మోసగాళ్లు.. కేజ్రీవాల్ కుమార్తెను కూడా దోచేశారు
09-02-202109-02-2021 10:27:05 IST
Updated On 09-02-2021 10:14:04 ISTUpdated On 09-02-20212021-02-09T04:57:05.568Z09-02-2021 2021-02-09T02:14:36.920Z - 2021-02-09T04:44:04.651Z - 09-02-2021

ఆన్ లైన్ ద్వారా మోసాలు చేసే వారు ఎంతో మంది ఉన్నారు. చదువుకున్న వాళ్లు.. చదువుకోని వాళ్లు.. అంటూ తేడా లేకుండా సైబర్ మోసగాళ్లు టార్గెట్ చేసి మరీ మోసాలు చేస్తూ ఉంటారు. అకౌంట్లలోని డబ్బులను కూడా క్షణాల్లో స్వాహా చేస్తూ ఉంటారు. చిన్నగా ఓ ఆఫర్ ఇచ్చినట్లే ఇచ్చి దోచేస్తూ ఉంటారు. మనకు లాభం వస్తుంది అని అనుకునే లోపే.. మొత్తం స్వాహా చేయడం కేటుగాళ్ల లక్షణం. వారు చెప్పే మాయమాటలను నమ్మామంటే మొదటికే మోసం వస్తూ ఉంటుంది. సైబర్ నేరగాళ్లతో కాస్త జాగ్రత్తగా ఉండాలని పోలీసులు, ప్రభుత్వం హెచ్చరిస్తున్నా ఎన్నో మోసాలు జరిగిపోతూ ఉన్నాయి. మనం చేసే చిన్న తప్పే సైబర్ నేరగాళ్ల చేతికి అస్త్రంగా మారిపోతూ ఉంటుంది. డబ్బులు పోగుట్టుకున్నాక లబోదిబోమనడం తప్ప చేసేది ఏమీ లేదు. సైబర్ నేరగాళ్ల మాయలో పడి సామాన్యులే కాదు.. సెలెబ్రిటీలు కూడా మోసపోయిన ఘటనలు ఎన్నో ఉన్నాయి. పలువురు రాజకీయ నాయకులు, వారి కుటుంబ సభ్యులు కూడా సైబర్ నేరగాళ్ల వలలో పడ్డారు. తాజాగా ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కుమార్తె హర్షితా కేజ్రీవాల్ కూడా సైబర్ నేరగాళ్ల చేతిలో పడి మోసపోయారు. ఓ కేటుగాడి చేతిలో ఆమె మోసపోయినట్లుగా నేషనల్ మీడియాలో కథనాలు వచ్చాయి. ఓ ప్రముఖ ఆన్ లైన్ పోర్టల్ ద్వారా సెకండ్ హ్యాండ్ సోఫాను అమ్మాలనుకుంది హర్షిత. కొద్ది మొత్తంలో ఆమె అకౌంట్ కు డబ్బును ట్రాన్స్ ఫర్ చేసి ఆమెను నమ్మించాడు. ఆ తర్వాత ఆమె పంపించిన క్యూఆర్ కోడ్ ను ఉపయోగించి ఆమె అకౌంటులో ఉన్న రూ. 34 వేలను దోచేశాడు. డీల్ ఫైనల్ అయిన తర్వాత సదరు వ్యక్తి హర్షిత కేజ్రీవాల్ మొబైల్‌కి ఒక క్యూఆర్ కోడ్ పంపి.. ఆ కోడ్‌ను స్కాన్ చేయగానే మీ అకౌంట్లో డబ్బు జమ అవుతుందని నమ్మించాడు. ఆ వ్యక్తి చెప్పినట్టే క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయగానే.. హర్షిత ఖాతా నుంచి నిందితుని అకౌంట్‌కి 34,000రూపాయలు బదిలీ అయిందని పోలీసులు తెలిపారు. దీనిపై పోలీసులకు హర్షిత ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు.మొదట ఆమెకు నమ్మకం కల్గించేందుకు ఆ ఫ్రాడ్ స్టర్ కొంత తక్కువ సొమ్మును ఆమె ఖాతాలో డిపాజిట్ చేశాడని, ఆ తరువాత రిగ్ చేసిన క్యూ ఆర్ కోడ్ ను వినియోగించి ఆమె అకౌంట్ నుంచి డబ్బును విత్ డ్రా చేశాడని పోలీసులు తెలిపారు.

ప్రపంచంలోనే అతిపెద్ద ఓలా ఈ-స్కూటర్ ఫ్యాక్టరీ.. ఏడాదిలో కోటి యూనిట్ల తయారీ
11 hours ago

ట్వీట్ లో తప్పులకు చెక్ పెట్టొచ్చా..?
06-03-2021

మంచి నిర్ణయం తీసుకున్న రిలయన్స్ సంస్థ.. పలు టెక్ దిగ్గజాలు కూడా..!
05-03-2021

స్పెక్ట్రమ్ వేలంలో భారీ బిడ్లు.. టాప్ బయ్యర్‌గా రిలయెన్స్
03-03-2021

ఐదేళ్ల తర్వాత టెలికాం స్పెక్ట్రమ్ వేలం.. జియో దూకుడు..!
03-03-2021

గూగుల్ మెసేజీలకు షెడ్యూల్ పెట్టుకునే అవకాశం కూడా..!
02-03-2021

పీఎస్ఎల్వీ సీ51.. భారత్ ఖ్యాతిని మరింత పెంచుతూ..!
28-02-2021

రెండేళ్లు ఫ్రీ కాల్స్, ఇంటర్నెట్.. జియో సంచలన ఆఫర్
27-02-2021

ఓటీటీల విషయంలో క్లారిటీ ఇచ్చిన కేంద్రం..!
26-02-2021

ఒకే ఒక్క ట్వీట్ లక్ష కోట్లు ఆవిరయ్యేలా చేసింది..!
23-02-2021
ఇంకా