newssting
Radio
BITING NEWS :
విజయవాడలో కన్నకూతురిని అమ్మకానికి పెట్టిన తాగుబోతు తండ్రి. విషయం తెలిసి తండ్రిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చిన చైల్డ్ లైన్ అధికారులు. అనంతరం చిన్నారిని తల్లిదండ్రులకు అప్పగించిన పోలీసులు. * తెలుగు రాష్ట్రాల్లో రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో 11 మంది దుర్మరణం. రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో ఇన్నోవా - బోర్ వెల్ లారీ ఢీ. ప్రమాదంలో ఆరుగురు మృతి, ముగ్గురికి తీవ్రగాయాలు. ప్రమాద సమయంలో ఇన్నోవాలో 11 మంది ప్రయాణికులు. మృతులంతా హైదరాబాద్ లోని తాడ్ బన్ కు చెందినవారుగా గుర్తించిన పోలీసులు. * కర్నూల్ జిల్లా గూడూరు వద్ద బైక్ ను ఢీ కొట్టిన ట్రాక్టర్. ముగ్గురు దుర్మరణం, మృతులంతా బ్రాహ్మణదొడ్డికి చెందినవారుగా గుర్తించిన పోలీసులు. * ఖమ్మం జిల్లా కామేపల్లి వద్ద టిప్పర్ - స్కూటీ ఢీ, ఇద్దరు మృతి. * మూడోరోజు ప్రారంభమైన ఏపీ అసెంబ్లీ సమావేశాలు. రాష్ట్రంలో ఇసుక సమస్యపై అసెంబ్లీలో టీడీపీ వాయిదా తీర్మానం.

ఐఫోన్ వర్సెస్ ఆండ్రాయిడ్.. విజేత ఎవరంటే..!

22-10-202022-10-2020 10:34:45 IST
Updated On 22-10-2020 10:43:29 ISTUpdated On 22-10-20202020-10-22T05:04:45.185Z22-10-2020 2020-10-22T05:04:23.467Z - 2020-10-22T05:13:29.275Z - 22-10-2020

ఐఫోన్ వర్సెస్ ఆండ్రాయిడ్.. విజేత ఎవరంటే..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

ఆండ్రాయిడ్ ఫోన్లు గొప్పవా.. యాపిల్ ఐఫోన్లు గొప్పవా..? అంటూ చర్చ ఎప్పటి నుండో జరుగుతూ ఉంది. యాపిల్ యూజర్లు తమ మొబైల్ ఫోన్లు ఆండ్రాయిడ్ కంటే గొప్పగా ఉంటుందని.. పెర్ఫార్మన్స్ సూపర్ అని చెబుతూ ఉంటారు. ఆండ్రాయిడ్ యూజర్లు మాత్రం ఎక్కువ ఫీచర్లు ఆండ్రాయిడ్ లోనే ఉంటాయని.. అది కూడా అతి తక్కువ ధరకే మంచి మంచి ఫీచర్లు అందుబాటులో ఉంటాయని అన్నారు. యాపిల్ ఫోన్ కు పెట్టే డబ్బుల్లో సగం డబ్బు ఆండ్రాయిడ్ ఫోన్ కు పెడితే చాలని అంటూ ఉంటారు. రెండు ప్లాట్ ఫామ్ లకు ఫాలోవర్లు ఉన్నారు. 

తాజాగా ఆండ్రాయిడ్, ఐఓఎస్ మొబైల్స్ కు పెట్టిన పోటీకి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. మొదట '@corylewis04' అనే టిక్ టాక్ యూజర్ 33 సెకెండ్ల నిడివి గల వీడియోను పోస్టు చేశారు. రెండు మొబైల్ ఫోన్లను ఒకటేసారి తాకుతూ.. అందులో ఉన్న యాప్స్ ఏవి త్వరగా ఓపెన్ అవుతాయో పరీక్షించాడు. ఐఓఎస్ మొబైల్ లో కంటే ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్ లోనే యాప్స్ త్వరగా ఓపెన్ అవ్వడం.. వేగంగా పని చేయడం జరిగింది. దీంతో ఆండ్రాయిడ్ యూజర్లు చాలా గొప్పగా చెప్పుకుంటూ ఉన్నారు. 

ట్విట్టర్ లో ఈ వీడియో క్షణాల్లో వైరల్ అయిపోయింది. 25 మిళియన్లకు పైగా ఇప్పటికే ఈ వీడియోను చూశారు. కొన్ని వేల మంది కామెంట్లు చేస్తూ ఉన్నారు. అంతా సరే కానీ యాపిల్ కెమెరాతో మీ ఆండ్రాయిడ్ ఫోన్ కెమెరాలు పోటీ పడతాయా అని ఐఓఎస్ యూజర్లు ప్రశ్నిస్తూ ఉన్నారు. 

  


Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle