ చేసిన యాప్స్ లో అలీబాబా గ్రూప్‌కి చెందిన ఈ కామర్స్ యాప్ అలీ ఎక్స్‌ప్రెస్ కూడా ఉండడం విశేషం. మరికొన్ని డేటింగ్ యాప్‌లపై నిషేధం విధిస్తూ మంగళవారం ఉత్వర్వులు జారీ చేసింది. ఈ యాప్‌లు దేశ సార్వభౌమత్వానికి, ప్రాదేశిక సమగ్రతకు ముప్పుగా ఉన్నందున కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ నిషేధం విధించింది. కేంద్ర హోంశాఖ, ఇండియన్ సైబర్ క్రైమ్ కో ఆర్డినేషన్‌కు అందిన సమాచారాన్ని క్రోడీకరించి దేశ భద్రతను దృష్టిలో ఉంచుకొని చైనా నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తున్న 43 యాప్‌లపై నిషేధం విధించాలని నిర్ణయం తీసుకున్నట్టుగా ఒక అధికారిక ప్రకటనలో తెలిపింది భారత ప్రభుత్వం. భారత ప్రభుత్వం జూన్ 29న తొలిసారిగా చైనాకు చెందిన 59 యాప్‌లపై నిషేధం విధించింది. భారతీయులు వినియోగించే పలు ప్రముఖ యాప్స్ ఈ నిషేధాన్ని ఎదుర్కొన్నాయి. పబ్జి, టిక్‌టాక్ లు కూడా నిషేధాన్ని ఎదుర్కొన్నాయి. జూలై 27న మరో 47 యాప్‌లపై నిషేధం విధించింది. సెప్టెంబర్ 2న మరో 118 యాప్‌లను నిషేధించింది. 43 యాప్‌లతో మొత్తం నిషేధం విధించింది. దీంతో భారత ప్రభుత్వం బ్యాన్ చేసిన చైనా యాప్‌ల సంఖ్య 267కి చేరుకుంది.

వాట్సాప్ గోప్యత మార్పుతో సిగ్నల్, టెలిగ్రాం పంట పండినట్లే
15-01-2021

ఎయిర్ పోడ్స్ ఛార్జింగ్ కోసం సరికొత్త మొబైల్ కేస్ ను తీసుకుని రానున్న యాపిల్
14-01-2021

వాట్సాప్‌కు ప్రత్యామ్నాయంగా 21 బెస్ట్ యాప్‌లు
13-01-2021

యూట్యూబ్ నుంచి కూడా ట్రంప్ ఔట్
13-01-2021

ప్రాణం పోవడానికి కారణం అయిన గూగుల్ మ్యాప్స్..?
13-01-2021

వెనక్కు తగ్గిన వాట్సాప్
12-01-2021

కరోనా టీకా పంపిణీలో కోవిన్ యాప్ ది బెస్ట్
11-01-2021

ప్రపంచంలోనే ధనికుడు ఎలాన్ మస్క్
08-01-2021

పెట్రోల్ బాదుడు మళ్లీ షురూ..ఎలెక్ట్రిక్ వాహనాలే దిక్కా..!
06-01-2021

5జీ స్పీడ్ మామూలుగా లేదు.. సెకనకు 700 ఎంబీల డౌన్ లోడ్
04-01-2021
ఇంకా