newssting
Radio
BITING NEWS :
ఈరోజు ప్రపంచ బాల కార్మిక వ్యవస్థ వ్యతిరేక దినోత్సవం * కేంద్ర మంత్రివర్గంలో పునర్వ్యవస్థీకరణ గురించి పలు ఊహాగానాల మధ్య ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం హోంమంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జె పి నడ్డాతో చర్చలు జరిపారు * బెంగాల్, తమిళనాడులలో ఇటీవల సాధించిన విజయాలతో పోల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ ముంబైలో భోజనం కోసం మహారాష్ట్ర రాజకీయ నాయకుడు శరద్ పవార్‌తో సమావేశమయ్యారు * దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 84,332 కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది * దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,93,59,155కి చేరింది. గత 24 గంటల్లో కరోనా బారినపడి 4002 మంది మరణించారు * కష్టపడి పండించిన పంటను అమ్ముకునేందుకు అన్నదాతలు అనేక ఇబ్బందులు పడుతున్నా సీఎం కేసీఆర్‌ పట్టించుకోవట్లేదని దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్‌. రాజశేఖరరెడ్డి తనయ వైఎస్‌ షర్మిల విమర్శించారు * రాష్ట్రంలో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రభుత్వం, పోలీసు శాఖ చేపడుతున్న చర్యలు అభినందనీయమని నోబెల్‌ బహుమతి గ్రహీత, బాలల హక్కుల ఉద్యమకారుడు కైలాష్‌ సత్యార్థి ప్రశంసించారు.

ప్లే స్టోర్ నుండి మూడు పాపులర్ యాప్స్ డిలీట్

24-10-202024-10-2020 15:32:31 IST
Updated On 24-10-2020 15:56:12 ISTUpdated On 24-10-20202020-10-24T10:02:31.368Z24-10-2020 2020-10-24T10:02:22.278Z - 2020-10-24T10:26:12.497Z - 24-10-2020

ప్లే స్టోర్ నుండి మూడు పాపులర్ యాప్స్ డిలీట్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
గూగుల్ ప్లే స్టోర్ పాలసీలను పాటించకుండా ఏవైనా యాప్స్ పని చేస్తూ ఉంటే వాటి మీద కొరడా ఝుళిపిస్తూ ఉంటారు. తాజాగా అలా మూడు పాపులర్ యాప్స్ ను ప్లే స్టోర్ నుండి డిలీట్ చేశారు. ముఖ్యంగా పిల్లల కోసమే రూపొందించిన ఆ యాప్స్ డేటాను దొంగిలిస్తూ ఉన్నాయన్న కారణాలతో డిలీట్ చేశారు. ఇంటర్నేషనల్ డిజిటల్ అకౌంటబిలిటీ కౌన్సిల్ (ఐడిసిఏ) ఈ యాప్స్ విషయంలో ఆందోళన వ్యక్తం చేయడంతో ప్లే స్టోర్ నుండి వాటిని తొలగించారు. 

Princess Salon, Number Coloring, Cats & Cosplay అనే మూడు యాప్స్ ముఖ్యంగా పిల్లల కోసం రూపొందించారు. ఇవి ప్లే స్టోర్ పాలసీలకు వ్యతిరేకంగా పని చేస్తూ ఉన్నాయి. డేటాను సేకరించి థర్డ్ పార్టీలకు చేరవేస్తూ ఉన్నాయని తేలింది. దీంతో వాటిని ప్లే స్టోర్ నుండి తొలగించక తప్పలేదు. 'ఈ యాప్స్ డేటాను థర్డ్ పార్టీలకు అందిస్తూ ఉన్నాయి.. ఇలా జరగడం వలన ఎన్నో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది.. డేటా ఇతరుల చేతుల్లోకి వెళ్లడం చాలా ప్రమాదకరం' అని ఇంటర్నేషనల్ డిజిటల్ అకౌంటబిలిటీ కౌన్సిల్ ప్రెసిడెంట్ క్వెంటిన్ పాల్ఫ్రే తెలిపారు. నిబంధనలను అతిక్రమించినట్లు తెలిసిన వెంటనే తాము చర్యలు తీసుకుంటామని.. గతంలో కూడా పలు యాప్స్ మీద వేటు వేశామని.. భవిష్యత్తులో కూడా నిబంధనలను బేఖాతరు చేసిన యాప్స్ మీద కఠినంగా వ్యవహరిస్తామని గూగుల్ తెలిపింది. పిల్లలకు సంబంధించిన యాప్స్ విషయంలో గూగుల్, యాపిల్ కంపెనీలు చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నాయి. యాప్ డెవలపర్లకు కూడా చాలా సూచనలను చేశాయి. పిల్లలకు సంబంధించిన డేటా ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతరుల చేతుల్లోకి వెళ్లకుండా చర్యలను తీసుకుంటూ ఉన్నారు.  

టెస్లా మోడల్ ఎస్ ప్లాయిడ్‌లోని సైబర్‌పంక్ 2077 'పిఎస్ 5-లెవల్' వద్ద నడుస్తుందా? ఎలోన్ మస్క్ ఏం చెప్పారు?

టెస్లా మోడల్ ఎస్ ప్లాయిడ్‌లోని సైబర్‌పంక్ 2077 'పిఎస్ 5-లెవల్' వద్ద నడుస్తుందా? ఎలోన్ మస్క్ ఏం చెప్పారు?

   12-06-2021

OnePlus Brings Nord CE 5G: వన్‌ప్లస్ లోనే అత్యంత సన్న మొబైల్

OnePlus Brings Nord CE 5G: వన్‌ప్లస్ లోనే అత్యంత సన్న మొబైల్

   11-06-2021

జి మెయిల్ ప్రతిరోజూ 100 మిలియన్ ఫిషింగ్ ప్రయత్నాలను బ్లాక్ చేస్తుంది: గూగుల్

జి మెయిల్ ప్రతిరోజూ 100 మిలియన్ ఫిషింగ్ ప్రయత్నాలను బ్లాక్ చేస్తుంది: గూగుల్

   10-06-2021

హానర్ బ్యాండ్ 6 : 24 గంటల హార్ట్ బీట్ రేట్ మానిటరింగ్, SpO2 సెన్సార్, 10 వర్కౌట్ మోడ్‌లు

హానర్ బ్యాండ్ 6 : 24 గంటల హార్ట్ బీట్ రేట్ మానిటరింగ్, SpO2 సెన్సార్, 10 వర్కౌట్ మోడ్‌లు

   10-06-2021

పబ్జి మొబైల్ లాగిన్ చేస్తుంటే నెట్‌వర్క్ ఎర్రర్ వస్తుందా! .. ఇలా చేయండి

పబ్జి మొబైల్ లాగిన్ చేస్తుంటే నెట్‌వర్క్ ఎర్రర్ వస్తుందా! .. ఇలా చేయండి

   09-06-2021

PUBG Mobile Godzilla vs. Kong: పబ్జి మొబైల్ 1.4 గ్లోబల్ డౌన్‌లోడ్ చేసి, ఇన్‌స్టాల్ చేయడం ఎలా?

PUBG Mobile Godzilla vs. Kong: పబ్జి మొబైల్ 1.4 గ్లోబల్ డౌన్‌లోడ్ చేసి, ఇన్‌స్టాల్ చేయడం ఎలా?

   08-06-2021

అంతరిక్షంలో అమెజాన్ బాసు

అంతరిక్షంలో అమెజాన్ బాసు

   08-06-2021

శామ్సంగ్ గెలాక్సీ ఎం 21 ప్రైమ్ ఎడిషన్

శామ్సంగ్ గెలాక్సీ ఎం 21 ప్రైమ్ ఎడిషన్

   07-06-2021

2021 లో ఆధిపత్యం చెలాయించే టాప్ 10 ఐటి కోర్సులు

2021 లో ఆధిపత్యం చెలాయించే టాప్ 10 ఐటి కోర్సులు

   06-06-2021

ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఖాతాకు ట్విట్టర్ బ్లూ బ్యాడ్జిని తొలగించింది.

ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఖాతాకు ట్విట్టర్ బ్లూ బ్యాడ్జిని తొలగించింది.

   05-06-2021

ఇంకా

Naresh

 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle