newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

25-03-202125-03-2021 16:35:59 IST
Updated On 25-03-2021 17:29:39 ISTUpdated On 25-03-20212021-03-25T11:05:59.964Z25-03-2021 2021-03-25T11:05:47.837Z - 2021-03-25T11:59:39.931Z - 25-03-2021

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

లాక్ డౌన్ కాలంలో ల్యాప్ టాప్ లను విద్యార్థులు, ఉద్యోగులు ఎక్కువగా ఉపయోగిస్తూ ఉన్నారు. దీంతో హెచ్.పి. సంస్థ తక్కువ ధరకే ల్యాప్ టాప్ లను మార్కెట్ లోకి తీసుకుని రావాలని అనుకుంటూ ఉంది. క్రోమ్ బుక్ పేరుతో భారత్ లో ల్యాప్ టాప్ లను ప్రవేశపెడుతోంది. సరికొత్త క్రోమ్ బుక్ ల్యాప్ టాప్ లు 25000 రూపాయల లోపే అందించాలని భావిస్తోంది. ఏప్రిల్ 2021 నుండి ఈ హెచ్.పి. క్రోమ్ బుక్ ల్యాప్ టాప్ లు లభించనున్నాయి. 

ఈ సరికొత్త క్రోమ్ బుక్ ల్యాప్ టాప్ ల ద్వారా విద్యార్థులు హ్యాపీగా చదువుకోవడమే కాకుండా గేమ్స్ కూడా ఆడుకోవచ్చు. ఈ ల్యాప్ టాప్ లలో హెచ్.పి. స్టూడెంట్ ఆప్టిమైజ్డ్ హార్డ్ వేర్, సాఫ్ట్ వేర్, మరికొన్ని యాప్స్ ను ప్రీ ఇన్స్టాల్ చేసి ఉంచారు. ఏప్రిల్ మొదటి వారంలో సరికొత్త రేంజ్ క్రోమ్ బుక్ ల్యాప్ టాప్ లను విడుదల చేయడమే కాకుండా.. అదే నెలలో సేల్స్ కు అవకాశం ఉండనుంది. ఈ ల్యాప్ టాప్ లలో ఎంట్రీ లెవెల్ కాన్ఫిగరేషన్ దగ్గర నుండి హై-ఎండ్ వరకూ ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.

హెచ్.పి. క్రోమ్ బుక్ 11a మోడల్ ను గత ఏడాది హెచ్.పి. క్రోమ్ బుక్ x360 14c తో కలిసి లాంఛ్ చేశారు. హెచ్.పి. క్రోమ్ బుక్ 11a లో Intel Celeron ప్రాసెసర్ తో పాటూ 4GB of RAM, 32GB స్టోరేజ్, Wi-Fi 5 వంటి ఫీచర్స్ తో పాటూ 11.6-inch HD డిస్ప్లే Intel HD Graphics 500 కూడా ఉన్నాయి. క్రోమ్ బుక్ 11a లో వెబ్ క్యామ్ కూడా లభిస్తుంది. గతంలో కూడా హెచ్.పి. సంస్థ పలు ల్యాప్ టాప్ లను లాంఛ్ చేసింది. 2019 లో హెచ్.పి. లో క్రోమ్ బుక్  x360 మోడల్ ను  12-inch, 14-inch స్క్రీన్ ఆప్షన్స్ లో విడుదల చేసింది. మెటాలిక్ బాడీతో వచ్చిన ఈ ల్యాప్ టాప్ ల ధర  30,000 రూపాయల లోనే ఉంది. 

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

   14 hours ago


మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

   07-04-2021


కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

   06-04-2021


ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

   05-04-2021


పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

   01-04-2021


వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

   24-03-2021


ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

   22-03-2021


టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

   20-03-2021


దేశీ రోబోను సృష్టించిన ఐఐటీ ప్రొఫెసర్.. స్పెషాలిటీ ఏమిటంటే

దేశీ రోబోను సృష్టించిన ఐఐటీ ప్రొఫెసర్.. స్పెషాలిటీ ఏమిటంటే

   16-03-2021


నెట్ ఫ్లిక్స్ పాస్ వర్డ్స్ ను పంచుకుంటున్నారా.. రాబోయే రోజుల్లో కష్టమే..!

నెట్ ఫ్లిక్స్ పాస్ వర్డ్స్ ను పంచుకుంటున్నారా.. రాబోయే రోజుల్లో కష్టమే..!

   13-03-2021


ఇంకా

Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle